iDreamPost

పోలీసు జాబంటే మీకు ఇష్టమా.. లక్ష 77 వేల జీతంతో ఉద్యోగాలకు నోటిఫికేషన్

  • Published Apr 27, 2024 | 2:38 PMUpdated Apr 27, 2024 | 2:38 PM

మీకు పోలీసు ఉద్యోగం అంటే ఇష్టమా.. అయితే భారీ వేతనంతో ఖాకీ జాబ్‌ పొందే అవకాశం కల్పిస్తోంది. ఆ వివరాలు..

మీకు పోలీసు ఉద్యోగం అంటే ఇష్టమా.. అయితే భారీ వేతనంతో ఖాకీ జాబ్‌ పొందే అవకాశం కల్పిస్తోంది. ఆ వివరాలు..

  • Published Apr 27, 2024 | 2:38 PMUpdated Apr 27, 2024 | 2:38 PM
పోలీసు జాబంటే మీకు ఇష్టమా.. లక్ష 77 వేల జీతంతో ఉద్యోగాలకు నోటిఫికేషన్

యువతలో చాలా మందికి పోలీసు ఉద్యోగమంటే ఎంతో ఇష్టం. కనీసం కానిస్టేబుల్‌ పోస్ట్‌ అయినా సాధించి.. ఒంటి మీద ఖాకీ డ్రెస్సు ధరించాలని ఉబలాటపడతారు. మరీ మీకు కూడా ఇలానే పోలీసు ఉద్యోగమంటే ఇష‍్టమా.. అయితే మీ కోసమే కేంద్ర ప్రభుత్వం భారీ జీతంతో యూనిఫామ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్‌ ద్వారా లక్ష 77 వేల జీతంతో పోలీస్‌ జాబ్‌ పొందే అవకాశం కల్పిస్తుంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.

కేంద్ర సాయుధ బలగాల్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్‌ఎఫ్‌) ఒకటి. దేశ సరిహదుల్లో గస్తీ చేపట్టడం బీఎస్‌ఎఫ్ సిబ్బంది ప్రధాన విధి. కేంద్ర, రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్స్‌లో క్వాలిఫై అవ్వని వారు డిపార్ట్‌మెంట్ జాబ్ కోసం ఈ సంస్థలో చేరవచ్చు. తాజాగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ), సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్‌) ఎగ్జామ్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పరీక్షతో బీఎస్‌ఎఫ్‌లో అసిస్టెంట్ కమాండెంట్ (గ్రూప్-ఏ) ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. ఈ నోటిషికేషన్‌ ద్వారా యూపీఎస్సీ మొత్తం 186 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. వీటికి అప్లై చేసుకోవడానికి మే 14 చివరి తేదీ. అర్హులైన అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక పోర్టల్ upsc.gov.in విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవాలి.

నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు..

  • ఏజ్‌ లిమిట్‌ – దరఖాస్తుదారుల వయసు 2024 ఆగస్టు ఒకటి నాటికి కనీసం 20 ఏళ్లు ఉండాలి. గరిష్ట వయసు 25 ఏళ్ల కంటే ఎక్కువ ఉండకూడదు.
  • చదువు – గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • అప్లికేషన్ ఫీజు – బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలనుకునే జనరల్ కేటగిరీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.200 చెల్లించాలి. ఇక, మహిళ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.
  • సెలక్షన్‌ ప్రాసెస్‌ – బీఎస్‌ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పలు దశల్లో ఉంటుంది. ముందు రాత పరీక్ష, రెండో దశలో ఫిజికల్ టెస్ట్‌లు, చివరికి ఇంటర్వ్యూ ఉంటుంది.
  • పరీక్ష వివరాలు – రాత పరీక్ష సీఏపీఎఫ్‌ పరీఓ ఆగస్టు 4న జరుగుతుంది. ఇందులో పేపర్-1, పేపర్-2 ఉంటాయి. దీనిలో క్వాలిఫై అయితే రెండో దశలో జరిగే ఫిజికల్ టెస్ట్‌లకు అర్హత సాధిస్తారు. ఆ తరువాత మూడో దశలో పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది.
  • అప్లికేషన్ ప్రాసెస్ – అర్హులైన అభ్యర్థులు యూపీఎస్సీ పోర్టల్ https://www.upsconline.nic.in విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. మొదటిసారి అప్లై చేసుకునే వారు ముందుగా యూపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్‌) ప్లాట్‌ఫారమ్‌లో తప్పనిసరిగా రిజస్టర్ అవ్వాలి. ఆ తరువాత బీఎస్‌ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ రిక్రూట్‌మెంట్‌కు అప్లై చేసుకోవాలి.
  • జీతం – బీఎస్‌ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ పోస్ట్‌లకు ఎంపికయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500 మధ్య లభిస్తుంది.

కాగా, యూపీఎస్సీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామ్ ద్వారా అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు బీఎస్‌ఎఫ్‌లో 186 భర్తీ చేయడంతో పాటు ఇతర ఫోర్సెస్ సీఆర్‌పీఎఫ్‌లో-120, సీఐఎస్‌ఎఫ్-100, ఐటీబీపీ-58, ఎస్‌ఎస్‌బీలో 42 అసిస్టెంట్ కమాండెంట్ ఖాళీలను భర్తీ చేస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి