iDreamPost
android-app
ios-app

ఆర్ఆర్ఆర్‌లో రామ్ చరణ్, ఎన్టీఆర్‌లా బ్రిడ్జిపై రిస్క్ చేసిన లోకో పైలట్స్!

  • Published Jun 24, 2024 | 5:10 PM Updated Updated Jun 24, 2024 | 5:10 PM

Loco Pilots Risk Their Lives: ఆర్ఆర్ఆర్ సినిమా మొత్తంలో చాలా మందికి నచ్చే సీన్ ఆ వంతెన సీన్. ఆ సీన్ లో వంతెనపై ఉన్న రైలు అగ్ని ప్రమాదానికి గురైతే.. అదే సమయంలో బ్రిడ్జ్ కింద ఉన్న ఒక కుర్రాడు ఆ ప్రమాదంలో చిక్కుకుంటాడు. అప్పుడు రామ్ చరణ్, ఎన్టీఆర్ లిద్దరూ సాహసం చేసి మరీ ఆ కుర్రాడ్ని కాపాడతారు. ఈ సీన్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. రీల్ లైఫ్ లో దీనికే ఇంతలా అయిపోతే.. రీల్ లైఫ్ లో ఇద్దరు పైలట్స్ తమ ప్రాణాలకు తెగించి మరీ రిస్క్ చేశారు.

Loco Pilots Risk Their Lives: ఆర్ఆర్ఆర్ సినిమా మొత్తంలో చాలా మందికి నచ్చే సీన్ ఆ వంతెన సీన్. ఆ సీన్ లో వంతెనపై ఉన్న రైలు అగ్ని ప్రమాదానికి గురైతే.. అదే సమయంలో బ్రిడ్జ్ కింద ఉన్న ఒక కుర్రాడు ఆ ప్రమాదంలో చిక్కుకుంటాడు. అప్పుడు రామ్ చరణ్, ఎన్టీఆర్ లిద్దరూ సాహసం చేసి మరీ ఆ కుర్రాడ్ని కాపాడతారు. ఈ సీన్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. రీల్ లైఫ్ లో దీనికే ఇంతలా అయిపోతే.. రీల్ లైఫ్ లో ఇద్దరు పైలట్స్ తమ ప్రాణాలకు తెగించి మరీ రిస్క్ చేశారు.

ఆర్ఆర్ఆర్‌లో రామ్ చరణ్, ఎన్టీఆర్‌లా బ్రిడ్జిపై రిస్క్ చేసిన లోకో పైలట్స్!

హీరోలు సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలో కూడా ఉంటారు. దీనికి ఇప్పటివరకూ జరిగిన అనేక సంఘటనలే ఉదాహరణ. చాలా మంది బయట జరుగుతున్న అన్యాయాలను ఎదిరించి హీరోలుగా నిలుస్తారు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేసి ఆపద్బాంధవులుగా నిలుస్తారు. కొంతమంది రిస్క్ చేసి మరీ ఇతరుల ప్రాణాల కోసం పోరాడతారు. గుండెపోటు వస్తే అంత నొప్పిలో కూడా ప్రయాణికుల గురించి ఆలోచించి బస్సుని సురక్షితంగా రోడ్డు పక్కకు ఆపి మృత్యువు ఒడిలోకి జారుకున్న డ్రైవర్లు ఉన్నారు. రైల్వే ట్రాక్ మీద గొర్రెల్లా మనుషులు అడ్డంగా ఉంటే రైల్లో ఉన్న ప్రయాణికుల గురించి ఆలోచించి.. రైలును పోనిచ్చి అంతమంది చావుకి కారణమైనందుకు ఆత్మహత్య చేసుకున్న లోకో పైలట్ ఉన్నారు. ఇలా సమాజం కోసం ఆలోచించే హీరోలు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా ఉంటారు. 

రైలులో ఉన్న ప్రయాణికుల కోసం ఇద్దరు లోకో పైలట్స్ తమ ప్రాణాలకు తెగించి మరీ సాహసం చేశారు. సాధారణంగా బైకో బుక్ చేసుకుంటే మధ్యలో ఆ బండి ఆగిపోతే ఆ కెప్టెన్ కస్టమర్ ని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు. ఆటోలు ఆగిపోయినా ఇదే పరిస్థితి. బస్సులు బ్రేక్ డౌన్ అయితే వేరే బస్సు ఎక్కిస్తారు. మరి రైలు బ్రేక్ డౌన్ అయితే?.. వేరే రైలు ఎక్కిస్తారు కదా అని అనుకుంటున్నారా? మరి అదే రైలు వంతెన మీద ఆగిపోతే ఏంటి పరిస్థితి? మరొక రైలు ఇంజిన్ వచ్చేవరకూ ఆగాల్సిందే. అది వచ్చి రైలుని లాగేవరకూ ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో మాకెందుకు అని చాలా మంది లోకో పైలట్లు సహాయం కోసం ఎదురుచూస్తూ అక్కడే ఉండిపోతారు. కానీ ఈ లోకో పైలట్స్ మాత్రం అలా ఆలోచించలేదు. హీరోల్లా ఆలోచించారు.

రైలు బ్రేక్ డౌన్ అయితే రైల్లో ఉన్న ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకూడదని చెప్పి వంతెన మీద వేలాడుతూ వెళ్లి మరీ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేశారు. వందల మంది ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కాపాడారు. ఈ సంఘటన బీహార్ లోని సమస్తిపూర్ రైల్వే డివిజన్ పరిధిలో వాల్మీకి నగర్, పనియావా స్టేషన్స్ మధ్య 382వ వంతెన వద్ద చోటు చేసుకుంది. అన్ లోడర్ వాల్వ్ నుంచి ఎయిర్ ప్రెజర్ లీక్ అవ్వడం వల్ల రైలు వంతెన మీద మధ్యలోనే ఆగిపోయింది.

లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ ఇద్దరూ వంతెన మీద వేలాడుతూ కొంత దూరం వెళ్లి.. ఆ తర్వాత రైలు కింద పాకుతూ ఇంజిన్ దగ్గరకు వెళ్లి మరీ రిపేర్ చేశారు. ఆ తర్వాత రైలు సురక్షితంగా అక్కడి నుంచి కదిలింది. అయితే అప్పటికప్పుడు వేగంగా ఆలోచించి.. ప్రయాణికుల సౌకర్యం కోసం తమ ప్రాణాలను రిస్క్ చేసిన ఇద్దరు లోకో పైలట్స్ కి సమస్తిపూర్ రైల్వే డివిజనల్ మేనేజర్ వినయ్ శ్రీవాస్తవ చెరో పది వేల రూపాయలు బహుమతిగా అందజేశారు. వారి ధైర్యసాహసాలను కొనియాడారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్ఆర్ఆర్ మూవీలో వంతెన సీన్ రీల్ అయితే.. ఇది రియల్ అని.. సూపర్ హీరోస్ అంటూ నెటిజన్స్ కొనియాడుతున్నారు.