iDreamPost

కదల్లేని భర్త కోసం సొంత దేశం వదిలి వచ్చిన మహిళ!

మనం పురాణాల్లో భర్తల కోసం తమ జీవితాలనే త్యాగం చేసిన భార్యల కథలు ఎన్నో చూశాం. అయితే అలాంటి వారు నేటికాలంలో చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తుంటారు. కదల్లేని స్థితిలో భర్త ఉంటే వదిలించుకునే వారు ఉన్న ఈ కాలంలో సొంత దేశాన్ని వదలి వచ్చిన ఓ మహిళ అందరికి స్ఫూర్తిగా నిలిచింది.

మనం పురాణాల్లో భర్తల కోసం తమ జీవితాలనే త్యాగం చేసిన భార్యల కథలు ఎన్నో చూశాం. అయితే అలాంటి వారు నేటికాలంలో చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తుంటారు. కదల్లేని స్థితిలో భర్త ఉంటే వదిలించుకునే వారు ఉన్న ఈ కాలంలో సొంత దేశాన్ని వదలి వచ్చిన ఓ మహిళ అందరికి స్ఫూర్తిగా నిలిచింది.

కదల్లేని భర్త కోసం సొంత దేశం వదిలి వచ్చిన మహిళ!

భార్యాభర్తల బంధం అనేది ఎంతో గొప్పది. దంపతుల మధ్య ఉండే అన్యోన్యత గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. రెండు వేరు వేరు మనసత్వాలు కలిగిన వారు పెళ్లి అనే బంధంతో ఒక్కటవుతుంటారు. సంసార జీవితంలో ఎదురయ్యే సమస్యలను కలిసి పరిష్కరించుకుంటూ హాయిగా జీవిస్తుంటారు. ఇంత వరకు బాగానే ఉన్నా..  భార్యాభర్తల్లోని నిజమైన ప్రేమలు మాత్రం.. భాగస్వామికి కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే భయటపడుతుంటాయి. చాలా మంది బతికి ఉన్న శవంలాగా మారిన భాగస్వామికి సేవలు చేయకుండా తప్పించుకుంటారు. చాలా తక్కువ మంది మాత్రమే ఏడడుగులు నడిచిన వారితోనే నా ప్రయాణం అంటూ, వారి కోసం తమ జీవితాన్ని అకింతం చేస్తుంటారు. అలా కదల్లేని భర్త కోసం ఓ మహిళ చేసిన సాహసం, త్యాగం చాలా గొప్పదనే చెప్పాలి.

పంజాబ్ కి చెందిన హర్పాల్ సింగ్ కి కొలంబియాకు చెందిన ఆనీలకు ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆమె అగ్రికల్చర్ చదువుతుండగా, హర్పాల్ సింగ్ మాత్రం స్థానికంగా ప్లంబర్ గా పని చేస్తున్నాడు. 2018 వీరిద్దరు ఫేస్ బుక్ ద్వారా పరిచయం చేసుకుని, చివరకు ప్రేమికులుగా మారారు. ఏడాది తరువాత అంటే 2019లో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. ఒక అమ్మాయి..తనకు కాబోయో వాడి వ్యక్తి విషయంలో ఎలాంటి లక్షణాలు ఆశిస్తోంది, అవన్నీ హర్పాల్ లో ఉన్నాయని, అతడు ఓ ఫ్యామిలీ మ్యాన్ అని అనీల చెప్పుకొచ్చింది. అలా వారిద్దరు కొంతకాలం సంతోషంగా జీవించారు. ఏడాది తరువాత వ్యక్తిగత పనుల నిమిత్తం ఆనీల తన స్వదేశం అయినా కొలంబియాకు వెళ్లింది.

ఇద్దరు తరచూ స్పానిష్ లో మాట్లాడుకుంటారు. ఇలా సాగుతున్న సమయంలో వారి సంసారం పెద్ద కుదుపునకు గురైంది. హర్పాల్ సింగ్ రోడ్డు ప్రమాదానికి గురై.. బతికి ఉన్న జీవచ్ఛవంలా మారాడు. ఢిల్లీలో జరిగిన రైతుల ధర్నాలో పాల్గొని 2012 నవంబర్ 5న తిరిగి సొంత ఊరికి బయలు దేరాడు. ఈ క్రమంలో మార్గంలో తాను ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. దీంతో ఆయన వెన్నెముక, మెడ, ఇతర శరీర భాగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మొత్తంగా ఆయన బెడ్ కే పరిమితం అయ్యాడు. సొంతంగా తన పనులు తాను చేసుకోలేని స్థితిలో హర్పాల్  ఉన్నాడు. ఇలా కదల్లేని స్థితిలో ఉన్న భర్త కోసం ఆనీ గొప్ప నిర్ణయం తీసుకుంది.

తన సొంత వారిని, సొంత దేశాన్ని వదలి భర్త కోసం ఇండియాకు వచ్చింది. కదల్లేని హర్పాల్‌కు ఆమె దగ్గరుండి సేవ చేస్తున్నారు. ఆయనకు సేవలు చేయడంలోనే తనకు సంతోషం ఉందని ఆమె చెప్పుకొచ్చింది.  హర్పాల్ సింగ్ నడవలేకపోయినా, తన లక్ష్యాలు చేదిరిపోయినా, జీవితంలో మొత్తం నాశమైన అతడు మాత్రం సంతోషంగా ఉన్నాని చెబుతున్నాడు. అంతేకాక తన సంతోషానికి కారణం..తన భార్యా అనీనానే అని చెప్పుకొచ్చాడు. హర్పాల్ తిరిగి మాములు స్థితికి చేరేందుకు దాదాపు 30 లక్షల వరకు ఖర్చు అవుతోందని, ఎవరైన దాతలు సాయం చేస్తే సంతోషం అని ఆనీ చెప్పుకొచ్చారు.

ఇప్పటికే ఇంటి అవసరాల కోసం అనేక అప్పులు చేశామని, చికిత్స చేయించే స్థితిలో కూడా తానులేని ఆమె తెలిపారు. భర్తలు మంచాన పడితే పరాయివాడి కోసం వెంపర్లాడే కొందరు మహిళు… ఈ విదేశీ మహిళను చూసేన బుద్ధి మార్చుకోవాలని పలువురు సూచిస్తున్నారు. వివాహం బంధానికి అసలైన నిర్వచనం ఈ మహిళ చెప్పిందంటూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాక హర్పాల్ త్వరగా కోలుకుని తిరిగి మాములు స్థితికి రావాలని ఆశిస్తున్నారు. మరి.. ఈ విదేశి మహిళపై మీ అభిప్రాయాలను కామెంట్స్ తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి