iDreamPost

పాట్నా హైకోర్టు సంచలన నిర్ణయం! BC, SC, STలకు 65% రిజర్వేషన్లు రద్దు

Bihar Reservation News: బిహార్ లో 65 శాతం రిజర్వేషన్  ఇస్తూ.. ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే నీతిశ్ కుమార్ ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది.

Bihar Reservation News: బిహార్ లో 65 శాతం రిజర్వేషన్  ఇస్తూ.. ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే నీతిశ్ కుమార్ ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది.

పాట్నా హైకోర్టు సంచలన నిర్ణయం! BC,  SC, STలకు 65% రిజర్వేషన్లు రద్దు

మన దేశంలో రిజర్వేషన్ అనేది ఎప్పటి నుంచి కొనసాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్య సంస్థల్లో, ఇతర పరీక్షల్లో రిజర్వేషన్లు ఉంటాయి. ముఖ్యంగా  ఎస్సీ,ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు ఉంటాయి. ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉంటాయి. అయితే రాష్ట్రాలను బట్టీ ఈ రిజర్వేషన్లలో కాస్తా మార్పులు ఉంటున్నాయి. ఇక ఈ రిజర్వేషన్ల విషయంలో వివిధ కేసులు కూడా కోర్టుల్లో నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా రిజర్వేషన్లు రద్దు చేస్తూ ఓ కోర్టు తీర్పు ఇచ్చింది. మరి..అసలు ఈ ఇష్యూకు సంబంధించిన పూర్త వివరాల్లోకి వెళ్తే..

ఎస్సీ,ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల విషయంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలా ఉంటుంది. ఈ క్రమంలోనే బిహార్ లో 65 శాతం రిజర్వేషన్  ఇస్తూ.. ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే నీతిశ్ కుమార్ ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. విద్యా, ఉద్యోగ రంగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 65 శాతం రిజర్వేషన్ పెంచుతూ తీసుకున్న నిర్ణయం విషయంలో కీలక తీర్పు ఇచ్చింది. ఇలా 65 శాతం రిజర్వేష పెంచుతూ బిహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్నిపాట్నా హైకోర్టు కొట్టేసింది. ఈ పెంపు రాజ్యాంగ విరుద్ధమంటూ 65శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ గురువారం హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

ఇక అసలు విషయంలోకి వెళ్తే.. బిహార్ రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేపట్టిన సంగతి తెలిసిందే. అలానే ఆ నివేదికను 2023 నవంబరులో అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇక అదే సమయంలో ఈ నివేదికను బేస్ చేసుకుని విద్య, ఉద్యోగ రంగాల్లో కల్పిస్తున్న రిజర్వేషన్ల ను పెంచుతూ సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ బిల్లుకు బిహార్ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అనంతరం నితీశ్ ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎస్సీలు, ఎస్టీలు, ఇతర వెనకబడిన వర్గాలకు ఇప్పటి వరకు అందే 50 రిజర్వేషన్లు 65 శాతానికి పెరిగాయి.

అలానే ఈబీసీని ఉద్దేశించిన 10 శాతం రిజర్వేషన్లు కలిపితే మొత్తం 75 శాతానికి చేరాయి. రిజర్వేషన్ల పెంపుతో ఎస్సీలకు 16 నుంచి 20 శాతం, ఎస్టీలకు 1 నుంచి 2శాతం పెరిగింది. అయితే ఈ పెంపుపై కొన్నివర్గాల నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. ఇదే సమయంలో బిహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం 2024 మార్చిలో తీర్పును రిజర్వు చేసింది. తాజాగా 65 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ గురువారం తుది తీర్పును పాట్నాహైకోర్టు వెలువరించింది. మరి..తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపం తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి