iDreamPost

Rinku Singh: రింకూ కెరీర్​తో ఆడుకుంటున్న KKR.. ఈ పాపం ఊరికే పోదు!

  • Published Apr 27, 2024 | 3:12 PMUpdated Apr 27, 2024 | 3:12 PM

పించ్ హిట్టర్ రింకూ సింగ్ కెరీర్​తో కోల్​కతా నైట్ రైడర్స్ టీమ్ ఆడుకుంటోందనే విమర్శలు వస్తున్నాయి. అసలు రింకూ విషయంలో కేకేఆర్ చేస్తున్న మిస్టేక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పించ్ హిట్టర్ రింకూ సింగ్ కెరీర్​తో కోల్​కతా నైట్ రైడర్స్ టీమ్ ఆడుకుంటోందనే విమర్శలు వస్తున్నాయి. అసలు రింకూ విషయంలో కేకేఆర్ చేస్తున్న మిస్టేక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Apr 27, 2024 | 3:12 PMUpdated Apr 27, 2024 | 3:12 PM
Rinku Singh: రింకూ కెరీర్​తో ఆడుకుంటున్న KKR.. ఈ పాపం ఊరికే పోదు!

రింకూ సింగ్.. ఇప్పుడంటే స్టార్ ప్లేయర్​గా పేరు తెచ్చుకున్నాడు. కానీ ఒకప్పుడు అతడో అనామక ఆటగాడు. కోల్​కతా నైట్ రైడర్స్ టీమ్​కు సెలక్ట్ అయ్యాడు. కానీ ఆడే ఛాన్స్ అతడికి వెంటనే రాలేదు. సహచర ఆటగాళ్లకు డ్రింక్స్ అందిస్తూ, ఎవరికైనా ఇంజ్యురీ అయితే వచ్చి ఫీల్డింగ్ చేసేవాడు. అయితే డైవింగ్ క్యాచ్​లు, రన్స్ లీక్ కాకుండా ఆపడం, బౌండరీ లైన్ దగ్గర బంతుల్ని సేవ్ చేస్తుండటంతో అతడికి క్రమంగా గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత బ్యాటింగ్ ఛాన్స్ రావడం, అతడు అదరగొట్టడం, అక్కడి నుంచి నేరుగా టీమిండియాలోకి అడుగుపెట్టడం వరకు మిగిలిన స్టోరీ తెలిసిందే. అయితే ఆపర్చునిటీస్ ఇచ్చి ఈ స్థాయికి తెచ్చిన కేకేఆర్ ఇప్పుడు రింకూ కెరీర్​తో ఆడుకుంటోందనే విమర్శలు వస్తున్నాయి.

కోల్​కతా ఈసారి వరుస విజయాలతో దుమ్మురేపుతోంది. దీంతో టీమ్​లో అందరు ఆటగాళ్లు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కానీ రింకూ సింగ్ మాత్రం సంతోషంగా లేడట. దీనికి టీమ్ మేనేజ్​మెంట్ అతడితో వ్యవహరిస్తున్న తీరే కారణమని తెలుస్తోంది. ఫస్ట్ బాల్ నుంచే హిట్టింగ్​కు దిగే రింకూను బ్యాటింగ్ ఆర్డర్​లో మరీ వెనక్కి పంపిస్తున్నారు. అతడికి కనీసం 10 బంతులు ఆడే ఛాన్స్ కూడా రావట్లేదు. నిన్నటి మ్యాచ్​లోనూ ఇదే జరిగింది. కేకేఆర్ ఇన్నింగ్స్​కు నరైన్, సాల్ట్ మంచి స్టార్ట్ ఇచ్చారు. 10 ఓవర్లకు ఆ టీమ్ స్కోరు 138. ఆ తర్వాత నరైన్ ఔట్ అయ్యాడు. అప్పుడు రస్సెల్ లేదా రింకూను పంపుతారని అంతా అనుకున్నారు. కానీ వెంకటేశ్ అయ్యర్​ను దింపారు. అతడు 23 బంతుల్లో 39 రన్స్ చేశాడు. అతడు 169 స్ట్రయిక్ రేట్​తో రన్స్ చేశాడు. అయ్యర్ ప్లేస్​లో రింకూను ఆడించి ఉంటే ఈజీగా 200 స్ట్రయిక్ రేట్​తో బ్యాటింగ్ చేసేవాడు.

ఐపీఎల్ సీజన్​లో స్మాల్ మార్జిన్​తో రిజల్ట్స్ మారుతున్నందున రింకూను ముందు పంపకుండా కేకేఆర్ తప్పు చేసిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రింకూ ముందు వచ్చి ఉంటే టీమ్ మరింత భారీ స్కోరు చేసేది. సేమ్ టైమ్ ఈ సీజన్​లో అతడికి సరైన ఛాన్సులు రావడం లేదు. 8 మ్యాచుల్లో కలిపి రింకూ చేసింది 112 పరుగులే. కాబట్టి నిన్న కరెక్ట్ టైమ్​కు ఆడించి ఉంటే టీమ్​కు ప్లస్ అయి ఉండేది, అలాగే ఎక్కువ బంతులు ఆడి భారీగా పరుగులు చేసి ఉంటే రింకూకు కూడా మరింత కాన్ఫిడెన్స్ వచ్చేది.

బ్యాటింగ్ ఆర్డర్​లో పైన ఆడే సత్తా ఉన్నప్పటికీ రింకూను లాస్ట్​లో దింపుతున్నారు. ఇలా ప్రతి మ్యాచ్​లో ఆఖర్లో పంపిస్తుండటం అతడి కెరీర్​కు కూడా ఇబ్బందికరమే. టీ20 వరల్డ్ కప్ స్ట్రీమ్ ఆఫ్ థింగ్స్​లో ఉన్న రింకూకు తన బ్యాట్ పవర్ చూపించే ఛాన్సే రావడం లేదు. అతడి సెలక్షన్​పై ప్రభావం చూపించడం పక్కాగా కనిపిస్తోంది. దీంతో రింకూ కెరీర్​ను కేకేఆర్ నాశనం చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. అతడి పాపం ఆ టీమ్​ను వదలక మానదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి.. రింకూ విషయంలో కోల్​కతా మేనేజ్​మెంట్ వ్యవహరిస్తున్న తీరుపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి