iDreamPost

క్రేజీ ఫీచర్లతో BMW న్యూ ఎలక్ట్రిక్ కారు.. సింగిల్‌ చార్జ్ తో 516 కి.మీల రేంజ్

ఎలక్ట్రిక్ కార్లకు వస్తున్న డిమాండ్ నేపథ్యంలో ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు వీటి తయారీపై దృష్టి పెట్టాయి. ఈ క్రమంలో ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్య్లూ సరికొత్త ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది.

ఎలక్ట్రిక్ కార్లకు వస్తున్న డిమాండ్ నేపథ్యంలో ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు వీటి తయారీపై దృష్టి పెట్టాయి. ఈ క్రమంలో ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్య్లూ సరికొత్త ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది.

క్రేజీ ఫీచర్లతో BMW న్యూ ఎలక్ట్రిక్ కారు.. సింగిల్‌ చార్జ్ తో 516 కి.మీల రేంజ్

ఎలక్ట్రిక్ వాహనాలకు వాహనదారుల నుంచి ఆదరణ పెరుగుతోంది. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా ఈవీ తయారీ కంపెనీలు సరికొత్త మోడళ్లను తీసుకొస్తున్నాయి. ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైకులు, కార్లు మార్కెట్ లో తమ సత్తాచాటుతున్నాయి. ఈవీ వాహనాలకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలో కార్లంటే ఇష్టపడే వారికి మరో అద్భుతమైన ఎలక్ట్రిక్ కారు అందుబాటులోకి వచ్చింది. జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బీఎండబ్య్లూ సరికొత్త ఎలక్ట్రిక్ మోడల్ ను లాంచ్ చేసింది. దేశీయ మార్కెట్‌కు ఎలక్ట్రిక్‌ సెడాన్‌ ఐ5ని పరిచయం చేసింది.

బీఎండబ్య్లూ కార్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది. కస్టమర్లను మరింత ఆకర్షించేందుకు బీఎండబ్య్లూ ఎలక్ట్రిక్ కార్లను తీసుకొస్తుంది. ఎలక్ట్రిక్‌ 5 సిరీస్‌లో భాగంగా విడుదల చేసిన తొలి మాడల్‌ ‘ఐ5 ఎం60 ఎక్స్‌డ్రైవ్. క్రేజీ ఫీచర్లతో దుమ్మురేపుతోంది. ఈ కారు సింగిల్ ఛార్జ్ తో 516 కి.మీలు ప్రయాణించొచ్చని కంపెనీ తెలిపింది. ఈ కారు ప్రారంభ ధర రూ.1.20 కోట్లుగా నిర్ణయించింది కంపెనీ. ఈ కారు బుకింగ్స్ ఏప్రిల్ 5 నుంచే ప్రారంభమయ్యాయి. బీఎండబ్ల్యూ ఇప్పటికే దేశీయ మార్కెట్లో ఐఎక్స్1, ఐఎక్స్ ఎక్స్‌డ్రైవ్50, ఐ4 మరియు ఐ7 వంటి ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది.

స్టన్నింగ్ లుక్ లో కస్టమర్లను ఆకట్టుకుంటోంది ఐ5 ఎం60 ఎక్స్‌డ్రైవ్. ఈ కారు.. కేవలం 3.8 సెకండ్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్నది. గంటకు 230 కిలోమీటర్లు వేగంతో ప్రయాణించనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 205కిలోవాట్ల ఏసీ చార్జర్‌ కలిగిన ఈ కారు బ్యాటరీ కేవలం అరగంటలోనే 10 శాతం నుంచి 80 శాతం వరకు చార్జికానున్నది. 14.9 అంగుళాల టచ్‌స్క్రీన్‌ డిస్‌ప్లే, 360 డిగ్రీల్లో కెమెరా, ఎలక్ట్రికల్‌ అడ్జస్టబుల్‌ సీట్లతో రూపొందించింది. బ్యాటరీ మీద 8 సంవత్సరాలు లేదా 1.6 లక్షల కిమీ వారంటీ అందిస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి