iDreamPost

గుండెపోటుతో ఇంజనీరింగ్‌ విద్యార్థి మృతి.. హాస్టల్లో కుప్పకూలగా

చిట్టి గుండె గట్టిగా పగబడుతోంది. అకారణంగా, అర్థంతరంగా ప్రాణాలను హరించేస్తోంది. ఇలా చూస్తున్న మనుషుల్ని.. అలా పట్టుకుపోతుంది గుండె పోటు.

చిట్టి గుండె గట్టిగా పగబడుతోంది. అకారణంగా, అర్థంతరంగా ప్రాణాలను హరించేస్తోంది. ఇలా చూస్తున్న మనుషుల్ని.. అలా పట్టుకుపోతుంది గుండె పోటు.

గుండెపోటుతో ఇంజనీరింగ్‌ విద్యార్థి మృతి.. హాస్టల్లో కుప్పకూలగా

ఇటీవల గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. కరోనా అనంతర పరిస్థితులు ఇందుకు కారణమౌతున్నాయి. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి కూడా హార్ట్ ఎటాక్ తో మరణిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా కీలక ప్రకటన చేసింది. ఒత్తిడితో కూడిన శారీరక శ్రమ చేయొద్దని సూచించింది. అలాగే మానసిక ఒత్తిడి, తీవ్ర ఆలోచన కూడా మంచిది కాదని పేర్కొంది. అయినప్పటికీ చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. కుటుంబాలను విషాదంలోకి నెడుతూ తిరిగి రాని లోకాలకు తరలి వెళ్లిపోతున్నారు. తాజాగా ఓ ఇంజనీరింగ్ విద్యార్థి హార్ట్ స్ట్రోక్ కారణంగా మృత్యువాత పడ్డాడు. ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

నల్లొండ జిల్లాలోని కొండమల్లేపల్లి మండలం గుమ్మడవెల్లి (దేవరోని తండా)కు చెందిన ఇస్లావత్ సిద్దు (20) ఇబ్రహీంపట్నంలోని శేరిగూడలోని శ్రీ దత్త కాలేజీలో ఇంజనీరింగ్ EEE మూడవ సంవత్సరం చదువుతున్నాడు. శేరిగూడలో ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నాడు. మధ్యాహ్నం 1.30 గంటలకు హాస్టల్లో స్నేహితులతో ఉండగా.. ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యాడు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆప్రమత్తమైన స్నేహితులు, హాస్టల్ సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ వెళ్లే మార్గంలోనే సిద్దు మరణించారు. వైద్యులు పరీక్షించి గుండె పోటుతో విద్యార్థి మృతి చెందినట్లు వెల్లడించారు.

ఈ విషయాన్ని సిద్దు తల్లిదండ్రులకు చేరవేశారు. గొప్ప చదువులు చదివి ఇంటికి ఆసరాగా, తమకు అండగా నిలుస్తాడని భావించిన తల్లిదండ్రులకు కుమారుడు ఇక లేడన్న వార్త చేరింది. అతడి మరణ వార్త విని కన్నీరుమున్నీరు అవుతున్నారు పేరెంట్స్, బంధువులు. కాగా, అప్పటి వరకు తమతో సంతోషంగా గడిపిన స్నేహితుడు అతడు లేడని తెలిసే సరికి కంటతడి పెడుతున్నారు. అతడి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించినట్లు తెలుస్తోంది.  పిల్లలపై ఎన్నో ఆశలను పెట్టుకుంటున్న కన్నవారికి..  గర్భశోకాన్ని మిగులుస్తుంది గుండెపోటు. పిల్లల చేతులో కన్నుమూయాలని, వారి చేతుల మీదుగా వెళ్లిపోవాలని ఆశపడుతున్న అమ్మనాన్నలు.. పిల్లలకే తలకొరివి పెట్టే పరిస్థితి వచ్చింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి