iDreamPost

డాడీ మూవీ చిన్నారి.. ఇప్పుడు ఇంతలా మారిపోయిందేంటి?

  • Published Apr 02, 2024 | 6:16 PMUpdated Apr 02, 2024 | 6:16 PM

డాడీ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి కూతురిగా ఎంతో క్యూట్ గా నటించిన ఈ చిన్నారి ఎవరికైనా గుర్తుందా.. ? ప్రస్తుతం ఈ బ్యూటీ ఎంతలా మారిపోయిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

డాడీ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి కూతురిగా ఎంతో క్యూట్ గా నటించిన ఈ చిన్నారి ఎవరికైనా గుర్తుందా.. ? ప్రస్తుతం ఈ బ్యూటీ ఎంతలా మారిపోయిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

  • Published Apr 02, 2024 | 6:16 PMUpdated Apr 02, 2024 | 6:16 PM
డాడీ మూవీ చిన్నారి.. ఇప్పుడు ఇంతలా మారిపోయిందేంటి?

మెగాస్టార్ చిరంజీవి సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాలసిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆయన ప్రేక్షకుల మదిలో చిరస్థాయిలో నిలిచిపోయారు. అంతేకాకుండా.. ఎలాంటి సిని బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన చిరంజీవి ఇండస్ట్రీలో ఎన్నో విజయాలను అందుకున్నారు. ముఖ్యంగా ఆయన ఏదైనా ఓ పాత్రలో నటించారు అనడంకంటే.. జీవించారు అనడంలో సందేహమే లేదు. మరి చిరంజీవి కెరీర్ లో ది బెస్ట్ హిట్ మూవీగా నిలిచిన సినిమాల్లో డాడీ సినిమా కూడా ఒకటి. ఇందులో హీరోయిన్ గా సిమ్రాన్ నటించారు. ఇక ఈ సినిమాను దర్శకుడు సురేష్ కుమార్ ఆక్టోబర్ 4, 2001లో తెరకెక్కించారు. అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ గా అషిమా భల్లా కూడా నటించారు. ఇక అప్పటిలో డాడీ సినిమా మంచి సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. కాగా, ఇందులో చిరంజీవి కూతురుగా ఓ చిన్నారి ఎంతో ఆద్భుతంగా నటించింది. అయితే ఇప్పుడు ఆ చిన్నారి ఎలా ఉందో తెలిస్తే షాక్ అయిపోతారు.

డాడీ సినిమాలో చిరంజీవి, సిమ్రాన్ తో పాటు అందులో నటించిన ఓ చిన్నారి కూడా కీలక పాత్ర పోషించింది. అయితే ఆ సినిమాలో క్షయ పాత్రలో కనిపించిన ఆ చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? ఇక ఇప్పుడు ఆమెను చూస్తే మతిపోతుంది. ఎందుకంటే.. హీరోయిన్స్ కి మించిన అందంతో ఎంతో క్యూట్ గా ఉంటుంది. అయితే ఆ చిన్నదాని పేరు అనుష్క మల్హోత్రా. కాగా, ముంబైకు చెందిన అనుష్క టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలిసిన వారి ద్వారా చిరంజీవి సినిమాలో నటించే అవకాశం అందుకుంది. అలా చిరంజీవి సినిమాలో అవకాశం అందుకున్న అనుష్క డాడీ సినిమాలో తన క్యూట్ క్యూట్ మాటలతో.. ఆద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించింది.

అయితే చిన్నప్పుడు ఎంతో క్యూట్ గా కనిపించిన ఈ చిన్నారి ఇప్పుడు ఎంత గ్లామరస్ లుక్ లోకి మారిపోయిందో చూస్తే ఆశ్చర్యపోతారు. ప్రస్తుతం ఈ అమ్మాడు ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే డాడీ సినిమా తర్వాత అనుష్క కొన్ని బాలీవుడ్ అలరించింది. కానీ, ఆ తర్వాత.. చదువు పై దృష్టి పెట్టి సినిమాలకు పూర్తిగా దూరం అయ్యింది. ఇక సినిమాల పరంగా దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరెస్ ఫోటోలతో నెటిజన్స్ ఆకర్షిస్తుంటుంది. మరి, డాడీ సినిమాలో నటించిన చిన్నారి ప్రస్తుత ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Anushka Malhotra (@anush.malhotra)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి