iDreamPost

బాయ్స్, లేడీస్ హాస్టల్స్‌లో బయటపడ్డ దారుణాలు.. అధికారుల ఎంట్రీతో..

Boys&Ladies Hostels: హాస్టల్స్ అంటే ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. హాస్టల్ లో ఉండడం నచ్చకపోయినా చాలా మందికి తప్పనిసరి పరిస్థితి. అక్కడ జరిగే దారుణాలు చూడలేక చాలా మంది రూమ్ లు తీసుకుని ఫ్రెండ్స్ తో ఉంటున్నారు. తాజాగా బాయ్స్ అండ్ లేడీస్ హాస్టల్స్ లో దారుణాలు బయటపడ్డాయి. అధికారుల ఎంట్రీతో హాస్టళ్ల అసలు రంగు బయటపడింది.

Boys&Ladies Hostels: హాస్టల్స్ అంటే ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. హాస్టల్ లో ఉండడం నచ్చకపోయినా చాలా మందికి తప్పనిసరి పరిస్థితి. అక్కడ జరిగే దారుణాలు చూడలేక చాలా మంది రూమ్ లు తీసుకుని ఫ్రెండ్స్ తో ఉంటున్నారు. తాజాగా బాయ్స్ అండ్ లేడీస్ హాస్టల్స్ లో దారుణాలు బయటపడ్డాయి. అధికారుల ఎంట్రీతో హాస్టళ్ల అసలు రంగు బయటపడింది.

బాయ్స్, లేడీస్ హాస్టల్స్‌లో బయటపడ్డ దారుణాలు.. అధికారుల ఎంట్రీతో..

వివిధ ప్రాంతాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి అనేక మంది విద్యార్థులు, నిరుద్యోగులు, హైదరాబాద్ కి వస్తుంటారు. సిటీలో అడుగుపెట్టగానే చాలా మందికి ఉన్న ఏకైక ఆప్షన్ హాస్టల్. కోర్సులు నేర్చుకునేందుకు వచ్చిన వాళ్ళు హాస్టల్ లో ఉంటారు. కొంతమంది ఉద్యోగాలు చేసుకునేవారు కూడా ఉంటారు. అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరి హాస్టల్స్ లో వారు సెపరేట్ గా ఉంటారు. హైటెక్ సిటీ, పంజాగుట్ట, అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ ఇలా చెప్పుకుంటూ పోతే ఆ మూల నుంచి ఈ మూల వరకూ అనేక బాయ్స్ అండ్ లేడీస్ హాస్టల్స్ ఉన్నాయి. హైదరాబాద్ లో అనేక లేడీస్ అండ్ బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి. వర్కింగ్ మెన్ హాస్టల్స్, వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్, పీజీ హాస్టల్స్, స్టూడెంట్ హాస్టల్స్, కామన్ హాస్టల్స్, లగ్జరీ హాస్టల్స్ ఇలా చాలానే హాస్టల్స్ ఉన్నాయి.

అయితే హాస్టల్స్ లో ఏం జరుగుతుందో అనేది బయట ఎవరికీ తెలియదు. ఒకరకంగా హాస్టల్ లో ఉండేవారికి కూడా తెలియని పరిస్థితి. చూసినా చూసీ చూడనట్టు వదిలేసే పరిస్థితి. ఆ ఏమవుద్దిలే అని పట్టించుకోవడమే మానేస్తారు. అయితే హాస్టల్స్ అంటే రాత్రి పూత జరిగే వ్యవహారాలు ఎలాగూ ఉండేవే. లేడీస్ హాస్టల్స్ దగ్గరకు బాయ్స్ వెళ్లడం.. వాళ్ళని కలవడం.. అర్ధరాత్రి వరకూ కబుర్లు చెప్పుకోవడం వంటివి ఉంటాయి. కొంతమంది అయితే పరిధి దాటి ప్రవర్తిస్తుంటారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ లోని పలు బాయ్స్, లేడీస్ హాస్టల్స్ లో దారుణాలు వెలుగులోకి వచ్చాయి. అధికారుల ఎంట్రీతో అసలు రంగు బయటపడింది. వివరాల్లోకి వెళ్తే..     

ఇటీవల కాలంలో వరుసగా హోటల్స్ పై దాడులు నిర్వహించిన అధికారులు.. తాజాగా హాస్టల్స్, పేయింగ్ గెస్ట్ హాస్టల్స్ పై దృష్టి సారించారు. ఈ క్రమంలో నగరంలోని పలు హాస్టల్స్ లో దాడులు నిర్వహించగా దారుణాలు బయటపడ్డాయి. హాస్టల్స్ లోని వంట గదుల్లో కుళ్లిపోయిన కూరగాయలు, ఎక్స్ పైర్ అయిపోయిన ఫుడ్ ఐటమ్స్ అధికారుల కంట పడ్డాయి. వాష్ ఏరియాల్లో చెత్త నిల్వ చేయడం, డ్రైనేజ్ ఓపెన్ గా ఉండడం, తుప్పు పట్టిన దోస పెనం వంటివి చూసిన అధికారులు హాస్టల్ నిర్వాహకులపై సీరియస్ అయ్యారు. సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ సూపర్వైజర్ హాస్టల్ లో లేరని హాస్టల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కావేరి హిల్స్ లోని శ్రీలక్ష్మి హాస్టల్ లో ఎక్స్ పైర్ అయిన వంట పదార్థాలు వాడుతున్నట్లు అధికారుల తనిఖీల్లో బయటపడింది.

ఎక్స్ పైర్ అయిన 2 కేజీ చాప్ మసాలా, 2 కేజీ ఎల్లో గ్రేవీ, 1 కేజీ వైట్ గ్రేవీ వంటి ఫుడ్ ఐటమ్స్ ని అధికారులు గుర్తించారు. కిచెన్ ఏరియాలో పరిశుభ్రత లేదని.. గ్రైండింగ్ ఏరియా కూడా అపరిశుభ్రంగా ఉందని తెలిపారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ లేకుండా హాస్టల్ ని నడుపుతున్నారని.. వాటర్ డిస్పెన్సర్ కూడా తుప్పు పట్టిపోయిందని.. భోజనం వడ్డించే ఏరియా కూడా శుభ్రంగా లేదని పేర్కొన్నారు. ఎక్స్ పైర్ అయిన ఆహార పదార్థాలను ఫుడ్ సేఫ్టీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కల్తీ జరిగిందన్న అనుమానంతో కారం, పప్పుల శాంపిల్స్ తీసుకెళ్లారు. కొన్నిటినీ అక్కడే చెక్ చేశారు. బియ్యం, పప్పులు, అల్లం, టమాటో సాస్ వంటివి సరిగా నిల్వ చేయడం లేదని హాస్టల్ నిర్వాహకులపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి