iDreamPost

AP ఎన్నికలు: 2024 మేనిఫెస్టో విడుదల చేసిన CM జగన్‌.. నవరత్నాలతో పాటు మరి కొన్ని పథకాలు

  • Published Apr 27, 2024 | 1:20 PMUpdated Apr 27, 2024 | 1:23 PM

YSRCP Manifesto: 2024 ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో భాగంగా సీఎం వైఎస్‌ జగన్‌.. మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ పథకాలు ఉన్నాయంటే..

YSRCP Manifesto: 2024 ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో భాగంగా సీఎం వైఎస్‌ జగన్‌.. మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ పథకాలు ఉన్నాయంటే..

  • Published Apr 27, 2024 | 1:20 PMUpdated Apr 27, 2024 | 1:23 PM
AP ఎన్నికలు: 2024 మేనిఫెస్టో విడుదల చేసిన CM జగన్‌.. నవరత్నాలతో పాటు మరి కొన్ని పథకాలు

మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెల అనగా మే 13న ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. రానున్న ఎన్నికల కోసం అధికార, విపక్ష పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇక ఇప్పటికే ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామనేషన్లు దాఖలు, వాటి పరిశీలన అంశం పూర్తయ్యింది. ఇక ఎన్నికల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. నేడు అనగా శనివారం నాడు.. వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోను విడుదల చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మేనిఫెస్టోను ఆవిష్కరించారు.

అనంతరం సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘‘2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99శాతం నెరవేర్చాము. ఈ ఐదేళ్ల పాలనలో ఇచ్చిన హామీలను అన్నింటిని నెరవేర్చడం ఆనందంగా ఉంది. ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత మాకే దక్కుతుంది. ఏ నెలలో ఏ పథకం ఇస్తామో చెప్పి ఆ స్కీమ్‌ను అమలు చేశాం. నేను అలవికానీ హామీలు ఇవ్వను. చేయగలిగే హామీలే ఇచ్చి.. ప్రతి దాన్ని నెరవేర్చి.. నేడు హీరోలా జనాల్లోకి వెళ్తున్నాను. కోవిడ్ మహమ్మారి ప్రభావంతో రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా.. ఆదాయం లేకపోయినా ఎలాంటి సాకులు చూపలేదు. మేనిఫెస్టో అమలుకు ఎన్ని సమస్యలు వచ్చినా.. చిరు నవ్వుతో ప్రజలకు తోడుగా ఉన్నాం. కుల, మత, ప్రాంత, పార్టీలకు అతీతంగా.. కేవలం అర్హులకు మాత్రమే.. ఎక్కడా ఎలాంటి అవినీతికి తావులేకుండా.. నేరుగా లబ్ధిదారులకే పథకాలను అందించాము’’ అని చెప్పుకొచ్చారు.

‘‘మిగతా పార్టీల సంగతి మాకు తెలియదు కానీ.. మా దృష్టిలో మాత్రం మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథం. భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌గా భావిస్తాము. గత ఐదేళ్లలోనే మేనిఫెస్టోకు ప్రాధాన్యత వచ్చింది. రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో, అధికారి దగ్గర మేనిఫెస్టో ఉంది. మేనిఫెస్టోను ప్రతీ ఇంటికి పంపించాము. ఓ ప్రొగ్రెస్‌ కార్డు మాదిరి మా ప్రభుత్వం ఏమేం చేశామన్నది ప్రజలకు వివరించాము. మోసపూరిత హామీల్లో చంద్రబాబుతో పోటీ పడలేకపోయానని.. చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా ఉండేందుకు.. చేయగలిగింది మాత్రమే చెప్పాను’’ అన్నారు. అంతేకాక 2014 ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని అయినా చంద్రబాబు నెరవేర్చారా అని ప్రశ్నించారు.. నిరుద్యోగులు, మహిళలు, రైతుల్ని మోసం చేశారని ఆరోపించారు.

నవరత్నాలకు తోడు మరిన్ని పథకాలతో 2024 మేనిఫెస్టో..

2024 ఎన్నికల మేనిఫెస్టోలో.. డీబీటీ పథకాలకు సంబంధించి నగదు పెంపు హామీలను పొందుపరిచినట్లు తెలుస్తోంది. వీటితోపాటు కొత్తగా పారిశ్రామీకరణ, ఉద్యోగ కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టింది వైసీపీ ప్రభుత్వం. మహిళలు, రైతులు, యువకులు, కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా మేనిఫెస్టో రూపొందించినట్టు సమాచారం. అలానే మౌలిక సదుపాయాల కల్పనపై హామీలను మేనిఫెస్టోలో చేర్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

2024 మేనిఫెస్టోలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు పెద్ద పీట వేసేలా రూపొందించినట్లు తెలుస్తోంది. అలానే యువత, మహిళల కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టో రూపొందించారని వార్తలు వస్తున్నాయి. అంతేకాక ఈసారి తీసుకువచ్చిన పెన్షన్, అమ్మఒడి, రైతు భరోసా, చేదోడు లాంటి హామీలను కొనసాగిస్తూనే వాటిని పెంచే యోచన చేస్తోంది వైసీపీ సర్కార్‌. 2019లో ఇచ్చిన హామీలను కొనసాగిస్తూనే కొత్త పథకాలకి శ్రీకారం చుడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిరుద్యోగుల కోసం మరిన్ని పథకాలు తీసుకొచ్చిన్నట్లు తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి