iDreamPost

ఓ బ్యాంకులో ఉద్యోగిగా సేవలు.. అన్నీ బాగానే ఉన్నాయనుకుంది, కానీ..!

ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు అరుంధతి. గతంలో ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇక అంతా బాగానే ఉందనుకున్న తరుణంలోనే ఊహించని ఘటన చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే?

ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు అరుంధతి. గతంలో ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇక అంతా బాగానే ఉందనుకున్న తరుణంలోనే ఊహించని ఘటన చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే?

ఓ బ్యాంకులో ఉద్యోగిగా సేవలు.. అన్నీ బాగానే ఉన్నాయనుకుంది, కానీ..!

ఈమె పేరు హేమ అరుంధతి. గతంలో ఈ మహిళ సహంత్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. పెళ్లైన కొంత కాలానికి హేమకు ఓ బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి ఈ దంపతులు సంతషంగానే ఉండేవారు. వీరి సంసారాన్నిచూసి ఈ మహిళ తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు సైతం మురిసిపోయారు. కానీ, ఉన్నట్టుండి ఇలా జరగడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కు గురవుతున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇంతకు ఈ ఘటన అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని అనకాపల్లి జిల్లా మాకవరపాలం మండలం కె. వెంకటాపురం గ్రామానికి చెందిన హేమ అరుంధతి గతంలో ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే, పెళ్లైన కొంత కాలానికి ఈమె భర్త మరణించాడు. దీంతో అరుంధతి మాకవరపాలం మండలం కె. వెంకటాపురంకు చెందిన సహంత్ అనే వ్యక్తిని రెండవ పెళ్లి చేసుకుంది. వీరికి కొన్నాళ్లకి ఓ కుమారుడు జన్మించాడు. అలా వివాహ అనంతరం ఈ దంపతులు ఆనందంగానే ఉన్నారు. గతంలో ఆమెకు ఎస్ బీఐ బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. దీంతో ఈ భార్యాభర్తలు ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగానే సంసారాన్ని కొనసాగించేవారు. కానీ, ఆమె భర్త సహంత్ ప్రతీ చిన్న విషయంపై భార్య అరుధతిని వేధించేవాడని సమాచారం.

రోజు రోజుకు అతనితో పాటు అత్తమామల టార్చర్ ఎక్కువవడంతో ఈ మహిళ భరించలేకపోయింది. ఇటీవల కూడా సహంత్ భార్యతో గొడవ పడి ఆమెను మరోసారి వేధించాడు. ఇతని వేధింపులను భరించలేని అరుంధతి శుక్రవారం సాయంత్రం పెదబొడ్డెపల్లిలో ఉన్న ఓ తోటలోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సీన్ చూసిన కొందరు స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నపోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకుని మృతురాలి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం ఆమె భర్త, అత్తింటి వేధింపుల కారణంగానే మా కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. ఆ తర్వాత ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి