iDreamPost

వీడియో: తనను చోరీ చేసిన దొంగలను తానే పట్టించిన బైక్!

దొంగతనాల్లో ఆరితేరిన వారు కొన్ని సందర్భాల్లో చిన్న మిస్టేక్ కారణంగా దొరికిపోతుంటారు. తాజాగా కొందరు దొంగలు ఓ బైక్ ను ఎత్తుకెళ్లారు. అయితే ఆ బైకే తనను చోరీ చేసిన దొంగలను పట్టించింది.

దొంగతనాల్లో ఆరితేరిన వారు కొన్ని సందర్భాల్లో చిన్న మిస్టేక్ కారణంగా దొరికిపోతుంటారు. తాజాగా కొందరు దొంగలు ఓ బైక్ ను ఎత్తుకెళ్లారు. అయితే ఆ బైకే తనను చోరీ చేసిన దొంగలను పట్టించింది.

వీడియో: తనను చోరీ చేసిన దొంగలను తానే పట్టించిన బైక్!

ఇటీవల కాలంలో అక్రమంగా డబ్బులు సంపాదించే వారి సంఖ్య బాగా పెరిగింది. ఈ క్రమంలో దొంగతనాలు బాగా పెరిగిపోయాయి. తాళం వేసిన ఇళ్లు, షాపులు, దుకాణాల్లోకి వెళ్లి..విలువైన వస్తువులను, నగదును చోరీ చేస్తుంటారు. అంతేకాక ఇళ్ల ముందు ఉండే వాహనాలను కూడా చోరీ చేస్తుంటారు. ఇలా దొంగతనాల్లో ఆరితేరిన వారు కొన్ని సందర్భాల్లో చిన్న మిస్టేక్ కారణంగా దొరికిపోతుంటారు. తాజాగా కొందరు దొంగలు ఓ బైక్ ను ఎత్తుకెళ్లారు. అయితే ఆ బైకే తనను చోరీ చేసిన దొంగలను పట్టించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్  అవుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..

సాధారణంగా దొంగలు ఎంతో జాగ్రత్తగా దొంగతనాలు చేస్తుంటారు. చోరీ చేసే సమయంలో దొరికిపోకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే కొన్ని సార్లు వారు చేసే పొరపాటుల కారణంగా దొరికిపోతుంటరు. అచ్చం అలానే బైకులు చోరీ చేయడంలో ఆరి తేరిపోయిన దొంగలు.. పదుల సంఖ్యలో ద్విచక్ర వాహనాలను ఎంతో చాకచక్యంగా కొట్టేశారు. ఇక చోరీలో తమకు తిరిగులేదని భావించిన ఆ దొంగలు మరో బైక్ ను కొట్టేయడానికి సిద్ధమయ్యారు. దొంగ తాళాలతో బైక్ స్టార్ట్ చేసి ఉడాయించారు. అయితే బైక్ ఇచ్చిన ట్విస్ట్ కి  దొంగలు పోలీసులకు దొరికిపోయారు.  అంతకంటే ముందు స్థానికుల చేతిలో చావుదెబ్బలు తిన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం పులగంపల్లి గ్రామంలో బైక్ ను తీసుకుని పారిపోతున్న ఇద్దరు దొంగలు గ్రామస్తులకు చిక్కారు. దీంతో వారిని విద్యుత్ స్తంభానికి కట్టేసి గ్రామస్తులు దేహశుద్ధి  చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి అప్పగించారు. అర్ధరాత్రి సమయంలో కదిరిలో బైక్ ను దొంగిలించి పారిపోతున్నారు. ఈ క్రమంలోనే పులగంపల్లి వద్దకు వచ్చేసరికి దొంగలు ప్రయాణిస్తున్న బైక లో పెట్రోల్ అయిపోయింది. దీంతో బైకును తోసుకుంటూ వెళ్తున్న దొంగల తీరు అనుమానస్పందంగాఉంటడంతో అటుగా వెళ్తున్న స్థానికులు ఆపి నిలదీశారు.

వారు చెప్పే సమధానాలు తేడాగా ఉంటడంతో అప్రమత్తమైన స్థానికులు ఇద్దరు దొంగలను పట్టుకున్నారు. అనంతరం స్తంభాన్నికి కట్టేసి నాలుగు తగిలించడంతో అసలు నిజం బయటకు వచ్చింది. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకా ఆ దొంగలపై సెటైర్లు పేలుతున్నాయి. ఇక నుంచి బైకు దొంగతనాలు అరికట్టాలంటే, పెట్రోల్ లేకుండా చేస్తే చాలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఈ దొంగతనాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపం తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి