iDreamPost

ఫైనాన్స్‌ ఏజెంట్ల వేధింపులు తట్టుకోలేక.. వారి ముందే!

పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. అదే వ్యాపారంతో ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు చేసింది. భర్తతో విబేధాలు రావడంతో పది సంవత్సరాలుగా ఒంటరిగా జీవిస్తోంది. కానీ ఇటీవల ఆమె చేసిన ఓ పొరపాటు..

పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. అదే వ్యాపారంతో ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు చేసింది. భర్తతో విబేధాలు రావడంతో పది సంవత్సరాలుగా ఒంటరిగా జీవిస్తోంది. కానీ ఇటీవల ఆమె చేసిన ఓ పొరపాటు..

ఫైనాన్స్‌ ఏజెంట్ల వేధింపులు తట్టుకోలేక.. వారి ముందే!

ఈ రోజుల్లో అదృష్టవంతులు ఎవరు అంటే.. అప్పులు, రోగాలు లేని వాళ్లు అంటుంటారు పెద్దలు. నిజమే మరీ.. అప్పు చేసినప్పుడు తియ్యగా ఉంటుంది. రుణం తీర్చేటప్పుడు చేదుగా, భారంగా మారుతుంది. రోజు, వారం, నెల వాయిదాల్లో డబ్బులు కరెక్టుగా కడితే.. సరే సరి, లేకుంటే పరువు తీసుకెళ్లి బజారున పడేస్తారు రుణాలిచ్చేవారు. ఇటీవల కాలంలో కొన్ని ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు డబ్బులు ఎరగా చూపించి.. ప్రజలను రుణాలు తీసుకునేలా ప్రోత్సహిస్తున్నాయి. ప్రతి నెల ఓ రోజు రుణం చెల్లించేలా ఒప్పందం చేసుకుంటారు. వాయిదా పద్దతిలో అప్పు ఇచ్చిన వాళ్ల దగ్గర నుండి వసూలు చేస్తుంటారు. వాయిదా పద్ధతి అనగానే.. మహిళలు సైతం కట్టలేకపోతామా అంటూ అప్పులు తీసుకుంటున్నారు. ఒక్క నెల కట్టకపోయినా ఇంటి మీదకు వచ్చేస్తారు ఫైనాన్స్ సంస్థల ఏజెంట్లు. నానా యాగీ చేస్తారు. ఈ అవమాన భారం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు రుణ గ్రహీతలు.

ఇటీవల కాలంలో ఆన్ లైన్.. ప్రైవేట్ సంస్థల ఆగడాలు పెట్రేగిపోతున్న సంగతి విదితమే. తొలుత అప్పులు తీసుకునేలా ఉసిగొల్పి.. సరైన సమయంలో కట్టకపోతే.. రుణాలు తీసుకునే వారి ఇంటిపై ఏజెంట్ల సాయంతో దాడులు చేస్తున్నాయి. ఈ అవమానం తట్టుకోలేక కొంత మంది మరణించిన దాఖలాలు ఇటీవల చూశాం. తాజాగా విజయవాడలో ఓ మహిళ ఫైనాన్స్ ఏజెంట్ల వేధింపులు భరించలేక బలవన్మరణానికి పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. విజయవాడ వాంబే కాలనీకి చెందిన అల్లంపల్లి మస్తానమ్మ అలియాస్ మాధవి (44) నగరంలో పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తోంది. ఆమెకు ఇద్దరు కూతుళ్లు. పెళ్లి చేసి అత్తగారింటికి పంపింది. భర్తతో విబేధాల కారణంగా విడిపోయి దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో హైదరాబాద్ కు చెందిన క్రిస్ ఫైనాన్స్, స్పందన అనే సంస్థల ప్రతినిధులు రుణాలు ఇస్తున్నామని చెప్పడంతో అప్పుగా కొంత డబ్బు తీసుకుంది.

రూ. 42 వేలు తీసుకుంటే.. రూ. 3370 చొప్పున ప్రతి నెల మొదటి బుధవారం చెల్లించే షరతుతో అప్పులు ఇచ్చాయి. దీంతో మరో కొంత మంది మహిళల్ని కూడా గ్రూప్‌గా పోగు చేసి అప్పు ఇప్పించింది. అంతలో ఆమె వ్యాపారంలో తీవ్ర నష్టం ఏర్పడింది. ఉన్న డబ్బులు అయిపోవడంతో పాటు వ్యాపారం సరిగా నడవకపోవడం, ఆరోగ్యం క్షీణించడంతో బయట మరిన్ని అప్పులు చేసింది. అంతలో రుణం ఇచ్చిన ఫైనాన్స్ సంస్థల ఏజెంట్లు నెల వాయిదా సరిగ్గా కట్టడం లేదని ఇంటి మీదకు వచ్చి గొడవ చేశారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన మాధవి.. వారు చూస్తుండగానే ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు తలుపులు కొట్టినా తీయకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇంట్లోకి వెళ్లి చూడగా.. ఫ్యానుకు ఉరి వేసుకుని కనిపించింది. పిల్లలకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి