iDreamPost

కల్కికి నాగీ రెమ్యునరేషన్ ఎంత..? ఇది ఏకంగా రాజమౌళి రేంజ్

  • Published Apr 27, 2024 | 2:46 PMUpdated Apr 27, 2024 | 2:46 PM

యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ ఆశ్విన్ గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈయన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ మూవీ కల్కి 2898AD చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు నాగ్ ఆశ్విన్ కు ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ ఆశ్విన్ గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈయన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ మూవీ కల్కి 2898AD చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు నాగ్ ఆశ్విన్ కు ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

  • Published Apr 27, 2024 | 2:46 PMUpdated Apr 27, 2024 | 2:46 PM
కల్కికి నాగీ రెమ్యునరేషన్ ఎంత..? ఇది ఏకంగా రాజమౌళి రేంజ్

యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ ఆశ్విన్ గురించి అందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో ఈయన తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. కాగా, నాగ ఆశ్విన్.. చేసినవి రెండు సినిమాలే అయిన వాటి కోసం అతను ఎంచుకున్న కథ, స్క్రీన్ ప్రెజెంటేషన్ అనేది అతనిని స్టార్ డైరెక్టర్ గా మార్చేశాయి. ఈక్రమంలోనే ప్రేక్షకుల్లో నాగ్ ఆశ్విని సినిమాలకు విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. ఇక ఎంతో అద్భుతంగా నటి సావిత్రి బయోపిక్ ను మహానటిగా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ మూవీ కల్కి 2898AD చిత్రాన్ని నాగ్ ఆశ్విన్ తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం నాగ్ ఆశ్విన్ ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

డార్లింగ్ ప్రభాస్ హీరోగా కల్కి 2898AD చిత్రాన్ని నాగ్ ఆశ్విన్ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసింది. అయితే త్వరలోనే ఈ సినిమా పార్ట్ 1 విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. నాగ్ ఆశ్విన్ 2015లో అశ్వినీదత్ కుమార్తె ప్రియాంకదత్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి తన మామయ్య అశ్వినీదత్ ప్రొడక్షన్ లోనే తప్ప బయట సినిమాలు చేయడం లేదనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. నాగ్ అశ్విన్ తో ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి సినిమాలని వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ లలో అశ్వినీదత్ అతని కుమార్తె స్వప్నదత్ నిర్మించారు. కాగా, ఈ రెండు సినిమాలు వైజయంతీ మూవీస్ కి లాభాలతో పాటు అవార్డులు కూడా తెచ్చి పెట్టాయి. ఇక ఇప్పుడు ల్కి 2898ఏడీ చిత్రాన్ని  వైజయంతీ మూవీస్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇకపోతే మొదటి రెండు సినిమాలకు నాగ్ ఆశ్విన్ రెమ్యునరేషన్ తీసుకున్నాడు.

nag aswin

కాగా, ఇప్పుడు కల్కి సిమాకు కూడా అల్లుడు మీద నమ్మకంతో అశ్వినీదత్ భారీ స్థాయిలోనే ఖర్చ పెడుతున్నారు. ఇక  ఒక  సినిమాపై అశ్వినీదత్ 500 కోట్లు ఖర్చు పెట్టడం ఇదే మొదటిసారి. అయితే కల్కి సినిమా కోసం నాగ్ ఆశ్విన్ కు ఎలాంటి  రెమ్యునరేషన్ ఇస్తున్నారనేది ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ మారింది. అయితే ఈ సినిమాలో నటిస్తున్న ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె అలాగే స్టార్ క్యాస్ట్, టెక్నీషియన్స్ కు అందరితో కలిపి 250 కోట్ల వరకు రెమ్యునరేషన్ కోసమే ఖర్చు చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

అయితే, ఈ విషయంలో అశ్వినీ దత్ అల్లుడికి ఎలాంటి రెమ్యునరేషన్ ఇవ్వడం లేదంట. కేవలం సినిమా లాభాల్లో వాటా ఇచ్చేలా డీల్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ డీల్ ప్రకారం.. నాగ్ అశ్విన్ కి కల్కి 2898ఏడీ చిత్రం ద్వారా 50 కోట్లకు పైగానే ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, బిజినెస్ పెరిగి మరింత లాభాలు వస్తే నాగ్ అశ్విన్ కి మూవీ ద్వారా వచ్చే ప్రాఫిట్ కూడా పెరగనున్నట్లు సమాచారం. ఈ లెక్కన చూసుకుంటే ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై రాజమౌళి తర్వాత అత్యధిక రెమ్యునరేషన్ అందుకోబోతున్న డైరెక్టర్ గా నాగ్ అశ్విన్ కూడా నిలిచే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ జోరుగా వినిపిస్తోంది. మరి, ప్రభాస్ కల్కి 2898ఏడీ సినిమాకుగాను నాగ్ ఆశ్విన్ కు అందుకుంటున్న రెమ్యునరేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి