iDreamPost

మంగళవారంలో పాయల్ రాజ్ పుత్ కు ఉన్న డిజార్డర్.. రియల్ లైఫ్ లో ఉంటుందా?

మంగళవారం సినిమాలో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కు ఉన్న డిజార్డర్ నిజ జీవితంలో కూడా ఉంటుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. సినిమా చూసిన అనంతరం అందరిలోనూ ఇదే చర్చ. దీనిలో నిజమెంతా? ఆ వివరాలు మీకోసం..

మంగళవారం సినిమాలో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కు ఉన్న డిజార్డర్ నిజ జీవితంలో కూడా ఉంటుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. సినిమా చూసిన అనంతరం అందరిలోనూ ఇదే చర్చ. దీనిలో నిజమెంతా? ఆ వివరాలు మీకోసం..

మంగళవారంలో పాయల్ రాజ్ పుత్ కు ఉన్న డిజార్డర్.. రియల్ లైఫ్ లో ఉంటుందా?

పాయల్ రాజ్ పుత్.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. “ఆర్ఎక్స్ 100” సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. అనంతరం “డిస్కోరాజా, వెంకీమామ” వంటి సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటించింది. ఇటీవలే “మంగళవారం” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ సొంతం చేసుకుంది. విడుదలై రోజులు గడుస్తున్నా ఇప్పటికీ మంచి వసూళ్లు రాబడుతుంది. అయితే.. ఈ సినిమా చూసిన వారికి.. హీరోయిన్ కి ఉన్న డిజార్డర్ పై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలాంటి వింత రుగ్మత నిజ జీవితంలో కూడా ఉంటుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. మరి..ఆ వింత రుగ్మత స్టోరీ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మంగళవారం సినిమాలో పాయల్ రాజ్ పుత్.. శైలు పాత్రలో అద్భుతంగా నటించింది. ఇక ఈ సినిమాలో పాయల్ కి ఓ అరుదైన డిజార్డర్ ఉంది. దాని పేరే “హైపర్ సె*క్స్ వల్ డిజార్డర్”. దీని కారణంగా సినిమాలో హీరోయిన్ నరకం అనుభవిస్తుంది. ఇక ఈ “హెచ్ఎస్డీ డిజార్డర్” కారణంగా.. ఆమె మగవారి పట్ల శారీరికంగా ఎక్కువగా ఆకర్షితురాలు అవుతూ ఉంటుంది. అంతేకాక ఆ సమయంలో తాను ఏం చేస్తున్నానో, ఎక్కడ చేస్తున్నానో అనే విషయాన్ని కూడా పట్టించుకోదు.. ఇలాంటి వింత రుగ్మత చాలా అరుదుగా వస్తుందని సినిమాలో డాక్టర్ వెల్లడిస్తాడు. అయితే.. ఇలాంటి ఓ డిజార్డర్ సినిమా కోసం వాడుకున్నారా? నిజంగానే ఇలాంటి ఓ డిజార్డర్ ఉందా అంటే? షాకింగ్ నిజాలు తెలుస్తున్నాయి.

మంగళవారంలో కనిపించిన ఈ డిజార్డర్ పై అమెరికన్ సైకలాజీకల్ అసోసియేషన్ వాళ్లు కీలక విషయాలను వెల్లడించారు. ఎవరైతే ఫిజికల్ రీలెషన్ ఎక్కువగా పెట్టుకోవాలని, అలాంటి యాక్టీవిటీస్ ఎక్కువ చేయాలని కోరుకుంటారో.. అలాంటి వాళ్లకు ఈ డిజార్డర్ ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉందని తెలిపారు. వర్డల్ పాపులేషన్ లో 3నుంచి 6 శాతం మంది ఈ డిజార్డర్ ను ఎదుర్కొంటున్నారంట. ఇది సైకాలజీకల్, ఫిజికల్ గా కంబైన్ డిజార్డర్ కాబట్టి.. ఇది రావడానికి పలు కారణాలు ఉన్నాయి. సాధారణంగా భూమి మీద ఉండే జీవరాశులు తమ జాతిని పునరుత్పత్తి చేసేందుకు లైంగిక ప్రక్రియలో పాల్గొంటాయి. మనిషి కూడా ఒక జీవే కాబట్టి.. కొన్ని నియమ నిబంధనలు పెట్టుకుని ఈ ప్రక్రియలో పాల్గొంటారు. అయితే కొందరిలో కొన్ని హార్మోన్ల ఇన్ బ్యాలెన్సన్ కారణంగా హెచ్ ఎస్ డీ డిజాస్టర్ వస్తుంటుంది. అయితే వ్యక్తిని బట్టి, వారి ప్రవర్తన బట్టి ఈ డిజార్డర్ తీవ్రత ఉంటుంది. కొత్త వారితో కలవాలనే కోరిక ఉంటుంది. మరికొందరిలో ఇలాంటి ఘటనలకు గురైన కూడా మళ్లీ పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, ఆక్సిటోసిన్ అనే హార్మోనో హెచ్ ఎస్ డిజార్డర్‌లో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీనికి తోడు నిజ జీవితంలో ఎదుర్కొనే కొన్ని సంఘటనలు కూడా కూడా ఇలాంటి డిజార్డర్ రావడానికి కారణం అవుతుంది.

మంగళవారం మూవీలో పాయల్ హెచ్ ఎస్ రుగ్మతకు గురికావడానికి అనేక కారణాలు ఉన్నాయి. హీరోయిన్ బాల్యంలో.. తన స్నేహితుడి తండ్రి మిస్ బిహేవ్ చేయడంతో ఒక రకమైన ఆందోళనకు గురవుతుంది. అలానే కుటుంబంలో తన తండ్రి, సవతి తల్లిల ప్రవర్తనకు మానసికంగా ఇబ్బందులను ఎదుర్కొంటుంది. కాలేజీ టైమ్ లో లెక్చర్.. పాయల్ ను శారీరకంగా వాడుకుని మోసం చేస్తాడు. దీంతో ఆమెలో ఈ రుగ్మత అనేది మరింత ఎక్కువైంది. ఈ క్రమంలోనే తనను మగవారు ఎవరు టచ్ చేసినా.. ఆమె తెలియకుండానే హెచ్ ఎస్ డీకి గురవుతుంది. పరిసరాలతో, వ్యక్తితో సంబంధం లేకుండా కలిసిపోతుంది. ఆ తరువాత పశ్చాతాపంతో మానసికంగా కుంగిపోతుంది. తన బాధను ఎవరితో చెప్పుకోలేక మానసింకగా కుంగిపోతుంది. నిజ జీవితంలో ఇలాంటి ఘటనలు కూడా హెచ్ ఎస్ డీ డిజార్డర్ కు కారణం అవుతాయట. మరి.. ఇలాంటి డిజార్డర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి