iDreamPost

ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే.. కల్కి అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది

ప్రభాస్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్. రెబల్ స్టార్ నటిస్తున్న తాజా చిత్రం కల్కి 2828 ఏడీ. ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూసే ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్ డేట్. కల్కి అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది.

ప్రభాస్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్. రెబల్ స్టార్ నటిస్తున్న తాజా చిత్రం కల్కి 2828 ఏడీ. ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూసే ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్ డేట్. కల్కి అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది.

ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే.. కల్కి అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ కల్కి2828 ఏడీ. ఈ మూవీపై భారీ అంచానాలు నెలకొన్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సినీ చరిత్రలో వరల్డ్ వైడ్ గా రికార్డులు బద్దలు కొట్టేందుకు కల్కి సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అని డార్లింగ్ అన్నట్టు పాన్ ఇండియా స్థాయి దాటుకుని హాలీవుడ్ రేంజ్ లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇక కల్కి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్ డేట్ ఇచ్చింది మూవీ యూనిట్. రెబల్ స్టార్ అభిమానులకు పండగలాంటి వార్తను అందించింది. తాజాగా కల్ని అఫీషియల్ రిలీజ్ డేట్ పిక్స్ అయ్యింది. కల్కి ఎప్పుడు రిలీజ్ కానుందంటే?

చాలా రోజుల తర్వాత సలార్ సినిమాతో ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించారు డార్లింగ్ ప్రభాస్. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టింది. రెబలోడి స్థాయికి తగ్గ హిట్ ఇచ్చింది సలార్ మూవీ. ఈ సినిమా విజయంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ అంచనాలు ఏమాత్రం తగ్గకుండా సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కతున్న కల్కి మూవీని తీర్చిదిద్దుతున్నారు నాగ్ అశ్విన్. ప్రాజెక్టు K అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ ప్రారంభించుకుని ఈ చిత్రం చివరకు కల్కి 2898 ఏడీ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసుకొన్నది. ఇక ఈ మూవీని జూన్ 27వ తేదీన రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు మేకర్స్.

 

సుమారుగా 600 కోట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమాను సమ్మర్ హాలిడేస్ లోనే విడుదల చేయాలని భావించారు. మే 9న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ఇది వరకే ప్రకటించారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, ఇతర పనుల కారణంగా ఈ సినిమా విడుదల తేదీని జూన్ 27కు మార్చారు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సీ అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపిక పదుకోన్, దీపిక పదుకోన్ తదితరులు నటిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి