Arjun Suravaram
భర్త మరణాన్ని దిగమింగుకుని..పిల్లల కోసం గల్ఫ్ దేశంలోకి వెళ్లి పనులు చేస్తుంది ఓ మహిళ. బిడ్డల భవిష్యత్ ఊహించుకుంటూ ఆ తల్లి అలానే జీవనం సాగిస్తుంది. అయితే ఈ క్రమంలోనే ఆమెకు ఊహించని షాక్ తగిలింది.
భర్త మరణాన్ని దిగమింగుకుని..పిల్లల కోసం గల్ఫ్ దేశంలోకి వెళ్లి పనులు చేస్తుంది ఓ మహిళ. బిడ్డల భవిష్యత్ ఊహించుకుంటూ ఆ తల్లి అలానే జీవనం సాగిస్తుంది. అయితే ఈ క్రమంలోనే ఆమెకు ఊహించని షాక్ తగిలింది.
Arjun Suravaram
తల్లిదండ్రులకు తమ పిల్లలు అంటే ఎంతో ఇష్టం. అందుకే వారిని అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. వారికి ఏ చిన్న కష్టం వచ్చిన తట్టుకోలేరు. అలానే ఓ మహిళ కూడా తన ఇద్దరు కుమార్తెలను కంటికి రెప్పలా చూసుకుంటుంది. భర్త మరణాన్ని దిగమింగుకుని..పిల్లల కోసం గల్ఫ్ దేశంలోకి వెళ్లి పనులు చేస్తుంది. బిడ్డల భవిష్యత్ ఊహించుకుంటూ ఆతల్లి అలానే జీవనం సాగిస్తుంది. ఇలాంటి తరుణ ఆమెకు ఓ విషాదకరమైన వార్త తెలిసింది. ఆమె చిన్న కుమార్తె విషయంలో దారుణం జరిగింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం…
పశ్చిమ గోదావరి జిల్లా పొడూరు లో విషాదం చోటుచేసుకుంది. ఆగ్రామానికి చెందిన చెల్లబోయిన అనూష గోపికా నందిని(14) స్థానిక డీఎస్ రాజు జడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఆమె తండ్రి మూడేళ్ల క్రితం కోవిడ్ కారణంగా మృతి చెందాడు. ఇక ఆ పాప తన అమ్మమ్మ, తాతయ్య వద్ద ఉంటూ చదువును కొనసాగిస్తుంది. చలాకీగా ఉంటూ.. అందరితో కలిసిపోయి ఉంటుంది. రోజు మాదిరిగానే సోమవారం కూడా నందిని పాఠశాలకు వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే మధ్యాహ్నం విరామంలో భోజనం చేసింది. ఆ తరువాత తన తరగతి గదిలోకి వెళ్తుండగా.. అన్నట్లు ఉండి నందినికి ఫిట్స్ వచ్చాయి.
ఈ క్రమంలోనే నందిని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే స్పందించిన తోటి విద్యార్థినులు, టీచర్లు ఆమెకు సపర్యలు చేశారు. అలానే విద్యార్థిని తాతయ్య కండిబోయిన భాస్కరరావుకు కూడా నందిని సమాచారమిచ్చారు. ఇక నందిని వాళ్ల తాతయ్య వచ్చి..తన మనవరాలిని స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే 108 వాహనంలో పాలకొల్లు ఆస్పత్రికి తరలించారు. అయితే నందినిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
ఇక నందిని వాళ్ల కుటుంబ విషయం గురించి తెలిస్తే.. కన్నీళ్లు ఆగవు. వేడంగి గ్రామానికి చెందిన శ్రీనివాసరావు, లక్ష్మీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వారిలో పెద్ద కూతురు కుసుమ పావని, రెండో అమ్మాయి నందిని. పెద్ద అమ్మాయి. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇక నందిని 9వ తరగతి చదువుతుంది. నందినికి మూగతో పాటు వినికిడి శక్తి లేదు. ఇక మూడేళ్ల క్రితం నందిని వాళ్ల తండ్రి శ్రీనివాసరావు కోవిడ్ కారణంగా మరణించారు. ఇక భర్త మరణంతో లక్ష్మి అత్తగారి ఇంటి నుంచి పుట్టినిల్లు అయినా పోడూరు వచ్చింది.
ఇక లక్ష్మీ తన పిల్లల్ని తల్లిదండ్రులకు అప్పగించి జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లింది. ఎంతో చలాకీగా ఉండే నందిని కళ్ల ముందే మృతి చెందడంతో ఆమె తాతయ్య, అమ్మమ్మలు కన్నీరు మున్నీరుగా విలపించారు. అంతేకాక అందరితో కలివిడిగా ఉండే నందిని మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరి.. జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నఈ పాప చివరకు విధి ఆడిన వింత నాటకంలో తిరిగిరాని లోకాలకు వెళ్లింది.