iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ లో దారుణం.. మైనర్ బాలికపై తండ్రీకొడుకుల అత్యాచారం!

  • Published Aug 12, 2023 | 4:54 PM Updated Updated Aug 12, 2023 | 4:54 PM
  • Published Aug 12, 2023 | 4:54 PMUpdated Aug 12, 2023 | 4:54 PM
హైదరాబాద్ లో దారుణం.. మైనర్ బాలికపై తండ్రీకొడుకుల అత్యాచారం!

దేశంలో మహిళలు, బాలికలపై అత్యాచార ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు నిర్భయ, దిశ వంటి చట్టాలు రూపొందించినా దుర్మార్గుల ఆలోచనల్లో మాత్రం మార్పు రావడం లేదు. అయితే ఇలాంటి దారుణ ఘటనే తాజాగా హైదరాబాద్ లో మరొకటి చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలికపై తండ్రీకొడుకులు అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ విషయం తెలుసుకున్న బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.

పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ లోని బషీరాబాద్ లో కర్ణాటకకు చెందిన శివ కుమార్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి పెళ్లై వయసుకొచ్చిన కుమారుడు కూడా ఉన్నాడు. కాగా, శివకుమార్ స్థానికంగా ఉన్న ఓ కంపెనీలో పనికి కుదిరాడు. రోజూ పనికి వెళ్తూ ఉండేవాడు. అయితే వీరి ఇంటి పక్కనే ఏడేళ్ల బాలిక తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటుంది. ఈ చిన్నారిపై శివ కుమార్, అతని కుమారుడు కన్నేశారు. ఇదిలా ఉంటే.. ఈ నెల 10న ఆ చిన్నారి ఇంటి వద్ద తన స్నేహితులతో కలిసి ఆడుకుంటూ ఉంది. దీంతో శివ కుమార్ ఆ పాపను గమనించాడు. సమోసా ఇస్తానని నమ్మించి ఆ బాలికను ఇంట్లోకి తీసుకెళ్లాడు.

ఆ తర్వాత ఆ చిన్నారిపై బలవంతంగా అత్యాచారం చేసి వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే శివకుమార్ కుమారుడు సైతం వచ్చి అభం, శుభం తెలియని చిన్నారిపై అత్యాచారం చేశాడు. దీంతో ఆ బాలిక ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లింది. ఇదే సమయంలో ఆ బాలికకు తీవ్ర రక్త స్రావం కావడంతో తల్లిదండ్రులు గమనించి వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. ఈ చిన్నారిపై అత్యాచారం జరిగిందని గుర్తించారు. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అనంతరం కూతురు చెప్పిన వివరాలు ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.

ఇది కూడా చదవండి: ఆస్తి కోసం సొంత మనవడిని చంపిన తాతయ్య..

Jojobet Girişcasibomjojobetjojobetcasibomcasibomcasibomgrandpashabetşanlıurfa konteynerbetciobetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetJojobetStarzJojobetStarzbetjojobet güncel girişkingroyalgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom