iDreamPost
android-app
ios-app

ఇలాంటి ఛాన్స్‌ మళ్లీ రాదు.. ఇంటర్‌ పాసైతే సాఫ్ట్‌వేర్‌ జాబ్‌

  • Published May 30, 2024 | 4:02 PM Updated Updated May 30, 2024 | 4:02 PM

మీరు ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇంటర్ పాసైతే చాలు సాఫ్ట్ వేర్ జాబ్ పొందొచ్చు. అంతేకాదు ఉన్నత చదువులు కూడా చదవొచ్చు.

మీరు ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇంటర్ పాసైతే చాలు సాఫ్ట్ వేర్ జాబ్ పొందొచ్చు. అంతేకాదు ఉన్నత చదువులు కూడా చదవొచ్చు.

  • Published May 30, 2024 | 4:02 PMUpdated May 30, 2024 | 4:02 PM
ఇలాంటి ఛాన్స్‌ మళ్లీ రాదు.. ఇంటర్‌ పాసైతే సాఫ్ట్‌వేర్‌ జాబ్‌

ఇటీవల ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో పలువురు విద్యార్థులు రికార్డ్ స్థాయి మార్కులతో సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇక ఇంటర్ పాసైన విద్యార్థులు ఉన్నత చదువులపై దృష్టిసారించారు. కెరీర్ బాగుండాలంటే ఏయే కోర్సులు చేయాలి? ఫ్యూచర్ లో డిమాండ్ ఉన్న కోర్సులు ఏవీ? తక్కువ సమయంలో ఉపాధి అవకాశాలు పొందాలంటే ఏ కోర్సులు చదవాలని ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు సాఫ్ట్ వేర్ జాబ్ పొందే అవకాశం వచ్చింది. ఇంటర్ తోనే సాఫ్ట్ వేర్ జాబ్ పొంది, ఉన్నత చదువులు కూడా చదువుకోవచ్చు. ఎలా అంటే?

సాఫ్ట్ వేర్ ఉద్యోగాల పట్ల యూత్ ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. లక్షల్లో జీతాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, వారానికి రెండు రోజులు సెలవులు వంటి సదుపాయాలు ఉండడంతో ఐటీ జాబ్స్ కు డిమాండ్ ఎక్కువ. అయితే మీరు ఇంటర్ పూర్తి చేస్తే చాలు ఉద్యోగులుగా మారే అవకాశం వచ్చింది. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తూ బిట్స్‌ పిలానీ, శాస్త్ర, అమిటీ లాంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలలో ఉన్నత చదువు కొనసాగించే వెసులుబాటు ఇంటర్ విద్యార్థులకు ఉందని ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కే. చంద్రశేఖర్‌ బాబు ఒక ప్రకటనలో వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ఇంటర్ పాసైన విద్యార్థులకు ఈ గోల్డెన్ ఛాన్స్ లభించిందన్నారు. 75 శాతం మార్కులతో ఇంటర్‌ పూర్తి చేసిన అన్ని గ్రూపుల నాన్‌ మ్యాథ్స్‌ స్టూడెంట్స్ కు ఇంటర్మీడియట్‌ బోర్డు, హెచ్‌సీఎల్‌ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయన్నారు. ఈ ఉద్యోగాల కోసం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా సుమారు 500 మంది విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకొన్నారని, వీరికి ఇంటర్మీడియట్‌ బోర్డ్‌, హెచ్‌సీఎల్‌ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 31న భీమవరంలోని ఆదిత్య జూనియర్‌ కళాశాలలో ఉదయం 9 నుంచి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభిస్తారని చెప్పారు. పూర్తి సమాచారం కోసం 9642973350 నెంబర్‌లో సంప్రదించవచ్చని ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారి తెలిపారు.

అర్హులు ఎవరంటే?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 2022–23, 2023–24 విద్యా సంవత్సరాలలో ఇంటర్మీడియట్‌ విద్యను 75 శాతం మార్కులతో పూర్తి చేసిన విద్యార్థులు, ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇంటర్‌ చదువుతున్న విద్యార్థులు ఈ ఉద్యోగాలకు అర్హులన్నారు.

ఎంపిక ప్రక్రియ:

అప్లై చేసుకున్న అభ్యర్థులకు తొలుత క్యాట్‌ పరీక్ష, ఇంటర్వ్యూ, చివరిగా ఇంగ్లీష్‌ వెర్షన్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ మూడింటిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఏడాదిపాటు ట్రైనింగ్ ఇస్తారు. బైపీసీ, సీఈసీ, హెచ్‌ఐసీ, ఒకేషనల్‌ గ్రూపులు చదివిన విద్యార్థులు డీపీఓ విభాగంలో ఉద్యోగం పొందవచ్చన్నారు.

స్టైఫండ్:

అభ్యర్థులకు శిక్షణ సమయంలో ఏడో నెల నుంచి నెలకు రూ.10 వేలు చొప్పున స్టైఫండ్‌ ఇస్తారు.

Jojobet Girişgrandpashabet girişHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetpoliwinJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetSonbahisjojobetjojobetcasibomberlinbetjojobetcasibomcasibom girişchild pornjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio