iDreamPost

బట్టలు మార్చుకుంటున్నప్పుడు ఆ నిర్మాత వేధించాడు! నటి ఓపెన్ కామెంట్స్!

నిర్మాత వల్ల తాను ఎదుర్కొన్న సమస్యల గురించి సోషల్ మీడియా వేదికగా బయట పెట్టిందో నటి. అతడు పెట్టిన హింస గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యింది. మేకప్ రూంలో ఉండగా.. గది లాక్ చేసి

నిర్మాత వల్ల తాను ఎదుర్కొన్న సమస్యల గురించి సోషల్ మీడియా వేదికగా బయట పెట్టిందో నటి. అతడు పెట్టిన హింస గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యింది. మేకప్ రూంలో ఉండగా.. గది లాక్ చేసి

బట్టలు మార్చుకుంటున్నప్పుడు ఆ నిర్మాత వేధించాడు! నటి ఓపెన్ కామెంట్స్!

బుల్లితెర ప్రేక్షకులు కేవలం తెలుగు సీరియల్స్ మాత్రమే కాదు.. హిందీ డబ్బింగ్ వర్షన్లను కూడా ఆదరిస్తున్న సంగతి విదితమే. చిన్నారి పెళ్లి కూతురు, ఈ తరం ఇల్లాలు, చూపులు కలిసిన శుభవేళ, కోడలా కోడలా కొడుకు పెళ్లామా, వసంతం, పునర్వివాహం, కుంకుమ భాగ్య వంటి ధారావాహికలను ఇక్కడ కూడా ఎక్కువ టీఆర్పీ అప్పగించారు. అలాంటి మరో సీరియల్.. మనుసు పలికే మౌనగీతం. స్టార్ మాలో నాలుగేళ్ల క్రితం ప్రసారమైన ఈ సీరియల్‌ను కూడా బాగానే వాచ్ చేశారు బుల్లితెర ప్రేక్షకులు. ఇది హిందీ సీరియల్ యే హై మొహబ్బతేన్ తెలుగు వర్షన్. ఇందులో అలియా రాఘవ్ భల్లా పాత్రలో నటించింది కృష్ణ ముఖర్జీ. పాపులారిటీ తెచ్చుకుంది. లీడ్ యాక్టర్ అవకాశాలు అందిపుచ్చుకుని ముందుకు వెళుతుంది.

శుభ్ షాగూన్ అనే సీరియల్లో నటిస్తుండగా.. ఒక్క సారిగా ఈ షో నుండి తప్పుకుంది. అయితే ఆ సీరియల్ నుండి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టును పంచుకుంది.  నిర్మాత వల్లే.. ఈ సీరియల్ నుండి వైదొలగాల్సి వచ్చిందని తెలిపింది. తనకు చెల్లించాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వలేదని, సెట్స్‌లో తనను వేధించాడని పేర్కొంది. నిర్మాత కుందన్ సింగ్ కారణంగా తాను గత కొన్ని నెలలుగా డిప్రెషన్‌తో, ఆందోళనకు గురవుతున్నానని తెలిపింది. నిర్మాత తనను మేకప్ రూమ్‌లోకి లాక్కెళ్లాడని, బట్టలు మార్చుకునేటప్పుడు తలుపు కొట్టాడని, తనను చాలాసార్లు బెదిరించాడని నటి ఆవేదన వెళ్లగక్కింది.

కృష్ణ ముఖర్జీ తన పోస్టులో ఇలా రాసుకొచ్చింది. ‘నా మనస్సులో మాట బయటకు చెప్పే ధైర్యం నాకు లేదు. కానీ ఈ రోజు చెప్పాలనుకుంటున్నారు. ప్రస్తుతం నేను కష్ట సమయాన్ని ఎదుర్కొంటున్నా. నిరుత్సాహం, ఒంటరి బతుకు బతుకుతున్నా. నేను దంగల్ టీవీ ప్రసారం అవుతున్న శుభ్ షాగున్ ధారావాహిక స్టార్ట్ చేసినప్పటి నుండి నాకు ఇది ప్రారంభమైంది. ఈ సీరియల్ చేయడమే నేను తీసుకున్న అతిపెద్ద తప్పుడు నిర్ణయం. ఈ సీరియల్ చేయకూడదు అనుకున్నా కానీ.. ఇతరుల మాటలను విని ఒప్పందంపై సంతకం చేసాను. ఆ సీరియల్ ప్రొడక్షన్ హౌస్ నిర్మాత కుందన్ నన్ను చాలా సార్లు వేధించారు. నేను అనారోగ్యంతో మేకప్ రూంలో రెస్ట్ తీసుకుంటున్న సమయంలో లాక్ చేశాడు. నాకు రెమ్యునరేషన్ కూడా ఇవ్వకుండా వేధించాడు’ అని చెప్పుకొచ్చింది.

‘ డబ్బులు ఇవ్వకపోవడంతో నేను షూట్ చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఓ రోజు నేను దుస్తులు మార్చుకుంటున్నప్పుడు.. తలుపులు బద్దలయ్యేలా డోర్స్ మీద కొట్టాడు. ఇప్పటి వరకు నాకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ కూడా చెల్లించలేదు. నేను ప్రొడక్షన్ హౌస్, దంగల్ ఆఫీస్‌కి వెళ్ళాను కానీ ఉపయోగం లేదు. ఇక సెట్స్ లో నాకు భద్రత లేదని భావించి.. షో నుండి తప్పుకున్నాను. ఇవేమీ తెలియని ప్రజలు ఎందుకు షో నుండి తప్పుకున్నావని అడుగుతారు.. నాకు భయంగా ఉంది.. నాకు న్యాయం కావాలి’ అంటూ ఎమోషనల్ పోస్టు చేసింది. కాగా, ఈ పోస్టు చూసిన తోటి నటులు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Krishna Mukherjee (@krishna_mukherjee786)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి