iDreamPost

TS:పీకలదాకా తాగి.. ఇంట్లో డ్రాప్ చేయమని 108కి కాల్‌ చేసిన మందుబాబు!

  • Published Feb 02, 2024 | 6:12 PMUpdated Feb 02, 2024 | 6:12 PM

ఈ మధ్యకాలంలో తాగుబోతులు చేసిన వీరంగం అంత ఇంత కాదు. మద్యం మత్తులో వీరు చేసిన చేష్టలు అనేవి తరుచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా ఓ తాగుబోతు మాత్రం, మత్తులో తాను ఎక్కడ రోడ్డు పై పడతనని చేసిన పనికి అంతా ఆశ్చర్యపోతున్నారు.

ఈ మధ్యకాలంలో తాగుబోతులు చేసిన వీరంగం అంత ఇంత కాదు. మద్యం మత్తులో వీరు చేసిన చేష్టలు అనేవి తరుచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా ఓ తాగుబోతు మాత్రం, మత్తులో తాను ఎక్కడ రోడ్డు పై పడతనని చేసిన పనికి అంతా ఆశ్చర్యపోతున్నారు.

  • Published Feb 02, 2024 | 6:12 PMUpdated Feb 02, 2024 | 6:12 PM
TS:పీకలదాకా తాగి.. ఇంట్లో డ్రాప్ చేయమని 108కి కాల్‌ చేసిన మందుబాబు!

సాధారణంగా మద్యం మత్తులో తాగుబోతులు చేసే వీరంగం అంత ఇంత కాదు. ఆ క్షణం వాళ్లు ఏం చేస్తున్నారో వాళ్లకే తెలియకుండా ప్రవర్తిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఇల్లు పీకి పందిరేస్తారు. ఇలా తాగిన మైకంలో లేనిపోని వివాదాలను పెట్టుకోవడం, ఆకతాయి పనులు చేయడం, హత్యలు చేయడం, ఇంట్లో వాళ్లను చిత్రహింసలు గురి చేయడం వంటి దారుణలకు ఒడిగడతారు. మరికొందరైతే మద్యం సేవించి వాహనాలు నడపడంతో ప్రమాదాల బారినపడుతుంటారు. తరుచుగా ఈ తాగుబోతులు సృష్టించిన అలజడులకు సంబంధించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూ ఉంటుంది. ఇలా మందుబాబులు చేసిన చేష్టలు కొన్ని నవ్వు తెప్పిస్తే మరికొన్ని చిరాకు తెప్పిస్తుంటాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ తాగుబోతు మాత్రం మద్యం మత్తులో.. తాను ఎక్కడ రోడ్డు మీద పడిపోతానేమోనని భయంతో చేసిన పని నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా అవుతోంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఎక్కడైన మద్యం మత్తులో ఉన్న వ్యక్తి వాహనం నడపడం కష్టంగా ఉన్నప్పుడు.. కుటుంబ సభ్యులకు గాని, స్నేహితులకు కానీ ఫోన్ చేస్తారు. అయితే తాజాగా ఓ తాగుబోతు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించాడు. మద్యం మత్తులో ఉన్న తాను ఎక్కడ రోడ్డుపై పడి పోతానేమోనని భయంతో.. ఏకాంగా 108 అంబులెన్స్ కు ఫోన్ చేశాడు. అది కూడా అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో తాను ఎమర్జెన్సీలో ఉన్నానని త్వరగా రావాలని అంబులెన్స్‌ సిబ్బందితో చెప్పాడు. దీంతో నిజంగానే ఎవరో అత్యవసర పరిస్థితుల్లో ఉన్నరని భావించిన అంబులెన్స్‌ సిబ్బంది ఆ వ్యక్తి చెప్పిన స్పాట్‌కు చేరుకున్నారు. దీంతో అక్కడున్న వ్యక్తిని ఆరా తీయగా అతడు చెప్పింది విని అంబులెన్స్‌ సిబ్బంది షాక్ గురైయ్యారు. ఎందుకంటే.. బాగా తాగేసి ఉన్న అతడే అంబులెన్స్ కాల్ చేశాడని, పైగా అతడిని జనగాం పట్టణంలో వదిలిపెట్టాలని అంబులెన్స్‌ సిబ్బందిని కోరాడు. ఇంతటి విచిత్ర సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో తిమ్మాపూర్‌ బైపాస్‌ దగ్గర బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వింత ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి, రొడ్డు పై పడిపోతననే భయంతో ఆ తాగుబోతు అంబులెన్స్ కి ఫోన్ చేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి