iDreamPost

భారీ అగ్ని ప్రమాదం.. 11 మంది సజీవ దహనం

Alipur Fire Incident: ఈ మధ్య తరుచూ ఎక్కడో అక్కడ అగ్ని ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి.. దేశ రాజధాని లో అగ్ని ప్రమాదం తీవ్ర కలకలం రేపింది.

Alipur Fire Incident: ఈ మధ్య తరుచూ ఎక్కడో అక్కడ అగ్ని ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి.. దేశ రాజధాని లో అగ్ని ప్రమాదం తీవ్ర కలకలం రేపింది.

భారీ అగ్ని ప్రమాదం.. 11 మంది సజీవ దహనం

మనిషి ప్రాణం ఏ క్షణంలో ఎలా పోతుందో ఎవరూ ఊహించలేరు. ఇటీవల దేశంలో పలు చోట్ల వరుస అగ్ని ప్రమాదాలు భయాందోళన కలిగిస్తున్నాయి. మానవ తప్పిదాలు, షాట్ సర్క్యూట్ ఇలా ఎన్నో కారణాల వల్ల అగ్ని ప్రమాదాలు సంభవించి ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. సాధారణంగా బాణా సంచా, కెమికల్, ప్లాస్టీక్ ఫ్యాక్టరీల్లో ఏదైనా అగ్ని ప్రమాదాలు జరిగితే వెంటనే కంట్రోల్ చేసేందుకు సేఫ్టీ ఫైర్ ఉపయోగించాల్సి ఉంటుంది. కానీ కొంతమంది నిబంధనలు పాటించకుండా ప్రమాదం ముంచుకొచ్చిన తర్వాత ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేసి హడావుడి సృష్టిస్తుంటారు. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే..

దేశ రాజధాని ఢిల్లీ అలీపూర్ లోని దయాల్ మార్కెట్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.. ఈ ఘటనలో పదకొండు మంది దుర్మరణం చెందారు.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఓ పేయింట్ ఫ్యాక్టరీలో గురువారం రాత్రి పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి.. ఆ మంటలు కాస్త సమీపంలోని షాపులకు ఇండ్లకు వ్యాపించాయి. వెంటనే స్థానికులు పోలీసులకు, ఫైర్ స్టేషన్ కిఫోన్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 22 ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపులోకి తెచ్చినప్పటికీ.. మరికొంతమంది ఆచూకీ లభించలేదు.. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఇప్పటి వరకు కాలిన స్థితిలో 11 మంది మృతదేహాలను స్వాధీనంం చేసుకున్నట్లు తెలిపారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు. మొదట పెయింట్ ఫ్యాక్టరీలో బాంబు పేలినట్లు శబ్ధం వచ్చిందని.. ఆ తర్వాత మంటలు చెలరేగి చుట్టుపక్కల వేగంగా వ్యాపించాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫ్యాక్టీరీలో రసాయనాల వల్లే పేలుడు సంభవించి ఉండవొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఏంటీ అన్న విషయం తెలియదు.. దర్యాప్తులో తెలుస్తుందని తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి