iDreamPost

కట్టి ఏడాది కాకముందే కుప్పకూలిన బ్రిడ్జ్‌! ఎన్ని కోట్లతో నిర్మించారో తెలుసా?

  • Published Jun 18, 2024 | 7:37 PMUpdated Jun 19, 2024 | 3:28 PM

Barka River, Bihar, Bridge: కొన్ని కోట్లు పెట్టి కట్టిన ఓ భారీ వంతెన నదిలో కొట్టుకుపోయింది. విచిత్రం ఏంటంటే.. ఆ వంతెన కట్టి కనీసం ఏడాది కూడా కాలేదు. ఇంతకీ ఆ వంతెన ఎన్ని కోట్లు పెట్టి కట్టారో తెలుసా?

Barka River, Bihar, Bridge: కొన్ని కోట్లు పెట్టి కట్టిన ఓ భారీ వంతెన నదిలో కొట్టుకుపోయింది. విచిత్రం ఏంటంటే.. ఆ వంతెన కట్టి కనీసం ఏడాది కూడా కాలేదు. ఇంతకీ ఆ వంతెన ఎన్ని కోట్లు పెట్టి కట్టారో తెలుసా?

  • Published Jun 18, 2024 | 7:37 PMUpdated Jun 19, 2024 | 3:28 PM
కట్టి ఏడాది కాకముందే కుప్పకూలిన బ్రిడ్జ్‌! ఎన్ని కోట్లతో నిర్మించారో తెలుసా?

కొన్ని నిర్మాణాలు తరాల పాటు నిలిచిపోతాయి.. కొన్ని మాత్రం అలా కడితే ఇలా కూలిపోతాయి. అలా కూలిపోవడానికి సవాలక్ష కారణాలు ఉండొచ్చు. కానీ, ప్రభుత్వ నిర్మాణాలు అలా కూలిపోతే మాత్రం కచ్చితంగా నాణ్యతాలోపమనే భావించాల్సిన పరిస్థితి. తాజాగా ఓ పెద్ద నదిపై కట్టిన ఓ వంతెన ఏడాది కాకముందే కుప్పకూలిపోయింది. ఈ ఘటన ఎక్కడో కాదు మన దేశంలోని బిహార్‌ రాష్ట్రంలో జరిగింది. అరారియాలోని సిక్తి బ్లాక్‌ ప్రాంతంలో బక్రా నదిపై బ్రిడ్జ్‌ కూలిపోయింది. అరారియా జిల్లాలోని పద్కియా ఘాట్‌ సమీపంలో కొన్ని కోట్ల రూపాయాలతో నిర్మించిన బ్రిడ్జ్‌ కనీసం ఒక్క సంవత్సరమైన నిలవలేదు. బ్రిడ్జ్‌ కూలిపోతున్నప్పుడు తీసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

నెటిజన్లు ఈ వీడియోను తెగ షేర్‌ చేస్తూ.. ఇది ప్రజల ధనంతో నిర్మిస్తున్న వంతెనల పరిస్థితి అంటూ షేర్‌ చేస్తున్నారు. అయితే.. వంతెన కూలిపోవడానికి పనుల్లో నాణ్యత లేకపోవడమే అని స్థానికులు ఆరోపిస్తున్నారు. సరైన సిమెంట్‌, ఇసుక, ఐరన్‌ వాడకుండా.. తూతూ మంత్రంగా పనులు చేయడంతో వంతెన నీటి వేగానికి కొట్టుకోపోయిందని తెలుస్తోంది. పనుల్లో నాణ్యత లేకపోవడం, కాంట్రాక్టర్లు, సంబంధిత శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే వంతెన కూలిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కాంట్రాక్టర్లు డబ్బులకు కక్కుర్తి పడి, అధికారులు లంచాలు తీసుకొని పనుల్లో నాణ్యత లోపిస్తున్నా.. కనీసం కాంట్రాక్టర్లను ప్రశ్నించకుండా ఉండటంతోనే భారీ మొత్తంలో ప్రజా ధనం వృథా అయినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ వంతెన కట్టేందుకు దాదాపు రూ.12 కోట్లపైనే ఖర్చు చేసినట్లు సమాచారం. నది నీళ్లకు బ్రిడ్జ్‌ కింద ఉన్న మూడు పిల్లర్లు కొట్టుకెళ్లాయి. దాంతో వంతెన పూర్తిగా కుప్పకూలింది. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో 12 ‍కోట్ల ప్రజా ధనం నీళ్లలో పోసినట్లు అయిందని స్థానికులు మండిపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి