iDreamPost

దర్శన్ కుటుంబంలో మరో ట్విస్ట్! A1 గా దర్శన్ భార్యపై కేసు నమోదు!

  • Published Jun 19, 2024 | 12:13 PMUpdated Jun 19, 2024 | 12:15 PM

ఇప్పటికే రేణుకాస్వామి హత్య కేసులో ప్రధాన నిందుతుడిగా ఉన్న భర్త కన్నడ నటుడు దర్శన్ కాపాడుకోవడం కోసం ఆయన భార్య విజయలక్ష్మి శత విధాలుగా ప్రయత్నిస్తుంది. అయితే ఇలాంటి సమయంలో..దర్శన్ అతని భార్యకు మరో ఊహించని షాక్ ఎదురైంది. భర్తను కపాడుకోవాలనే ప్రయత్నంలో.. విజయలక్ష్మికి కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. ముఖ్యంగా విజయలక్ష్మిని ఓ కేసులో ఏ1 నిందుతురాలిగా పోలీసులు చేర్చారు.

ఇప్పటికే రేణుకాస్వామి హత్య కేసులో ప్రధాన నిందుతుడిగా ఉన్న భర్త కన్నడ నటుడు దర్శన్ కాపాడుకోవడం కోసం ఆయన భార్య విజయలక్ష్మి శత విధాలుగా ప్రయత్నిస్తుంది. అయితే ఇలాంటి సమయంలో..దర్శన్ అతని భార్యకు మరో ఊహించని షాక్ ఎదురైంది. భర్తను కపాడుకోవాలనే ప్రయత్నంలో.. విజయలక్ష్మికి కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. ముఖ్యంగా విజయలక్ష్మిని ఓ కేసులో ఏ1 నిందుతురాలిగా పోలీసులు చేర్చారు.

  • Published Jun 19, 2024 | 12:13 PMUpdated Jun 19, 2024 | 12:15 PM
దర్శన్ కుటుంబంలో మరో ట్విస్ట్! A1 గా దర్శన్ భార్యపై కేసు నమోదు!

ప్రముఖ స్టార్ హీరో దర్శన్ కేసు విషయం కన్నడ పరిశ్రమలో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కాగా, ఆయన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్, అతని ప్రియురాలు నటి పవిత్ర గౌడ ఇప్పటికే ప్రధాన నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురుని అరెస్ట్ చేసి విచారిస్తున్న క్రమంలో.. ఈ కేసులోని రోజుకొక కొత్త విషయాలు బయటపడుతున్నాయి. దీంతో ఈ కేసులో మరింత కీలకమైనది మారింది. మరొపక్క ఇండస్ట్రీ మొత్తం దర్శన్ కు కాస్త వ్యతిరేకంగా ఉన్నారు. పైగా తప్పుడు చేసిన వారికి శిక్షపడేలా చూడాలని తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఇలాంటి సమయంలో దర్శన్ ఈ కేసు నుంచి తప్పించుకోవడం కాదు కదా.. కనీసం బెయిల్ వచ్చే బెయిల్ దాఖాలు కూడా కనిపించడం లేదు. కానీ, ఈ కేసులో దర్శన్ కాపాడేందుకు ఆయన భార్య విజయలక్ష్మి శత విధాలుగా ప్రయత్నిస్తుంది. అంతేకాకుండా.. ఈ కేసులో లాయర్ ను కూడా నియమించి దర్శన్ ను బెయిల్ మీద బయటకు విడుదల చేసేందుకు ఎంతగానో కృషి చేస్తుంది. కాగా, ఇందులో భాగంగానే దర్శన్ భార్య విజయలక్ష్మి పలువురు న్యాయవాదులకను కలుస్తోంది. అయితే ఇంతలోనే దర్శన్ అతని భార్యకు మరో ఊహించని షాక్ ఎదురైంది. భర్తను కపాడుకోవాలనే ప్రయత్నంలో.. విజయలక్ష్మికి కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. ముఖ్యంగా విజయలక్ష్మిని ఓ కేసులో ఏ1 నిందుతురాలిగా పోలీసులు చేర్చారు. పైగా ఆమెపై చార్జిషీటును కూడా సమర్పించనున్నారు. ఇంతకి ఏం జరిగిందంటే..

నటుడు దర్శన్ , అతని భార్య విజయ్ లక్ష్మి పై గతేడాది జనవరిలో అటవీశాఖ కేసు నమోదు చేశారు. అయితే మైసూర్ లోని ఉన్న దర్శన్ ఫామ్ హోస్ లో పోలీసులు సోదాలు నిర్వహించిన సమయంలో.. బార్ హెడ్డ్ గూస్ ( మంగోలియా జాతికి చెందిన లేత బూడిద రంగు పక్షులు) పక్షులను అక్రమంగా పెంచుతున్నరనే కారణంతోనే ఫారెస్ట్ అధికారులు వీరిపై కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం ఆ పక్షులను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ పక్షులను దాచి ఉంచడం చట్ట రీత్యా నేరం. ఈ క్రమంలోనే.. విజయలక్ష్మి దర్శన్, మేనేజర్ నాగరాజు, మైసూర్ ఫామ్ హౌస్ యజమాని దర్శన్‌లపై అప్పటిలో అక్రమంగా పక్షుల పెంపకం కింద కేసు నమోదు చేసి విచారణకు పిలిచారు. అయితే  ఈ కేసులో విజయలక్ష్మి ఏ1, నాగరాజు ఏ2, దర్శన్ ఏ3 ఉన్నారు. కానీ, కేసు నమోదు అయినా తర్వాత ఎవరూ విచారణకు వెళ్లలేదు. దీంతో  ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి కోర్టుకు చార్జిషీటు సమర్పించేందుకు అటవీశాఖ సిబ్బంది సిద్ధమయ్యారు.

కాగా, ఇప్పటికే రేణుకా స్వామి హత్య కేసులో ఇరుక్కున్న దర్శన్ పై.. ఇప్పుడు అటవీ శాఖ కేసు కూడా నమోదు కావడంతో హీరో పరిస్థితి మరింత కష్టంగా మారనుంది. అయితే కొత్తగా ఇప్పుడు ఈ కేసులో విజయలక్ష్మి ఏ1గా ఉండడంతో ఆమె కూడా విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఛార్జిషీటు దాఖలు చేసిన తర్వాత కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది కూడా ఆసక్తిగా మారింది. ఇక మరోవైపు దర్శన్‌కు చెందిన ఫామ్‌హౌస్‌లో మేనేజర్‌గా పనిచేసిన శ్రీధర్ ఏప్రిల్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా, ఈ అంశం పై ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు దర్శన్ మేనజర్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏమిటి అనే కోణంలో కూడా కేసును విచారించడానికి మరింత అవకాశం ఉంది.మరి, దర్శన్, అతని భార్య పై మరో కేసు నమోదు కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి