iDreamPost

నితిన్ హీరోయిన్ ను గుర్తుపట్టరా.. ఇప్పుడు ఇలా మారిపోయిందేంటి?

  • Published Jun 22, 2024 | 4:33 PMUpdated Jun 22, 2024 | 4:33 PM

పై ఫోటోలో హీరో నితిన్ తో ఉన్నా ఈ హీరోయిన్ గుర్తుపట్టారా.. టాలీవుడ్ లో ఒక్క సినిమాతో యూత్ మొత్తన్ని ఫిదా చేసిన ఈ అమ్మడు ఇప్పుడు ఎవరూ గుర్తుపట్టాలేనంతగా తయరైంది. కాగా, ప్రస్తుతం ఈ చిన్నదాని లేటెస్ట్ ఫిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఆమె ఇప్పుడు ఎలా ఉందో మీరే చూసేయండి.

పై ఫోటోలో హీరో నితిన్ తో ఉన్నా ఈ హీరోయిన్ గుర్తుపట్టారా.. టాలీవుడ్ లో ఒక్క సినిమాతో యూత్ మొత్తన్ని ఫిదా చేసిన ఈ అమ్మడు ఇప్పుడు ఎవరూ గుర్తుపట్టాలేనంతగా తయరైంది. కాగా, ప్రస్తుతం ఈ చిన్నదాని లేటెస్ట్ ఫిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఆమె ఇప్పుడు ఎలా ఉందో మీరే చూసేయండి.

  • Published Jun 22, 2024 | 4:33 PMUpdated Jun 22, 2024 | 4:33 PM
నితిన్  హీరోయిన్ ను గుర్తుపట్టరా.. ఇప్పుడు ఇలా మారిపోయిందేంటి?

తెలుగు చిత్ర పరిశ్రమలో తరుచు ఎంతోమంది తారలు అడుగుపెడుతుంటారు. కానీ, వారిలో కొంతమంది మాత్రమే క్లిక్ అయ్యి హీరోయిన్లుగా ఇక్కడ కొనసాగుతుంటారు.అయితే మరి కొందరు మాత్రం అడపాదడపా సినిమాలు చేసి ఆ తర్వాత పూర్తిగా కనుమరుగవుతారు. ఇక కొందరు మాత్రం కేవలం ఒక్క సినిమాలోనే ప్రేక్షకులను పలకరించి ఆ తర్వాత అడ్రాస్ లేకుండా ఉంటారు. అయితే ఇలా ఎండకాలంలో వానలా వచ్చి ప్రేక్షకులను అలరించిన తారలు.. మొదటి సినిమాల్లో ఎంతో చక్కగా, చూడటానికి అందంగా ఆకర్షవంతంగా కనిపిస్తారు. కానీ, ఆ తర్వాత ఏ కారణాల వల్లో తెలియదు కానీ, పూర్తిగా ఎవరు గుర్తుపట్టాలేని స్థితిలో మారిపోతారు. మరి, అలా సినిమాల్లో అవకాశాల పేరిట ఇలా తయారవుతున్నారో, ఫ్యాషన్ పేరిట ఇలా మారిపోతున్నారో తెలియడం లేదు. ఇంతకి ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నాం అనుకుంటున్నారా.. మరెమీ లేదండీ పై ఫోటోలో హీరో నితిన్ తో ఉన్నా ఈ హీరోయిన్ గుర్తుపట్టారా.. ఈమె ఇప్పుడు పూర్తిగా ఎవరు గుర్తుపట్టాలేనంతగా మారిపోయింది. ప్రస్తుతం ఈమె లేటెస్ట్ ఫిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఆమె ఇప్పుడు ఎలా ఉందో మీరే చూసేయండి.

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ఈ అమ్మాయి పేరు ‘మిస్తీ చక్రవర్తి’.  ఈమె 2013లో ‘పొరిచోయ్’ అనే బెంగాలీ మూవీతో నటిగా మారింది. ఇక ఆ తర్వాత ఏడాదే తెలుగులో నితిన్ సరసన ‘చిన్నదాన నీకోసం’ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా తెలుగులో అంతగా హిట్ కానప్పటికి మిస్తీకి తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది. ఎందుకంటే.. ఈ సినిమాలో  ఈ చిన్నది తన నటనతో, అందంతో అందర్నీ ఆకట్టుకుంది. ముఖ్యంగా యూత్ మొత్తన్ని మిస్తీ తన యాక్టింగ్ తో క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఫిదా చేసింది.  కానీ, ఆ తర్వాత తెలుగులో మిస్తీ ఏ సినిమాలోనూ కనిపించలేదు. ఇకపోతే హిందీలో కూడా ఈ బ్యూటీ కాంచీ అనే మూవీలో హీరోయిన్ గా నటించి. దీంతో పాటు కన్నడ, మలయాళ, తమిళ్ భాషల్లోనూ ఈ అమ్మడు పలు భాషాల్లో నటించింది.

కానీ. ఆ సినిమాలేవి మిస్తీకి పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. ఇకపోతే గతేడాది ఓ సాథియా’ అనే తెలుగు మూవీలో  ఈ చిన్నది చివరిగా కనిపించింది. దీని తర్వాత పెద్దగా ఈ భామకు ఆఫర్లు వచ్చినట్లు కనిపించడం లేదు. ఈ క్రమంలోనే వరుస గ్లామరెస్ ఫోటో షూట్స్ చేస్తూ దర్శక నిర్మాతలని ఆకర్షించే పనిలో పడింది మిస్తీ. అయితే కెరీర్ ప్రారంభంలో ముద్దుగా, అందంగా ఉన్న మిస్తీ.. ఫ్యాషన్ పేరు ఇప్పుడు గుర్తుపట్టాలేనంతగా తయారైంది. తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో ఆమె లేటెస్ట్ ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  ఇక ఆ ఫోటోస్ చూసి ఈమెను గుర్తుపట్టాడం ఫ్యాన్స్ కు కాస్త కష్టంగా అనిపించింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం 36 ఏళ్ల వయసులో ఉన్నా మిస్తీ ఇంతవరకు పెళ్లి చేసుకోకుండా ఉండటం గమన్హారం. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవతున్న మిస్తీ చక్రవర్తి లేటెస్ట్ ఫిక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by MISHHTI (@mishtichakravarty)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి