iDreamPost

సీమా హైదర్ తరహాలో మరో మహిళ.. ప్రియుడి కోసం భారత్‌కు!

సీమా హైదర్ తరహాలో మరో మహిళ.. ప్రియుడి కోసం భారత్‌కు!

ప్రేమించిన వ్యక్తి కోసం ఖండాంతరాలు దాటి వచ్చిన సీమా హైదర్ కథ అందరికీ తెలిసిందే. పబ్జీలో ఏర్పడిన పరిచయం, ప్రేమగా మారి.. పాకిస్తాన్‌కు చెందిన సీమా.. తన నలుగురు పిల్లలతో అక్రమంగా భారత్‌లోకి వచ్చి ఉత్తరప్రదేశ్ యువకుడ్ని వివాహం చేసుకుంది. ఈ ప్రేమ కథ ఎంతటి సంచలనం అయ్యిందో కదా. ఆ తర్వాత పోలాండ్ నుండి పోలాక్ బార్చరా, బంగ్లాదేశ్ నుండి మరో మహిళ.. స్వదేశాలను వదిలి.. విదేశీ పొరగాళ్ల కోసం వచ్చేశారు. అలాగే శ్రీలంక యువతి విఘ్నేశ్వరి.. మన తెలుగు కుర్రాడు చిత్తూరు వాసి లక్ష్మణ్ కోసం ఫ్లైట్ ఎక్కేసింది. ఇవన్నీ కూడా సోషల్ మీడియా లవ్ స్టోరీస్సే. ఈ ప్రేమ కథలన్నీ ఇంచు మించు సుఖాంతం అయ్యాయి. ఇప్పుడు మరో మహిళ.. సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తి కోసం వచ్చేసింది.

కానీ చివరకు ఆ ప్రేమ కథ బెడిసికొట్టింది. ఎన్నో ఆశలతో ప్రేమికుడి కోసం దేశం కానీ దేశం నుండి రాగా, ఆమెకు అసలు విషయం తెలిసి బేల చూపులు చూస్తుంది. ఇంతకు ఆమె ప్రేమ కథ ఏంటంటే.. బంగ్లాదేశ్‌కు చెందిన దిల్రూబా శర్మ, ముగ్గురు పిల్లల తల్లి. కోవిడ్ సమయంలో భర్త మరణించడంతో బ్యూటిషయన్‌గా పనిచేస్తూ.. పిల్లల్ని పోషించుకుంటుంది. బహ్రెయిన్‌లో చెఫ్‌గా పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని రోషన్ గఢ్ గ్రామానికి చెందిన అబ్దుల్ కరీమ్‌తో సోషల్ మీడియాలో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ మేసేజ్‌లు చేసుకోవడం ప్రారంభించారు. అలా ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అయితే అబ్దుల్ బ్రహెయిన్ నుండి వస్తున్నాడని తెలిసి, తన ముగ్గురు పిల్లలతో కలిసి యుపీకి టూరిస్ట్ వీసాపై వచ్చింది.

ఈ ఐదుగురు కలిసి.. స్వస్థలానికి వెళ్లే ముందు రెండు రోజుల పాటు హోటల్లో బస చేశారు. అబ్దుల్ స్వదేశానికి వచ్చాడని, ఇంకా ఇంటికి రాలేదని గ్రహించిన అతడి భార్య.. తోటి గ్రామస్థులు నిలదీసే సరికి.. అప్పుడు అతడికి పెళ్లి అయ్యిందన్న విషయం దిల్రూబాకు తెలిసింది. అతడితో జీవితం గడిపేందుకు వచ్చిన దిల్రూబా.. అబ్దుల్ కు వివాహం అయయిందని తెలిసే సరికి.. ఆమె హృదయం ముక్కలైంది. ఏం చేయాలో పాలుపోక.. తిరిగి స్వదేశానికి వెళ్లిపోవాలని భావిస్తోంది. కాగా, ఈ విషయం పోలీసులకు తెలిసింది. ఆమెను విచారించగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె టూరిస్టు వీసాపై ఇక్కడకు వచ్చారని, ఎటువంటి నేర కోణం లేదని, ఆమె వీసా ఇంకా చెల్లుబాటులో ఉందని పోలీసులు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి