iDreamPost
android-app
ios-app

Ramayana: ‘రామాయణ’ నుండి రణబీర్, సాయి పల్లవి ఫోటోలు లీక్

  • Published Apr 27, 2024 | 11:59 AM Updated Updated Apr 27, 2024 | 12:08 PM

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది రామాయణ. మూడు భాగాలుగా రూపుదిద్దుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ స్టార్ అయ్యింది. కాగా, దీనికి కూడా లీకుల బెడద తప్పడం లేదు

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది రామాయణ. మూడు భాగాలుగా రూపుదిద్దుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ స్టార్ అయ్యింది. కాగా, దీనికి కూడా లీకుల బెడద తప్పడం లేదు

  • Published Apr 27, 2024 | 11:59 AMUpdated Apr 27, 2024 | 12:08 PM
Ramayana: ‘రామాయణ’ నుండి రణబీర్, సాయి పల్లవి ఫోటోలు లీక్

ఇతి హాస గాధలను తెరకెక్కించేందుకు ఆసక్తి చూపుతోంది బాలీవుడ్. ఇటీవల ఆదిపురుష్ అనే చిత్రాన్ని రూపొందించిన సంగతి విదితమే. ఇప్పుడు బాలీవుడ్ డైరెక్టర్ నితిశ్ తివారీ మరో రామయణాన్ని తీయబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్ ‘రామాయణ‘ తెరకెక్కబోతుంది. ఇందులో రాముడిగా యానిమల్ స్టార్, ఒకప్పటి లవర్ బాయ్ రణబీర్ కపూర్ నటిస్తుండగా.. సీతగా టాలీవుడ్ నాచురల్ బ్యూటీ సాయి పల్లవి యాక్ట్ చేస్తుంది. అలాగే కేజీఎఫ్ హీరో యశ్ నటిస్తున్నారు.  రావణాసురుడిగా యాక్ట్ చేస్తున్నట్లు టాక్. వీరితో పాటు సన్నీడియోల్, రకుల్ ప్రీత్ సింగ్, విజయ్ సేతు పతి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం రణబీర్ పూర్తిగా మేకోవర్ అవుతున్నాడు. లుక్ కోసం జిమ్‌లో చెమటోస్తున్న ఫోటో వైరల్ అయ్యింది కూడా.

ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీ- ప్రొడక్షన్ పనులు జరుపుకుని ఇటీవల షూటింగ్ స్టార్ అయ్యింది. ఇందులో యాక్టర్స్ లుక్స్ లీక్ కాకుండా ఉండేలా సెట్స్ లోకి సెల్ ఫోన్స్ కూడా నిషేధించారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు రణబీర్- సాయి పల్లవి ఫోటోలు లీక్ అయ్యాయి. రాముడు, సీత పాత్రలకు సంబంధించి రణబీర్, సాయి పల్లవి పిక్స్ అందులో కనిపిస్తున్నాయి. రణబీర్ ధోతీలో కనిపిస్తుండగా, డ్యాన్స్ క్వీన్ సాయి పల్లవి చీరలో మరింత నాచురల్ లుక్‌లో మెస్మరైజ్ చేస్తుంది. ఇద్దరూ మెరూన్ కలర్ దుస్తుల్లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. గప్ చుప్‌గా సినిమా కానిద్దమంటే.. ఈ సినిమాకు కూడా లీకుల బెడద తప్పడం లేదు. ఇక ఈ సినిమాలో నటించేందుకు ఈ న్యాచురల్ బ్యూటీ బాగానే డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

రామాయణ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న మలార్.. రూ. 10 కోట్లు రెమ్యునరేన్ తీసుకోనుందని టాక్. ఈ సినిమా కోసం రణబీర్ విలువిద్యలు నేర్చుకోవడంతో పాటు మాంసాహారం, మద్యపానం సేవించడం లేదని తెలుస్తోంది. ఈ సినిమాను మూడు భాగాలుగా తెరకెక్కించనున్నాడు దర్శకుడు నితీశ్. తొలి పార్ట్ వచ్చే ఏడాది దీపావళికి తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఇక తెలుగు డైలాగులను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రాయనున్నారు. అలాగే ఈ సినిమా నిర్మాణంలో నటుడు యశ్ కూడా భాగస్వామ్యం కానున్నాడు. మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్, ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ పతాకాలపై నమిత్ మల్హోత్రాతో కలిసి యశ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

Jojobet GirişjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş