iDreamPost

గోవాలో ఈ బీచ్‌కి వెళ్తున్నారా? ఈ తప్పు చేస్తే ఫైన్ కట్టాల్సిందే!

Don't Do These Mistakes In Goa: గోవా వెళ్లే ఆలోచనలో ఉన్నారా? గోవా టూర్ ప్లాన్ చేశారా? అయితే ఈ రూల్ తెలుసుకోకపోతే మీరు నష్టపోతారు. ఈ తప్పు చేస్తే భారీగా ఫైన్ చెల్లించాల్సిందే. కాబట్టి ఈ రూల్ గురించి ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిందే.

Don't Do These Mistakes In Goa: గోవా వెళ్లే ఆలోచనలో ఉన్నారా? గోవా టూర్ ప్లాన్ చేశారా? అయితే ఈ రూల్ తెలుసుకోకపోతే మీరు నష్టపోతారు. ఈ తప్పు చేస్తే భారీగా ఫైన్ చెల్లించాల్సిందే. కాబట్టి ఈ రూల్ గురించి ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిందే.

గోవాలో ఈ బీచ్‌కి వెళ్తున్నారా? ఈ తప్పు చేస్తే ఫైన్ కట్టాల్సిందే!

భారతదేశంలో ఉన్న పర్యాటక ప్రదేశాల్లో ఎక్కువ మంది వెళ్లాలనుకునే టూరిస్ట్ ప్లేస్ గోవా. అక్కడ గోవా బీచుల్లో ఎంజాయ్ చేయడానికి పర్యాటకులు క్యూ కడుతుంటారు. స్వదేశీయులే కాకుండా విదేశాల నుంచి కూడా పర్యాటకులు గోవా నగరాన్ని సందర్శిస్తారు. ఇక్కడ బీచ్ లలో సేద తీరుతారు. నిత్యం వందల, వేల మంది గోవా పర్యటిస్తుంటారు. రీసెంట్ గా అన్ సీజన్ అయినప్పటికీ కోటి మంది టూరిస్టులు గోవా వెళ్లడంతో అరుదైన ఘనత గోవా ఖాతాలో పడింది. కాగా గోవా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆ బీచ్ కి వెళ్లాలంటే ఖచ్చితంగా ఈ రూల్ ని పాటించాల్సిందే. లేదంటే ఇక ఆ బీచ్ కి ఎప్పటికీ వెళ్ళలేరు.

గోవాలోని ప్రముఖ కలంగుట్ బీచ్ కి వెళ్లాలంటే ఇక నుంచి ముందుగానే రిజర్వేషన్ చేయించుకోవాలనే రూల్ ని తీసుకురానున్నారు. ఈ మేరకు స్థానిక పంచాయితీ అధికారులు తీర్మానం కూడా చేశారు. బీచుల్లో పర్యాటకులు చేస్తున్న పనుల కారణంగా అక్కడి పంచాయితీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశవిదేశాల నుంచి గోవా వచ్చే కొందరు పర్యాటకులు లేనిపోని సమస్యలు తెచ్చిపెడుతున్నారని.. మద్యం తాగేసి ఆ బాటిల్స్ ని అక్కడే ఇష్టం వచ్చినట్టు పడేసి వెళ్లిపోతున్నారని.. భోజనాలు, ఇతర ఆహార పదార్థాలు తినేసి ఆ చెత్తను అక్కడే పడేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల గోవా బీచ్ మొత్తం కలుషితం అవుతుందని.. దీనిపై చర్యలు చేపట్టాలని ఉత్తర గోవాలోని కలంగుట్ పంచాయితీ భావించింది.

ఈ క్రమంలో పర్యాటకుల చేష్టలను అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. ఈ బీచ్ కి వచ్చే పర్యాటకులు ముందుగానే రిజర్వేషన్లు చేసుకుని రావాలని నిర్ణయించింది. పర్యాటకుల నుంచి అదనంగా పన్ను కూడా వసూలు చేయాలని పంచాయితీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. భారీగా వస్తున్న పర్యాటకుల తాకిడిని తట్టుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల ప్రారంభంలో కలంగుట్ పంచాయితీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీచ్ లో చెత్తా చెదారం సమస్యపై చర్చించి అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

బహిరంగ ప్రదేశాల్లో వంట చేసుకుని అక్కడే మద్యం తాగి, తిని ఆ చెత్తంతా గ్రామంలో పడేసి పోతున్నారని తెలిపారు. అక్కడే  ఇష్టమొచ్చినచోట వాహనాలు పార్క్ చేస్తున్నారని.. దీని వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని అధికారులు వెల్లడించారు. కలంగుట్ గ్రామంలో ఉండేందుకు వచ్చేవారు హోటల్స్ లో రిజర్వేషన్ చేసుకోవడం లేదని.. అందుకే ఆ గ్రామానికి వచ్చే 5 మార్గాల్లో చెక్ పాయింట్లను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఇక్కడ హోటల్స్ లో రిజర్వేషన్ చేసుకునేవారికి ఎలాంటి ఫైన్లు ఉండవని.. అయితే రిజర్వేషన్ లేకుండా బహిరంగ ప్రదేశాల్లో వాహనాలు పార్కింగ్ చేసేవారికి, వంట చేసుకుని, మద్యం తాగే వారికి మాత్రం ఫైన్ వేస్తామని అన్నారు.  

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి