iDreamPost

వాళ్లు కోర్టు పక్షులా..? పరిస్థితులు నిజమే అంటున్నాయి. అందుకే ఆ పార్టీ నేత అలా విమర్శలు గుప్పించారు.

వాళ్లు కోర్టు పక్షులా..? పరిస్థితులు నిజమే అంటున్నాయి. అందుకే ఆ పార్టీ నేత అలా విమర్శలు గుప్పించారు.

ఇటీవలి కాలంలో రాష్ట్ర రాజకీయాలు ప్రజల్లో కాకుండా…కోర్టుల్లోనే ఎక్కువ చర్చ జరుగుతున్నాయి. సాధారణంగా రాజకీయ పార్టీలు ఏక్కడైనా ప్రజా క్షేత్రంలో తేల్చుకునేందుకు సిద్ధపడతాయి. అవకాశం కోసం ఎదురు చూస్తాయి. అందుకు ఎన్నికలను ఒక వారధిగా వాడుకుంటాయి. కాని ఆంధ్రప్రదేశ్ లో అందుకు భిన్నంగా జరుగుతుంది.

ప్రతిపక్ష టిడిపి ప్రజలను నమ్మకుండా కోర్టులను నమ్ముతుంది. తన అనుయాయులతో కోర్టుల్లో కేసులు దాఖలు చేయించి సంబర పడిపోతుంది. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలును అడ్డుకుంటుంది. ఏదైనా సంక్షేమ పథకాల్లో అవినీతి జరిగితే అది ప్రజలకు వివరించి…వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటు వేయకండని ప్రజలకు విజ్ఞప్తి చేయాలి. అయితే సిఎం వైఎస్ జగన్ పాలనలో అవినీతికి ఆస్కారం లేకపోవడంతో టిడిపి విమర్శించేందుకు అంశమే దొరకటం లేదు.

ఈ నేపథ్యంలో ప్రజాభిమానం పొందిన వైఎస్ జగన్ నేతృత్వంలో ప్రభుత్వంపై కోర్టుల్లో కేసులు వేసి అన్నింటిని అడ్డుకుంటుంది. ప్రజలు గత ఎన్నిలకల్లో చావుదెబ్బ కొట్టారు. ప్రస్తుతం కూడా టిడిపి నేతలు కోర్టుల ద్వారా ప్రభుత్వాన్ని నియంత్రించాలని కుట్ర పన్నగాన్ని ప్రజలు చీదరించుకుంటున్నారు. దీంతో టిడిపి అధినేత పరిస్థితి కుడుతులో పడ్డ ఎలకలా మారింది.

ఈ నేపథ్యంలో చంద్రబాబు, ఆయన అనుయాయులు కోర్టు పక్షులుగా మారారు. అది నిజమేనని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అంటున్నారు. చంద్రబాబు, టిడిపి నేతలు కోర్టు పక్షులుగా మారారని, టిడిపిది లిటిగెంట్ స్వభావం ఉన్న పార్టీ అని మండిపడ్డారు. టిడిపి హయాంలో కెబినెట్ సమావేశాలన్నీ టెండర్లు ఖరారు చేయడం, బ్యాంకు గ్యారెంటీలకే సరిపోయిందని విమర్శించారు.

రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా రెండు వేల కోట్లు ఆదా చేశామని, ఇది కన్నా లక్ష్మీనారాయణకు కన్పించదా అని ప్రశ్నించారు. అక్రమాలను వెలికి తీశామని, దోషులను బయటపెడతామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో దోషులను బయటపెట్టడం కొంచెం ఆలస్యం అవుతుందని తెలిపారు. ఏడాది పాలనలో జగన్ సృష్టించిన రికార్డులని మరుగున పర్చేందుకే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

కోర్టులో పెడుతున్న ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు ఏయే అంశాల్లో వేస్తున్నారో చూస్తే అర్ధం అవుతోందన్నారు. రోడ్డు మీద తాగి ప్రభుత్వాధినేతను తిడుతోంటే కోర్టులో కేసులు వేస్తారని, ఆ కేసులను వాదించడానికి పెద్ద పెద్ద లాయర్లు వస్తున్నారని మండిపడ్డారు. వీటి వెనుక ఎవరు ఉన్నారో అందరికి తెలుసన్నారు.

ప్రతిపక్ష నేత చంద్రబాబు తన కుయుక్తులతో ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. గత ఎన్నికల్లో టిడిపిని ప్రజలు తిరస్కరించారని, ఓడిపోయిన నెల రోజుల నుంచే టిడిపి కుట్రలు మొదలుపెట్టిందని దుయ్యబట్టారు.

చంద్రబాబుకు అధికారం పోయిందన్న బాధ ఉందని, చరిత్ర హీనుడిగా మిగిలిన చంద్రబాబు కుట్రలు మానలేదని మండిపడ్డారు. కావాలనే చిన్నా చితకా కేసులు వేసి ప్రభుత్వానికి ఇబ్బంది పెడుతున్నారని ధ్వజమెత్తారు.

బాధ్యత గల ప్రతిపక్షమైతే ఎందుకు ఓడిపోయామనే దానిపై ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వంపై బురద చల్లడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.

ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక చంద్రబాబు కుట్రలకు తెరలేపారని, డ్వాక్రా మహిళలను చంద్రబాబు దారుణంగా మోసం చేశారని తెలిపారు. ఏడాదిలోనే మేనిఫెస్టోలోని 90 శాతం హామీలు అమలు చేశామని, తమ ప్రభుత్వవ ఏడాది పాలనలో 3.58 కోట్ల మందికి లబ్ధి చేకూరిందని గుర్తు చేశారు. ఐదేళ్లలో చంద్రబాబు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి