iDreamPost
android-app
ios-app

Akhil Akkineni: ఇదెక్కడి ట్విస్ట్.. అఖిల్ ఫ్యూచర్.. చిరు చేతిలో!

  • Published Jul 26, 2024 | 4:05 PM Updated Updated Jul 26, 2024 | 4:05 PM

అక్కినేని అఖిల్ భవిష్యత్ మెగాస్టార్ చిరంజీవి చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదెక్కడి కంపారిజన్ అని మీరు అనుకుంటున్నారా? ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అక్కినేని అఖిల్ భవిష్యత్ మెగాస్టార్ చిరంజీవి చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదెక్కడి కంపారిజన్ అని మీరు అనుకుంటున్నారా? ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Jul 26, 2024 | 4:05 PMUpdated Jul 26, 2024 | 4:05 PM
Akhil Akkineni: ఇదెక్కడి ట్విస్ట్.. అఖిల్ ఫ్యూచర్.. చిరు చేతిలో!

ప్రస్తుతం టాలీవుడ్ లో హిట్ అనివార్యమైన హీరోల్లో యంగ్ హీరో అక్కినేని అఖిల్ ఒకడు. నాగార్జున నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే అతడి కెరీర్ లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీ ఒక్కటే థియేటర్ల దగ్గర సక్సెస్ సాధించింది. మరే చిత్రం కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక అతడి నుంచి వచ్చిన ఆఖరి చిత్రం ‘ఏజెంట్’. 2023లో విడుదలైన ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరే మూవీ కూడా అతడిని నుంచి రాకపోగా.. అనౌన్స్ లు కూడా కాలేదు. ఈ నేపథ్యంలో అఖిల్ భవిష్యత్ మెగాస్టార్ చిరంజీవి చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదెక్కడి కంపారిజన్ అని మీరు అనుకుంటున్నారా? ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అక్కినేని అఖిల్ యూవీ క్రియేషన్స్ లో ఓ సినిమా చేస్తున్నాడు. దానికి అనిల్ డైరెక్టర్. దాదాపు రూ. 100 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటనైతే వచ్చింది గానీ.. ఆ తర్వాత ఎలాంటి అప్డేట్స్ కూడా లేవు. ఇక ఈ మూవీ కోసం అఖిల్ సిద్దం అవుతున్నాడని, స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని మేకర్స్ చెబుతున్నారు. కానీ లోపల లెక్కలు మాత్రం వేరేలా వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే?

యూవీ క్రియేషన్స్ వారు మెగాస్టార్ చిరంజీవితో ‘విశ్వంభర’ మూవీ చేస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. దాదాపు రూ. 150 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పెట్టుబడి మెుత్తం విశ్వంభరపైనే పెట్టింది యూవీ సంస్థ. సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ మూవీకి సంబంధించి లావాదేవీలన్నీ పక్కాగా జరిగితే.. మేకర్స్ దగ్గర ఎంతో కొంత డబ్బు మిగులుతుంది. వాటితో అఖిల్ మూవీ స్టార్ట్ చేయాలన్న ఆలోచనలో ఉందట యూవీ క్రియేషన్స్. అంటే మెగాస్టార్ విశ్వంభర బిజినెస్ క్లోజ్ అయ్యేవరకు అఖిల్ సినిమా పెండింగ్ లోనే ఉంటుందన్న మాట. అయితే ఇది అధికారికంగా వచ్చిన విషయం కాకపోయినప్పటికీ.. ఇండస్ట్రీ వర్గాలు జోరుగా చర్చించుకుంటున్నాయి.

కాగా.. చిరు విశ్వంభర సోషియో ఫాంటసీ చిత్రం కావడంతో.. భయ్యర్లు మెుగ్గుచూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పైగా మెగాస్టార్ చిరంజీవి, నిలిచేది సంక్రాంతి బరిలో. దాంతో సహజంగానే థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ లు రికార్డ్ స్థాయిలో జరుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ లెక్కలు అన్నీ చూసుకున్నాక అఖిల్ మూవీ ప్రారంభిస్తారా? లేక చిరు మూవీ రిలీజ్ అయ్యాకే స్టార్ట్ చేస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా అఖిల్ భవిష్యత్ ఇప్పుడు చిరంజీవి చేతుల్లో ఉందని మూవీ లవర్స్ తో పాటుగా సినీ పండితులు పేర్కొంటున్నారు.

Jojobet GirişjojobetsezarcasinoJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomfixbetfixbetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş