iDreamPost

లీకైన ఆరా మస్తాన్ సర్వే.. వైసీపీ గెలుపొందే 104 స్థానాల జాబితా ఇదే!

Aaraa Mastan Survey Leaked: ఆరా మస్తాన్ సర్వే లీక్ అయ్యినట్లు సోషల్ మీడియాలో ఒక జాబితా వైరల్ అవుతుంది. అయితే అందులో వైసీపీ 104 స్థానాలను గెలుచుకోబోతుందని.. ఆ నియోజకవర్గాలు ఏంటో కూడా ఉంది.

Aaraa Mastan Survey Leaked: ఆరా మస్తాన్ సర్వే లీక్ అయ్యినట్లు సోషల్ మీడియాలో ఒక జాబితా వైరల్ అవుతుంది. అయితే అందులో వైసీపీ 104 స్థానాలను గెలుచుకోబోతుందని.. ఆ నియోజకవర్గాలు ఏంటో కూడా ఉంది.

లీకైన ఆరా మస్తాన్ సర్వే.. వైసీపీ గెలుపొందే 104 స్థానాల జాబితా ఇదే!

ఆరా మస్తాన్ సర్వేకి జనాల్లో ఒక ఆదరణ ఉంది. ఆయన చెప్పింది వందకు వంద శాతం జరుగుతుందని నమ్ముతారు. గతంలో ఆయన చెప్పినట్టే జరిగాయి. ఈసారి కూడా ఆయన చెప్పినట్టే వైసీపీ అధికారంలోకి వస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇప్పటికే వైసీపీకి 94 నుంచి 104 స్థానాలు వస్తాయని.. కూటమికి 71 నుంచి 81 స్థానాలు వస్తాయని వెల్లడించారు. కాగా ఆరా మస్తాన్ సర్వే లీక్ అయిందని సోషల్ మీడియాలో ఒక జాబితా వైరల్ అవుతోంది. వైసీపీ గెలుచుకునే 104 స్థానాలు ఇవే అంటూ వైరల్ చేస్తున్నారు.

కృష్ణా జిల్లాలో గుడివాడ, నూజివీడు, తిరువూరు, పెడన, పామర్రు, విజయవాడ వెస్ట్, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో 8 అసెంబ్లీ స్థానాలను వైసీపీనే కైవసం చేసుకుంటుంది. గుంటూరు జిల్లాలో పెదకూరపాడు, నరసరావుపేట, గురజాల, మాచర్ల, సత్తెనపల్లి, వినుకొండ, గుంటూరు ఈస్ట్, బాపట్ల నియోజకవర్గాల్లో 8 స్థానాలను గెలుచుకోబోతుందట. ప్రకాశం జిల్లా నుంచి వై పాలెం, దర్శి, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, కందుకూరు.. మొత్తం 6 నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగరవేస్తుందట.

శ్రీకాకుళం జిల్లాలో పలాస, పాతపట్నం, ఎచ్చెర్ల, రాజాం, పాలకొండ నియోజకవర్గాల్లో 5 అసెంబ్లీ స్థానాలను వైసీపీ గెలుచుకుంటుందని ఆ జాబితాలో ఉంది. విజయనగరం జిల్లాలో చీపురుపల్లి, కురుపాం, సాలూరు, గజపతినగరం, పార్వతీపురం, శృంగవరపు కోట నియోజకవర్గాల్లో మొత్తం 6 అసెంబ్లీ స్థానాలను వైసీపీ దక్కించుకుంటుందని వైరల్ అవుతున్న లిస్టులో ఉంది. విశాఖ జిల్లాలో చోడవరం, మాడుగుల, పాడేరు, అరకు, పాయకరావుపేట, వైజాగ్ సౌత్, పెందుర్తి మొత్తం 7 ఎమ్మెల్యే అభ్యర్థులు వైసీపీ జెండా ఎగరవేస్తారని ఉంది.

తూర్పు గోదావరి జిల్లాలో అనపర్తి, జగ్గంపేట, రామచంద్రపురం, రంపచోడవరం, తుని, రాజానగరం, అమలాపురం, రాజోలు, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో 9 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీనే విజయం సాధిస్తుందని ఆరా మస్తాన్ లిస్టులో తేలింది. పశ్చిమగోదావరి జిల్లాలో కొవ్వూరు, గోపాలపురం, ఆచంట, పోలవరం, ఉంగుటూరు, నిడదవోలు, చింతలపూడి, దెందులూరు నియోజకవర్గాల్లో 8 స్థానాలను వైసీపీ ఎగరేసుకుపోతుంది.

నెల్లూరు జిల్లాలో కావాలి, ఆత్మకూరు, ఉదయగిరి, వెంకటగిరి, సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపే, నెల్లూరు రూరల్.. మొత్తం 8 అసెంబ్లీ స్థానాలను వైసీపీ గెలుచుకుంటుందని లీకైన ఆరా మస్తాన్ సర్వేలో ఉంది. చిత్తూరు జిల్లాలో పుంగనూరు, పూతలపట్టు, తిరుపతి, జీ నెల్లూరు, సత్యవేడు, మదనపల్లి, శ్రీకాళహస్తి, చిత్తూరు, చంద్రగిరి, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలను వైసీపీ గెలుచుకోబోతుందట. అనంతపురం జిల్లాలో రాప్తాడు, సింగనమల, అనంతపురం అర్బన్, కదిరి, ధర్మవరం, మడకశిర, గుంతకల్లు నియోజకవర్గాల్లో 7 అసెంబ్లీ స్థానాలను వైసీపీ గెలుచుకోనుందట.

కర్నూలు జిల్లాలో ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, నంద్యాల, ఆళ్లగడ్డ, శ్రీశైలం, కోడుమూరు, పత్తికొండ, డోన్, నందికొట్కూరు, పాణ్యం నియోజకవర్గాల్లో 12 అసెంబ్లీ స్థానాలను వైసీపీ సొంతం చేసుకోనుందట. కడప జిల్లాలో కడప, పొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, రాయచోటి, రైల్వే కోడూర్, మైదుకూరు, బద్వేల్, కమలాపురం, రాజంపేట నియోజకవర్గాల్లో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలను వైసీపీ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆరా మస్తాన్ సర్వేలో తేలినట్లు.. అది లీక్ అయినట్లు సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి