iDreamPost

చిరుత దాడిలో చిన్నారి లక్షిత మృతి.. రూ.10 లక్షల పరిహారం

చిరుత దాడిలో చిన్నారి లక్షిత మృతి.. రూ.10 లక్షల పరిహారం

తిరుమల కాలినడక దారిలో లక్షిత అనే బాలిక చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. శనివారం వెలుగు చూసిన ఈ ఘటన యావత్ రెండు తెలుగు రాష్ట్ర ప్రజలను భయందోళనలకు గురి చేసింది. ఈ ఘటనతో స్థానిక ప్రజలను ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనపై టీటీడీ ( తిరుమల తిరుపతి దేవస్థానం) తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఇక ఈ విషాద ఘటనపై కొందరు స్పందిస్తూ చిరుత దాడిలో చనిపోయిన లక్షిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.

ఈ క్రమంలోనే టీటీడీ ముందుకు వచ్చి పరిహారం ఇస్తామని ప్రకటించింది. ఇక తాజాగా బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం ఇస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఇదే కాకుండా అటవీ శాఖ నుంచి కూడా రూ.5. లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. చిరుత దాడిలో ఆరేళ్ల లక్షిత చనిపోవడంతో మృతురాలి తల్లి గుండెలు పగిలేలా ఏడ్చింది. ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు సైతం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

అసలు ఏం జరిగిందంటే?

శుక్రవారం రాత్రి 7:30 నిమిషాల సమయంలో తిరుమల కొండపైకి అలిపిరి మార్గం ద్వారా లక్షిత తన కుటుంబ సభ్యులతో కలిసి కాలినడకన బయలు దేరింది. ఇదే సమయంలో ఓ చిరుత ఉన్నట్టుండి లక్షితపై దాడి చేసి అడవిలోకి ఈడ్చుకెళ్లింది. దీంతో తల్లి వెంటనే అధికారులకు సమాచారం అందించింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు బాలిక ఆచూకి కోసం అడవిలో రాత్రంతా గాలింపు చర్యలు చేపట్టారు. ఇక ఉదయం అలిపిరి నరసింహస్వామి ఆలయం సమీపంలో బాలిక లక్షిత మృతదేహం సగభాగం లభ్యమైంది. ఆ తర్వాత అటవీ శాఖ అధికారులు ఆ చిరుతను పట్టుకున్నారు. ఇదే అంశం ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారుతోంది.

ఇది కూడా చదవండి: హైదరాబాద్ లో దారుణం.. మైనర్ బాలికపై తండ్రీకొడుకుల అత్యాచారం!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి