iDreamPost

OTT Suggestion: పార్లల్ లైఫ్స్ చుట్టూ థ్రిల్లర్ మూవీ! ఇంత మంచి మూవీ ఎలా మిస్ అయ్యారు?

  • Published Apr 27, 2024 | 3:10 PMUpdated Apr 27, 2024 | 3:10 PM

ఇప్పుడు చెప్పుకోబోయే తెలుగు డబ్బింగ్ థ్రిల్లర్ మూవీ ఒకటి ఉందని చాలా మందికి తెలియకపోవచ్చు. మరి ఆ మూవీ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఇప్పుడు చెప్పుకోబోయే తెలుగు డబ్బింగ్ థ్రిల్లర్ మూవీ ఒకటి ఉందని చాలా మందికి తెలియకపోవచ్చు. మరి ఆ మూవీ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

  • Published Apr 27, 2024 | 3:10 PMUpdated Apr 27, 2024 | 3:10 PM
OTT Suggestion: పార్లల్ లైఫ్స్ చుట్టూ  థ్రిల్లర్ మూవీ! ఇంత మంచి మూవీ ఎలా మిస్ అయ్యారు?

ఒక ఇన్సిడెంట్ జరిగినపుడు దానిని ఎలా సాల్వ్ చేశారు అనే విషయాలను తెల్సుకోవాలంటే.. అందరికి ఎంతో ఇంట్రెస్ట్ గా ఉంటుంది. అందుకనే ఈ జోనర్ లో వచ్చే సినిమాలన్నీ కూడా మంచి ఆదరణ పొందుతున్నాయి. కేవలం క్రైమ్ , సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను మాత్రమే చూసే ప్రేక్షకులు ఉంటూ ఉంటారు, ఈ క్రమంలో మేకర్స్ కూడా ఇతర భాషల సినిమాలను తెలుగు డబ్బింగ్ చేసి మరి విడుదల చేస్తున్నారు. దీనితో మూవీ లవర్స్ ఆయా సినిమాలను ఇంకాస్త ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు ఎన్నో సినిమాలను చూసిన థ్రిల్లర్ మూవీ లవర్స్. ఒకవేళ ఈ సినిమాను మిస్ అయ్యారేమో చెక్ ఓ లుక్ వెసెయ్యండి. అసలు ఇంతకీ ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా పేరు “జీవి”. ఇది 2019 లో వచ్చిన తమిళ సినిమా.. కానీ ఈ సినిమా ఇప్పుడు తెలుగులో ఆహా ప్లాట్ ఫార్మ్ లో అందుబారులో ఉంది. ఈ సినిమా క్రైమ్ మూవీ లవర్స్ కు ఖచ్చితంగా నచ్చేస్తుంది. అందులోను తమిళ భాషలలో ఇటువంటి థ్రిల్లర్ తరహా కథనాలను మరింత ఆసక్తిగా చూపిస్తూ ఉంటారు. దీనితో మూవీ లవర్స్ కూడా ఎంతో ఇంట్రెస్ట్ గా సినిమాలను చూస్తూ ఉంటారు. మూవీస్ లో ఆయా కేసులను సాల్వ్ చేసే విధానమే అందరిని ఈ జోనర్ సినిమాలకు కట్టిపడేసేలా చేస్తుంది. దీనితో థ్రిల్లర్ సినిమాలకు రోజు రోజుకు ఆదరణ బాగా పెరిగిపోతుంది. జీవి సినిమా కూడా అలాంటిదే. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి. అసలు ఏంటి ఈ సినిమా ఎందుకు చూడాలి అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఒక సామాన్య రైతు కుటుంబానికి చెందిన యువకుడు.. ఉద్యోగం కోసం పల్లెటూరు నుంచి పట్నం బయలుదేరతాడు. ఓ సంవత్సరం పాటు రకరకాల పనులు చేసి.. ఓ జ్యూస్ షాప్ లో ఉద్యోగాన్ని సంపాదిస్తాడు. ఇక ఆ తర్వాత హీరో జీవితంలో ప్రేమ, అతని అక్క ఇంటి నుంచి వెళ్లిపోవడం, అతని తండ్రి మరణం ఇలా అనుహ్యమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. సరిగ్గా 20 సంవత్సరాల క్రితం.. అతను ఇంటి ఓనర్ జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలే జరుగుతాయి. ఒకే రకమైన సంఘటనలు రెండు వేరు వేరు కుటుంబాలలో ఎలా జరిగాయి ! మరి దానిని హీరో ఎలా తెలుసుకున్నాడు ! అసలు నిజంగా ఇలాంటి సంఘటనలు జరుగుతాయా ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి