iDreamPost

‘దూత’తో విక్రమ్ కుమార్​ ప్రయోగం.. సక్సెస్ అంత ఈజీ కాదు!

  • Author singhj Published - 08:16 PM, Wed - 29 November 23

ప్రముఖ డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ ‘దూత’ వెబ్ సిరీస్​తో ప్రేక్షకుల్ని పలకరించేందుకు రెడీ అయిపోయారు. ఈ సిరీస్​తో మంచి సక్సెస్ కొట్టాలని ఆయన చూస్తున్నారు.

ప్రముఖ డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ ‘దూత’ వెబ్ సిరీస్​తో ప్రేక్షకుల్ని పలకరించేందుకు రెడీ అయిపోయారు. ఈ సిరీస్​తో మంచి సక్సెస్ కొట్టాలని ఆయన చూస్తున్నారు.

  • Author singhj Published - 08:16 PM, Wed - 29 November 23
‘దూత’తో విక్రమ్ కుమార్​ ప్రయోగం.. సక్సెస్ అంత ఈజీ కాదు!

ఏదేమైనా సరే.. లవ్ స్టోరీలు, ఫ్యామిలీ డ్రామాలు, యాక్షన్ సినిమాలకి కాలం చెల్లిపోయిందనిపిస్తోంది. వాటికి దాదాపుగా అందరూ నీళ్ళొదిలేశారు. ఈ మధ్య వచ్చిన విరూపాక్ష, మొన్నమొన్ననే వచ్చిన మంగళవారం, ఆ మధ్య విడుదలైన పొలిమేర 2 లాంటి చిత్రాలు సాధించిన విజయాలు బాక్సాఫీసుని శాసిస్తున్నాయని చెప్పాలి. అందుకే కొత్త దర్శకులు, నిర్మాతలు కూడా భూతద్దం పెట్టి మరీ సూపర్ నేచురల్ కంటెంట్ గురించి, హారర్ థ్రిల్లర్స్ గురించి వెతుకుతున్నారు. ఇలాంటి కథలు దొరికితే చాలు భగవంతుడా అన్నట్టుగా పరిగెడుతున్నారు. దీంట్లో ఎలాంటి తప్పు లేదు. ప్రేక్షకులు ఏ కంటెంటునైతే ఎక్కువగా ఆదరిస్తున్నారో వాటి మీదే పరిశ్రమ ఆధారపడితీరాలి. అది బిజినెస్ ఎథిక్స్. మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరో కూడా చివరికి రెగ్యులర్ కంటెంటుకి దండం పెట్టేసి.. ప్రస్తుతం ఫాంటసీ జోనర్​ను ఆహ్వానించి, వశిష్టని ముందు వరసలోకి తీసుకొచ్చి, విశ్వంభర చిత్రాన్ని హుటాహుటిన ప్రారంభించేశారు. ఇంక మిగతా వాళ్ళెంత?

ఎప్పుడూ ఏదో ఒక విచిత్రమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటారు డైరెక్టర్ విక్రమ్ కే కుమార్. ప్రస్తుతం నాగచైతన్యతో దూత అనే వెబ్ సిరీస్ రూపొందించి ఓటిటీ మీద సక్సెస్ కొట్టడానికి ఆయన రెడీ అయ్యాడు. ఎనిమిది ఎపిసోడ్స్ తో వస్తున్న ఈ వెబ్ సిరీస్ దాదాపు రెండు సినిమాల కాలవ్యవధితో తయారైంది. థియేట్రికల్ అయినా, ఓటిటి అయినా కూడా ఇటువంటి జోనర్ కథలైతేనే పబ్లిక్ అట్రాక్ట్ అవుతారనే కాన్పిడెన్స్ విక్రమ్ వ్యక్తం చేయడం విశేషంగా అనిపించింది. పైగా ఈ వెబ్ సిరిస్ గురించి మాట్లాడుతూ.. విరూపాక్ష, మంగళవారం సినిమాలను కూడా రిఫర్ చేస్తూ మరీ దూత గురించి ముచ్చటించాడు విక్రమ్. అంటే ఆడియన్స్​ను ప్రిపేర్ చేయడానికి విక్రమ్ లాంటి డైరెక్టర్​కు కూడా అలాంటి మూవీస్ ప్రస్తావన తీసుకురాక తప్పలేదు. అదీ ఆ జోనర్ కంటెంట్ సాధించిన కమాండ్.

ఇంతకు ముందు హారర్ లవ్ స్టోరీ చెబితే నాగచైతన్య అటువంటి కథలైతే తనకి భయమని, ససేమిరా చేయలేనని తెగేసి చెప్పేయడంతో విక్రమ్ మళ్ళీ మరోసారి పెన్నుకి పదును బెట్టి దూత కథ రాసుకున్నాడు. అయితే ఇందులో చెయ్ జర్నలిస్టు పాత్రను పోషించడం ఒక ప్రత్యేకత. సినిమా రాయడం కన్నా వెబ్ సిరీస్ రాయడమే కష్టమని కూడా విక్రమ్ ఘంటా పథంగా చెప్పాడు. సినిమా కథకి అక్కడక్కడ ట్విస్టులుంటే చాలునని, అదే వెబ్ సిరీస్ అయితే ప్రతీ ఎపిసోడ్ ఎండింగ్​లో తర్వాతి ఎపిసోడ్​కు హుక్ ఉండి తీరాలని.. లేకపోతే కిక్కు రాదని అభిప్రాయపడ్డాడు విక్రమ్. ఈ రోజున ఓటిటిలో వెబ్ సిరీస్​లకు కొరతేం లేదని.. చూస్తున్న ఎపిసోడ్ గనక బాగోకపోతే ఆడియన్స్ వెంటనే ఛానెల్ మార్చేస్తాడన్నారు. అందుకే వాళ్ళని పర్ఫెక్టుగా కంట్రోల్ చేయాలంటే అంత దమ్మున్న జోనర్ అయితేనే నిలబడగలదన్నారు. అదే దూత అని విక్రమ్ గట్టిగా వాదిస్తున్నాడు. చూడాలి మరి దూత తెచ్చే సందేశం ఏంటో? ఎలాంటిదో? అయితే వరుస ఫ్లాపులతో ఉన్న ఆయన వెబ్ సిరీస్​ను సరిగ్గా డీల్ చేయలేకపోతే మాత్రం మరో ఫ్లాప్ తప్పదని విశ్లేషకులు అంటున్నారు. మరి.. దూత వెబ్ సిరీస్ కోసం మీరెంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: మంగళవారంలో పాయల్ రాజ్ పుత్ కు ఉన్న డిజార్డర్.. రియల్ లైఫ్ లో ఉంటుందా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి