iDreamPost

RCBలో ఆ ప్లేయర్‌పై కోపంగా కోహ్లీ! స్నేహం కాస్త శత్రుత్వంగా మారిందా?

  • Published Apr 27, 2024 | 2:08 PMUpdated Apr 27, 2024 | 2:08 PM

Virat Kohli, Faf Du Plessis: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఆర్సీబీ అంచనాలకు తగ్గట్లు రాణించలేకపోతుంది. జట్టు పరిస్థితి పక్కనపెడితే.. ఆర్సీబీలోని ఓ స్టార్‌ ప్లేయర్‌పై కోహ్లీ పీకలదాకా కోపంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకో ఇప్పుడు చూద్దాం..

Virat Kohli, Faf Du Plessis: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఆర్సీబీ అంచనాలకు తగ్గట్లు రాణించలేకపోతుంది. జట్టు పరిస్థితి పక్కనపెడితే.. ఆర్సీబీలోని ఓ స్టార్‌ ప్లేయర్‌పై కోహ్లీ పీకలదాకా కోపంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకో ఇప్పుడు చూద్దాం..

  • Published Apr 27, 2024 | 2:08 PMUpdated Apr 27, 2024 | 2:08 PM
RCBలో ఆ  ప్లేయర్‌పై కోపంగా కోహ్లీ! స్నేహం కాస్త శత్రుత్వంగా మారిందా?

ఐపీఎల్‌ 2024లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ప్రదర్శన అంత బాగా లేదు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ కేవలం 2 విజయాలు మాత్రమే సాధించి, 7 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌లో సీఎస్‌కేతో తలపడిన ఆర్సీబీ ఓటమి పాలైంది. ఆ తర్వాత పంజాబ్‌పై విజయం సాధించింది. కానీ, ఆ వెంటనే వరుసగా 6 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఇటీవల సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఉప్పల్‌లో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించింది ఆర్సీబీ. ఈ విజయంతో ఆ జట్టుకు ఇంకా ప్లే ఆఫ్‌ అవకాశాలు సజీవంగా ఉన్నాయి. అయినా కూడా ఆర్సీబీ స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీ.. అదే టీమ్‌లోని మరో స్టార్‌ ప్లేయర్‌పై చాలా కోపంగా ఉన్నట్లు సమాచారం. ఆ క్రికెటర్‌ ఎవరో? ఎందుకు కోహ్లీ అతనిపై కోపంగా ఉన్నాడు? అనే విషయాల గురించి ఇప్పుడు చూద్దాం..

విరాట్‌ కోహ్లీ చాలా కాలంగా ఆర్సీబీకి కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే. టీమిండియాకు మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా ఉంటూనే ఐపీఎల్‌లో ఆర్సీబీని కెప్టెన్‌గా నడిపించాడు. విరాట్‌ కోహ్లీ కెప్టెన్సీలో 2016లో ఆర్సీబీ ఫైనల్‌ కూడా ఆడింది. కానీ, టైటిల్‌ అయితే గెలవలేకపోయింది. ఆర్సీబీ తరఫున ఐపీఎల్‌ కప్పు కొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్న కోహ్లీ.. అందుకు తన కెప్టెన్సీ అడ్డు వస్తుందేమో అని భావించి, తన కెప్టెన్సీని త్యాగం చేశాడు. అయితే.. తన తర్వాత ఆర్సీబీని ఎవరి చేతుల్లో పెడితే బాగుంటుందని బాగా ఆలోచించి.. సౌతాఫ్రికా స్టార్‌ ఆటగాడు ఫాఫ్‌ డుప్లెసిస్‌ని కెప్టెన్సీ స్థానంలో కూర్చోబెట్టాడు. భారీ స్టార్‌డమ్‌ ఉండి కూడా కోహ్లీ కెప్టెన్సీని కేవలం ఆర్సీబీ మంచి కోరి త్యాగం చేశాడు. కానీ, కోహ్లీ ఆశించిన ఫలితం మాత్రం రాలేదు.

ఐపీఎల్‌ 2022 నుంచి డుప్లెసిస్‌.. ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే.. కోహ్లీ అంత కమిట్‌మెంట్‌తో డుప్లెసిస్‌ కెప్టెన్సీని చేయడం లేదనేది స్పష్టం. పైగా బ్యాటర్‌గా కూడా దారుణంగా విఫలం అవుతున్నాడు. పరుగులు చేయాలి, మ్యాచ్‌లు గెలవాలి అనే సీరియస్‌నెస్‌ ఫాఫ్‌లో ఏ కోసనా కనిపించడం లేదని ఆర్సీబీ ఫ్యాన్స్‌ కూడా ఆరోపిస్తున్నారు. తాను ఎంతో నమ్మి ఒక పెద్ద టీమ్‌ కెప్టెన్సీ చేతుల్లో పెడితే.. దాన్ని డుప్లెసిస్‌ సీరియస్‌గా తీసుకోకుండా, కేవలం డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఏదో ఆడుతున్నాను అన్న రీతిలో ఆడుతుండటం కోహ్లీకి ఏ మాత్రం నచ్చడం లేదని తెలుస్తోంది. అందుకే డుప్లెసిస్‌పై కోహ్లీ కోపంగా ఉన్నట్లు సమాచారం. డుప్లెసిస్‌కి ఆర్సీబీ టైటిల్‌ గెలవడం ఇంపార్టెంట్‌ కాకపోవచ్చు, కానీ, కోహ్లీకి మాత్రం చాలా ఇంపార్టెంట్‌. ఆ విషయాన్ని డుప్లెసిస్‌ ఇప్పటికైనా గ్రహిస్తే మంచిదని ఆర్సీబీ ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. కాగా, డుప్లెసిస్‌లో మార్పు రాకుంటే.. ఐపీఎల్‌ 2025కు కోహ్లీ ఒక్కడినే రిటేన్‌ చేసుకుని, టీమ్‌ మొత్తాన్ని మార్చిపడేయాలని కూడా ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు సమాచారం. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి