iDreamPost

వాల్తేరు వీరయ్య దర్శకుడి మెగా లీక్

వాల్తేరు వీరయ్య దర్శకుడి మెగా లీక్

పాత ఏడాది ముగుస్తోందన్న సంబరం కన్నా సంక్రాంతి కొత్త సినిమాలు ఎప్పుడెప్పుడు చూద్దామనే మూవీ లవర్స్ ఆత్రం పెరిగిపోతోంది. 2017 తర్వాత గ్యాప్ తీసుకుని చిరంజీవి బాలకృష్ణ నువ్వా నేనా అని తలపడటంతో పోటీ రసవత్తరంగా మారింది. వీళ్ళే కాకుండా అజిత్ తెగింపు, విజయ్ వారసుడు కూడా బరిలో ఉండటంతో అంచనాలు మాములుగా లేవు. ఒక్క ఈ సీజన్ నుంచే అయిదు వందల కోట్లకు మార్కెట్ తెలుగు రాష్ట్రాల్లో జరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా థియేటర్లకు సంబంధించి స్క్రీన్ల పంపకాల విషయంలో సందిగ్దత నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిన్న మెగా ఫ్యాన్స్ హైదరాబాద్ లో ఓ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు

దానికి దర్శకుడు బాబీతో పాటు మైత్రి నిర్మాతలు ఏపీ తెలంగాణ నుంచి మెగా ఫ్యాన్స్ సభ్యులు పాల్గొన్నారు. బెనిఫిట్ షోలతో పాటు రిలీజ్ విషయంలో ఎలాంటి సమస్యలు రావొచ్చో ఈ సందర్భంగా చర్చించుకున్నారు. ఫ్యాన్స్ కిక్ ఇచ్చే ఉద్దేశంతో బాబీ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాని ప్రకారం చిరంజీవి పాత్ర వాల్తేరు వీరయ్య ఇంట్రడక్షన్ పది రోజుల పాటు షూట్ చేశారు. ఓ పడవ మీద చిరుని అలలు తుఫాను భారీ వర్షం మధ్య డూప్ లేకుండా చిత్రీకరించామని అలాంటి సన్నివేశాలు ఇందులో చాలా ఉన్నాయని గూస్ బంప్స్ ఇచ్చే రేంజ్ లో అన్నీ కన్నుల పండుగలా ఉంటాయని మెగాస్టార్ స్టైల్ లోనే లీకిచ్చారు

సో సముద్రం మధ్య హీరో ఇంట్రో అని అర్థమైపోయింది. ఇటీవలే విదేశాల్లో పాటల చిత్రీకరణ పూర్తి చేసుకున్న వాల్తేర్ వీరయ్య ట్రైలర్ లాంచ్ జనవరి 4 వైజాగ్ జగదాంబ 70 ఎంఎం థియేటర్లో చేయబోతున్నారు. అదే నెల 8న ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే జరిగే అవకాశం ఉంది. ఇంకా తేదీలు వేదికలు అధికారికంగా కన్ఫర్మ్ కావాల్సి ఉంది. రెండు ఒకే బ్యానర్ కావడంతో వీరసింహారెడ్డితో ప్రతి విషయంలో వాల్తేరు వీరయ్య పోలిక తెచ్చుకోవాల్సి వస్తోంది. ఆల్రెడీ బాస్ పార్టీ ఛార్ట్ బస్టర్ అయ్యింది. నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి బాగానే రీచ్ అవుతోంది. టైటిల్ సాంగ్ ఇవాళ విడుదల చేస్తున్నారు. దీని తర్వాత జనవరి మొదటి వారంలో పూనకాలు లోడింగ్ సాంగ్ వచ్చేస్తుంది. చిరు రవితేజలు కలిసి స్టెప్పులు వేసింది ఇందులోనే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి