iDreamPost

CRPF జవాన్‌ దారుణం.. ఆ కారణంతో పెళ్లైన మూడు నెలలకే..

పెళ్లైన మూడు నెలలకే దారుణం చోటుచేసుకుంది. సీఆర్పీఎఫ్ జవాన్ ఆ కారణంతో భార్యపై దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే?

పెళ్లైన మూడు నెలలకే దారుణం చోటుచేసుకుంది. సీఆర్పీఎఫ్ జవాన్ ఆ కారణంతో భార్యపై దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే?

CRPF జవాన్‌ దారుణం.. ఆ కారణంతో పెళ్లైన మూడు నెలలకే..

ఇటీవలి కాలంలో భార్యాభర్తల మధ్య తలెత్తే చిన్న చిన్న గొడవలు దారుణాలకు దారితీస్తున్నాయి. కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు భార్యాభర్తల మధ్య చిచ్చు రగిలిస్తున్నాయి. అన్యోన్యంగా కలకాలం కలిసి జీవించాల్సిన ఆలుమగలు మనస్పర్ధలతో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోవడం, పెత్తనం చెలాయించడం వంటి కారణాలు భార్యాభర్తలు విడిపోయే వరకు దారితీస్తున్నాయి. ఈ క్రమంలో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ దారుణానికి పాల్పడ్డాడు. పెళ్లైన మూడు నెలలకే ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకుని ఆమెను అందమొందించాడు సీఆర్పీఎఫ్ జవాన్. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది.

సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన ఓ జవాన్ మూర్ఖుడిలా ప్రవర్తించాడు. దేశ రక్షణకై ప్రాణాలర్పించే జవాన్.. తన భార్యపై అనుమానంతో ఆమె ప్రాణాలను తీశాడు. అంతేకాదు ఆ నేరాన్ని మరొకరిపై మోపేందుకు ప్రయత్నించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా బంగారమ్మపేట గ్రామానికి చెందిన తాడుతూరి అనూష (22)ను జూన్‌ 16న రాత్రి 11 గంటల సమయంలో భర్త నక్కా జగదీష్‌(30) నైలాన్‌ తాడు మెడకు బిగించి హతమార్చాడు. ఆ తర్వాత గతంలో ఉన్న పరిచయాలతో ప్రసాద్‌ వేధిస్తున్నాడని, అందుకే చనిపోతున్నానని ఆమె ఫోన్ నుంచి అనూష తండ్రి, అన్న, స్నేహితురాలు, భర్త(జగదీష్‌)కు మెసేజ్ లు పంపించాడు.

అయితే ఇదే నిజమని నమ్మిన మృతురాలి కుటుంబ సభ్యులు ప్రసాద్ ఇంటిపై దాడికి యత్నించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్ ఐ మహేష్ సిబ్బందితో గ్రామానికి చేరుకుని పరిస్తితిని చక్కదిద్దారు. ఇక్కడే మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రసాద్ ఇంటికి కొంత దూరంలో అనూష మృతదేహం పడి ఉంది. దీంతో ప్రసాద్ ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో ప్రసాద్ కు మృతురాలు అనూషకు మధ్య సంవత్సర కాలంగా ఎలాంటి కాంటాక్ట్ గాని, కాల్ చేసుకున్నట్టు లేదని తేలింది. అయితే మృతురాలి ఫోన్ నుంచి ఒకేసారి నలుగురికి మెసేజ్ లు ఎలా పంపబడ్డాయన్న కోణంలో ఆరా తీశారు. వెంటనే ఆమె భర్తను విచారించడంతో అసలు ఘోరం వెలుగు చూసింది.

కాగా సీఆర్పీఎఫ్ జావాన్ నక్క జగదీష్ తనకు ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేసినందుకు అనూషను పుట్టింట్లోనే వదిలి ఉద్యోగానికి వెళ్లిపోయాడు. ఇక అప్పటి నుంచి ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఆమెను అంతమొందించాలని పథకం వేశాడు. ఈనెల 16న రాత్రి బంగారమ్మపేట గ్రామానికి వచ్చి.. భార్యను ఇంట్లోంచి బయటకు రమ్మని పిలిచాడు. ఆమె ప్రవర్తనపై ప్రశ్నించగా.. కేకలు వేయడంతో అప్పటికే జేబులో ఉన్న నైలాన్ తాడును మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. కాగా నిందితుడు నేరం నుంచి తప్పించుకునేందుకు యూట్యూబ్ లో పట్టుబడకుండా నేరం ఎలా చేయాలనే దానిపై సెర్చ్‌ చేసి తెలుసుకున్నాడు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా అడ్డంగా దొరికిపోయాడు. ఈ నేపథ్యంలో నిందితుడు జగదీష్‌ను శనివారం అరెస్టు చేశాం అని డీఎస్పీ వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి