iDreamPost

ప్రపంచ క్రికెట్‌ను ఏలిన ఆటగాడి ఇళ్లు చూడండి ఎలా ఉందో!

  • Published Jun 20, 2024 | 1:21 PMUpdated Jun 20, 2024 | 1:21 PM

Chris Gayle, Jamaica Home: తన విధ్వంసకర ఆటతో ప్రపంచ క్రికెట్‌ను ఒక ఊపు ఊపిన దిగ్గజ క్రికెట్‌కు సంబంధించిన ఇళ్ల అంటూ ఒక ఫొటో వైరల్‌ అవుతోంది. అసలు ఆ ఇళ్లు ఏ క్రికెటర్‌ది? ఎక్కడుంది? లాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Chris Gayle, Jamaica Home: తన విధ్వంసకర ఆటతో ప్రపంచ క్రికెట్‌ను ఒక ఊపు ఊపిన దిగ్గజ క్రికెట్‌కు సంబంధించిన ఇళ్ల అంటూ ఒక ఫొటో వైరల్‌ అవుతోంది. అసలు ఆ ఇళ్లు ఏ క్రికెటర్‌ది? ఎక్కడుంది? లాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jun 20, 2024 | 1:21 PMUpdated Jun 20, 2024 | 1:21 PM
ప్రపంచ క్రికెట్‌ను ఏలిన ఆటగాడి ఇళ్లు చూడండి ఎలా ఉందో!

పైన ఫొటోలో కనిపిస్తున్న ఇళ్లు చూశారు కదా.. అందులో ప్రపంచ క్రికెట్‌ను ఒంటి చేత్తో శాసించిన ఓ దిగ్గజ క్రికెటర్‌ నివసించాడు అంటూ చాలా మంది నమ్మకపోవచ్చు. ప్రస్తుతం క్రికెట్‌ అంటూ నాట్‌ ఓన్లీ ఏ గేమ్‌.. బిజినెస్‌గా కూడా మారిపోయింది. ఫ్రాంచైజ్‌ క్రికెట్‌ ఎంట్రీతో క్రికెటర్ల తలరాతలే మారిపోయాయి. దేశానికి ఆడుతూనే ఫ్రాంచైజ్‌ క్రికెట్‌ ఆడే క్రికెటర్లపై కోట్ల వర్షం కురుస్తోంది. అలాంటి ఫ్రాంచైజ్‌ క్రికెట్‌కి గాడ్‌ లాంటి ఆటగాడి ఎంతలా సంపాదించి ఉంటాడో కదా. వందల కోట్ల ఆస్తి కూడబెట్టి ఉంటాడు. కానీ, ఆ క్రికెటర్‌.. ఈ చిన్న ఇంట్లో ఉన్నాడంటే నమ్మకం నిజంగా కాస్త కష్టమే. కానీ, తన పేదరికాన్ని కూకటి వేళ్లతో సైతం పెకళిస్తూ.. వందల కోట్ల ఆస్తి, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఓ దిగ్గజ క్రికెటర్‌ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

క్రిస్‌ గేల్‌.. ఈ పేరు తెలియని క్రికెట్‌ అభిమాని ఉండడు, అలాగే అతని విధ్వంసకర ఆట చూసి భయపడని బౌలర్‌ కూడా ప్రపంచ క్రికెట్‌లో ఉండటం. విధ్వంసకర బ్యాటింగ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌ లాంటి క్రిస్‌ గేల్‌.. వెస్టిండీస్‌ క్రికెట్‌లో ఒక వెలుగు వెలిగిన సూపర్‌ స్టార్‌ క్రికెటర్‌. అలాగే ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అన్ని ఫ్రాంచైజ్‌ లీగ్‌ క్రికెట్‌లో తనదైన మార్క్‌ చూపించి.. బౌలర్లను చెడుగుడు అడుకున్న క్రికెటర్‌. అందుకే అతన్ని అంతా యూనివర్సల్‌ బాస్‌ అని పిలుస్తారు. ఆటలో ఎంత విధ్వంసం సృష్టిస్తాడో.. ఆఫ్‌ ది ఫీల్డ్‌ అంత స్టైలిష్‌గా ఉంటాడు గేల్‌. ఆటతో కీర్తితో పాటు రాజభోగాలు తన కాళ్ల దగ్గరకు తెచ్చుకున్న క్రిస్‌ గేల్‌.. తన చిన్నతనంలో ఎలాంటి పేదరికం అనుభవించాడో చెప్పేందుకు అతను నివసించిన ఈ ఇంటి ఫొటో ఒక్కటి చాలు.

తన కష్టాన్ని కసిగా మార్చి.. ఆటలో చెమట చిందించి.. ఆ చెమటతోనే తన పేదరికాన్ని తుడిచిపెట్టేశాడు క్రిస్‌ గేల్‌. చాలా మంది గేల్‌ సక్సెస్‌ను చూశారు కానీ, ఆ సక్సెస్‌ వెనుక ఉన్న స్ట్రగుల్‌ను చాలా తక్కువ మంది చూశారు. 1979 సెప్టెంబర్ 21న జమైకాలోని కింగ్‌స్టన్లో జన్మించాడు గేల్‌. అతని పూర్తి పేరు క్రిస్టోఫర్ క్రిస్ హెన్రీ గేల్. గేల్‌ బాల్యంలో అతని కుటుంబం చాలా పేదరికంలో ఉండేది. ఒక చిన్న ఇంట్లో.. మురికివాడలో నివసించే వారు. అయితే.. క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్న గేల్‌.. అంచెలంచెలుగా ఎదుగుతూ.. 1999 సెప్టెంబర్‌ 11న ఇండియాతో జరిగిన వన్డే మ్యాచ్‌తోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత అతను ఎలాంటి విధ్వంస సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

క్రిస్ గేల్‌ 103 టెస్టు మ్యాచ్‌లు ఆడి 7214 పరుగులు చేశాడు. అందులో 15 సెంచరీలు, 37 అర్థసెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో 73 వికెట్లు కూడా సాధించాడు. ఇక 301 వన్డేలు ఆడి 10480 పరుగులు సాధించాడు. అందులో 25 సెంచరీలు, 54 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. వన్డేలలో అతని అత్యధిక స్కోరు 215గా ఉంది. బౌలింగ్‌లో 167 వన్డే వికెట్లు కూడా పడగొట్టాడు. గేల్‌ బ్యాటింగ్‌ శైలికి బాగా సరిపోయే టీ20 ఫార్మాట్‌లో 79 మ్యాచ్‌లు ఆడి 1899 పరుగులు చేశాడు. అందులో 2 సెంచరీ, 14 హాఫ్‌ సెంచరీలున్నాయి. టీ20ల్లో కూడా 20 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంతటి ఖ్యాతి సాధించి.. గొప్ప క్రికెటర్‌గా పేరు పొందిన గేల్‌.. బాల్యంలో అనుభవించిన పేదరికం, దానితో పోరాడి అతను ఎదిగిన తీరు ఎందరికో స్ఫూర్తిదాయకం. మరి గేల్‌ బాల్యం, అతను నివసించిన ఇంటిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి