iDreamPost
android-app
ios-app

NBK 109 మూవీ షూటింగ్ లో గాయపడ్డ స్టార్ హీరోయిన్!

  • Published Jul 09, 2024 | 7:46 PM Updated Updated Jul 09, 2024 | 7:46 PM

NBK 109 మూవీ షూటింగ్ లో ప్రమాదం జరిగింది. భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో స్టార్ హీరోయిన్ ను గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.

NBK 109 మూవీ షూటింగ్ లో ప్రమాదం జరిగింది. భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో స్టార్ హీరోయిన్ ను గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.

  • Published Jul 09, 2024 | 7:46 PMUpdated Jul 09, 2024 | 7:46 PM
NBK 109 మూవీ షూటింగ్ లో గాయపడ్డ స్టార్ హీరోయిన్!

సినిమా షూటింగ్స్ జరుగుతున్నప్పుడు అనుకోకుండా కొన్ని కొన్ని ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈ ప్రమాదాల్లో నటీ, నటులు గాయపడుతూ ఉంటారు. ఇలాంటి ఎన్నో సంఘటనలు మనం చూశాం. తాజాగా నందమూరి బాలకృష్ణ నటిస్తున్న NBK 109 మూవీ షూటింగ్ లో ప్రమాదం జరిగింది. భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో స్టార్ హీరోయిన్ కు గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకొంటోంది. ఈ మూవీ మూడో షెడ్యూల్ కోసం బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా హైదరాబాద్ వచ్చింది. ఈ చిత్రంలో ఊర్వశీ కీలక పాత్ర పోషిస్తోంది. అందులో భాగంగా యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో ఊర్వశీ తీవ్ర గాయాలపాలైనట్లు తెలుస్తోంది. దాంతో ఆమెను ఆస్పత్రిలో జాయిన్ చేసి.. చికిత్స అందిస్తున్నట్లు టీమ్ తెలిపింది. ఊర్వశీ రౌటేలా ఆరోగ్యపరిస్థితి గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా.. బాలకృష్ణ-బాబీ దర్శకత్వంలో వస్తున్న NBK 109 మూవీలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశితో పాటుగా యానిమల్ విలన్ బాబీ డియోలు, చాందిని చౌదరి కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని సితారా ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. SS థమన్ సంగీతం అందిస్తున్నాడు. బాలయ్య బర్త్ డే కానుకగా విడుదల చేసిన గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఊర్వశీ రౌటేలాకు గాయం కావడంతో.. శరవేగంగా సాగుతున్న షూటింగ్ కు బ్రేక్స్ పడ్డట్లు అయ్యింది. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss