iDreamPost
android-app
ios-app

షూటింగ్‌లో ప్రముఖ నటికి తీవ్ర గాయాలు..ఆస్పత్రిలో చేరిక!

  • Published Jul 10, 2024 | 8:54 AM Updated Updated Jul 10, 2024 | 8:54 AM

Actress Hospitalized: సాధారణంగా షూటింగ్ సమయంలో నటీనటులు ఎంతో జాగ్రత్తలు తీసుకుంటారు. ఒకప్పుడు నటీనటులకు డూప్ ఉండేవారు.. కానీ ఈ మధ్య డూప్ లేకుండానే కొన్ని సన్నివేశాల్లో పాల్గొంటు ప్రమాదాల పాలవుతున్నారు.

Actress Hospitalized: సాధారణంగా షూటింగ్ సమయంలో నటీనటులు ఎంతో జాగ్రత్తలు తీసుకుంటారు. ఒకప్పుడు నటీనటులకు డూప్ ఉండేవారు.. కానీ ఈ మధ్య డూప్ లేకుండానే కొన్ని సన్నివేశాల్లో పాల్గొంటు ప్రమాదాల పాలవుతున్నారు.

  • Published Jul 10, 2024 | 8:54 AMUpdated Jul 10, 2024 | 8:54 AM
షూటింగ్‌లో ప్రముఖ నటికి తీవ్ర గాయాలు..ఆస్పత్రిలో చేరిక!

ఇటీవల సినిమా షూటింగ్స్ లో కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో నటీనటులు నేరుగా పాల్గొంటు ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. ఒకప్పుడు యాక్షన్ సీన్లలో నటించడానికి చాాలా వరకు డూప్ లే వాడేవారు.. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. కొంతమంది నటీనటులు అలాంటి సీన్లు నేచురల్ గా ఉండాలంటూ జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. కానీ అనుకోని ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రస్తుతం దక్షిణాది చిత్రాల్లో తనదైన అందాలతో కుర్రాళ్లకు గిలిగింతలు పెడుతూ స్టార్ హీరోలతో ఐటమ్ సాంగ్ లో నటిస్తున్న అందాల భామకు షూటింగ్ లో అనుకోని ప్రమాదం జరిగినట్లు ఆమె టీమ్ తెలిపారు. ఇంతకీ ఆ నటి ఎవరు..? ఏ మూవీ షూటింగ్ లో గాయం అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

గత ఏడాది బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రవితేజ నటించిన ‘వాల్తేరు వీరయ్య’ మూవీలో ‘బాస్ వేర్ ఈజ్ ద పార్టీ’ అంటూ ఎంట్రీ ఇచ్చింది హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా. మొదటి ఐటమ్ సాంగ్ సూపర్ డూపర్ హిట్ కావడంతో వరుస ఛాన్సులు దక్కించుకుంటుంది. పవన్ కళ్యాన్ – సాయి ధరమ్ తేజ్ కాంబోలో వచ్చిన బ్రో మూవీలో ఛాన్స్ దక్కించుకుంది. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ, దుల్కర్ సల్మాన్, బాబీ డియోల్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘NBK 109’ మూవీలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. తాజాగా ఊర్వశి రౌతేలా ఓ ప్రమాదంలో తీవ్ర గాయాలు అయ్యాయి.

బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వాల్తేరు వీరయ్య మూవీలో ఐటమ్ సాంగ్ లో నటించిన ఈ అమ్మడికి వరుసగా తెలుగు, తమిళ, హిందీ మూవీస్ లో ఛాన్సులు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి తో వాల్తేరు వీరయ్య మూవీ తర్వాత దర్శకుడు బాబీ, బాలకృష్ణతో మూవీ తీస్తున్నారు. ఈ మూవీ సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియో బ్యానర్లపై నాగవంశి, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇటీవల యానిమల్ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన బాలీవుడ్ నటుడు బాబీ డీయోల్, మాలీవుడ్ హీరో దుల్కన్ సల్మాన్, చాందిని చౌదరీ  ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘NBK 109’ మూవీలో బాలీవుడ్ బ్యూటీ ఉర్వశి రౌతేలా ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. షూటింగ్ సమయంలో హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నప్పుడు ఉర్వశి రౌతేలాకు తీవ్ర గాయం అయ్యిందట. అప్పటి నుంచి  తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నట్లు ఆమె టీమ్ తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఒక ఆసుపత్రిలో మెరుగైన వైద్య చికిత్స పొందుతున్నట్లు ఆమె టీమ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉన్నది. ఊర్వశి ప్రస్తుతం బాలకృష్ణ మూవీతో పాటు సన్నీడియోల్ నటిస్తున్న బాప్, సంజయ్ దత్, మిథున్ చక్రవర్తి నటిస్తున్న ‘ఇన్‌స్పెక్టర్‌ అవినాశ్‌-2’ మూవీస్ లో నటిస్తుంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss