iDreamPost

నవ్వుల పాలైన బాబు గారు..!

నవ్వుల పాలైన బాబు గారు..!

అనుభవశాలి అయిన ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు… తన అనుభవాన్ని ప్రజోపయోగమైన నిర్ణయాలకు ఉపయోగించకుండా ప్రభుత్వం పై ఎప్పుడు ఏ విధంగా అక్కసు వెళ్ళ గక్కుదామా అనే దానిపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల జరిగిన మహానాడు ఎజెండా లోనూ.. జగన్ టార్గెట్ గానే ఎక్కువ అంశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏడాది పాలన సందర్భంగా.. ఆయన చేసిన ట్వీట్లలోనూ అదే కనిపించింది. ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో బాహుబలిని మించిన గ్రాఫిక్స్ తో వీడియోలు ప్రజెంటేషన్ చేస్తూ… జిమ్మిక్కులు, గిమ్మిక్కు లతో ప్రజలను ఊహాలోకంలో విహరింపచేద్దామని ప్రయత్నించారు. ఆ జిమ్మిక్కులు నమ్మని ప్రజలు బాబుకు బుద్ధి చెప్పి జగన్ కు జేజేలు పలికారు. ఇప్పుడు ప్రతి పక్షంలో ఉన్నప్పుడు కూడా.. అవాస్తవ మైన వీడియోలు విడుదల చేస్తూ.. రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారు. ఇప్పుడు కూడా ప్రజలు వాటికి సరైన సమాధానమే చెబుతున్నారు. మంగళవారం సాయంత్రం ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వీడియో విషయంలోనూ అదే జరిగింది. ” తెలుగు వారి ప్రతిష్ట దిగ జారింది. నవ్యాంధ్ర నవ్వుల పాలైంది” అంటూ.. ఆయన పోస్ట్ చేసిన వీడియో కు కొందరు చేసిన రీ ట్వీట్లు చదివితే… అనవసరంగా ఇది పోస్ట్ చేసి నవ్వుల పాలయ్యా నా.. అని బాబుకే సందేహం కలుగు తుంది. “అవినీతిలో నెంబర్ వన్ అయింది నీ పాలనలో.. పెట్టుబడులు రాష్ట్రానికి కాదురా అయ్యా.. వచ్చింది నీ కుటుంబానికి” అంటూ ఒకరు…

” విభజన తర్వాత దేశంలో తలదించుకుంది అంధ్ర రాష్ట్రం తమరి అయిదేళ్ల పాలనలో మీరు చేసిన అప్పులు 1,50,000 కోట్లు. అభివృద్ధి అని ఊదర గొట్టే మాటలు చెప్పి.. మీ కుల వర్గం లాభం కోసం ఒక బ్రమరావతిని నిర్మించారు.. మీ సంగతి తెలిసి పీఎం సైతం మీకు నిధులు ఇవ్వలేదు” అని మరొకరు…

“CBN garu ఇలా ఉన్న సీఎంకు ఇంత మోస్ట్ పాపులారిటీ ఇస్తారా.. .మీరు, మీ పిచ్చి వీడియోస్.. ఇక ఆపండి” అంటూ సీ ఓటర్ జరిపిన సర్వేలో.. మోస్ట్ పాపులర్ సీఎం లలో జగన్ కి నాలుగో స్థానం వచ్చిన క్లిప్పింగ్ పోస్ట్ చేస్తూ మరొకరు.. ఇలా చెప్పుకుంటూ పోతే… చంద్రబాబు ట్వీట్ కు తొలి నాలుగు గంటల్లో వచ్చిన రీ ట్వీట్ లలో మెజారిటీ నెటిజన్ల సమాధానాలు చంద్రబాబు కు కన్నీళ్లు తెప్పించేలానే ఉన్నాయి. ఇకనైనా ఇటువంటి ప్రచారాలు మాని కనీ వినీ ఎరుగని రీతిలో సంక్షేమం దిశగా దూసుకెళ్తున్న ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి తగిన సూచనలు ఇస్తే మంచిదని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి