iDreamPost
android-app
ios-app

లైఫ్ లో సెటిల్ కాలేదు! కానీ.. ప్రియురాలితో ఆ పనులు!

Shivamogga Crime News: ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రతి చిన్న విషయానికి తీవ్రంగా స్పందిస్తూ.. కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆ సమయంలో విచక్షణ కోల్పోయి తాము ఏం చేస్తున్నామో తెలియకుండా దారుణాలకు తెగబడుతున్నారు.

Shivamogga Crime News: ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రతి చిన్న విషయానికి తీవ్రంగా స్పందిస్తూ.. కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆ సమయంలో విచక్షణ కోల్పోయి తాము ఏం చేస్తున్నామో తెలియకుండా దారుణాలకు తెగబడుతున్నారు.

లైఫ్ లో సెటిల్ కాలేదు! కానీ.. ప్రియురాలితో ఆ పనులు!

ఇటీవల పెద్దలు కుదిర్చిన పెళ్లి కన్నా.. తాము ఇష్టపడ్డ వారిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. కొంత కాలం రిలేషన్ లో ఉంటూ ఇద్దరి అభిప్రాయాలు ఏకమైన వేళ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నారు. కానీ కొంతమంది ప్రేమికుల మధ్య చిన్న చిన్న గొడవలు చిలికి చిలికి గాలివానగా మారి ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం కొన్నిసార్లు హత్యలకు దారి తీస్తున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. రెండేళ్లకు పైగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు.. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి. ఈ జంటను చూసి స్నేహితులు సైతం కుళ్లుకునే వారు. కానీ ఏమైందో తెలియదు.. ప్రియుడు ఆమెపై దారుణానికి తెగబడ్డాడు. ఈ ఘటన షిమోగా జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే

కర్ణాటక రాష్ట్రం షిమోగా జిల్లాలో దారుణ సంఘటన వెలుగు చూసింది. రెండేళ్లుగా ప్రేమించిన తన ప్రియురాలిని అతి దారుణంగా గొంతు కోసి చంపాడు ప్రియుడు. ఈ ఘటన హుసానానగర్ తాలూకా ఖయాపూర గ్రామంలో చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిక్కమగళూరు జిల్లా కొప్పకు చెందిన సౌమ్య, షిమోగా జిల్లా సాగర్ కు చెందిన నిందితుడు సృజన్ రెండున్నరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే సృజన్ ని సౌమ్య పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడం మొదలు పెట్టింది. తాను ఇంకా సెటిల్ కాలేదు.. పెళ్లి తర్వాత చేసుకుందాం అంటూ వచ్చాడు సృజన్. కానీ సౌమ్య మాత్రం ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలని పోరు పెట్టడం మొదలు పెట్టింది.

ఇక సౌమ్య పోరు తట్టుకోలేక కోపోద్రిక్తుడైన సృజన్ ఆమె అడ్డు తొలగించుకోవాలని భావించాడు. ఈ క్రమంలోనే ఆమె గొంతు కోసి హత్య చేసి మృత దేహాన్ని పూడ్చిపెట్టాడు. సౌమ్య కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేసే క్రమంలో హత్య మిస్టరీ వెలుగులోకి వచ్చింది. తీర్థహళ్లిలో ఓ ఫైనాన్స్ కంపెనీలో సృజన్ వర్క్ చేస్తున్నాడు. సౌమ్య నర్సింగ్ చేస్తుంది. ఇద్దరూ వేర్వేరు వర్గాలు కావడంతో పెళ్లికి పెద్దలు నిరాకరించారు. ఈ క్రమంలోనే పెద్దలను ఎదిరించి సౌమ్య జులై 2న తీర్థహళ్లికి వెళ్తానని చెప్పి వచ్చింది. తనను పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకువెళ్లాలని గట్టిగా చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగి సౌమ్యపై దాడి చేశాడు సృజన్. అంతేకాదు కత్తితో గొంతు కోయడంతో సౌమ్య అక్కడే చనిపోయింది. మృత దేహాన్ని ముంబాలు ప్రాంతోంలో మూడ్చిపెట్టాడు. సౌమ్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు సృజన్ పై అనుమానం వచ్చి తమదైన స్టైల్లో విచారించగా అసలు నిజం బయటపెట్టాడు. సౌమ్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సృజన్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి