iDreamPost

కట్ట​కున్న భార్యను కాదనుకున్న నారాయణ.. అఫిడవిట్‌లో అన్ని మోసాలంటూ సాక్షి కథనం

  • Published Apr 27, 2024 | 11:00 AMUpdated Apr 27, 2024 | 11:00 AM

Narayana: నారాయణ విద్యా సంస్థల అధినేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఎన్నికల కోసం కట్టుకున్న భార్యను కాదకునుకున్నారు. ఎన్నికల అఫిడవిట్‌లో ఆమె వివరాలు వెల్లడించలేదు.

Narayana: నారాయణ విద్యా సంస్థల అధినేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఎన్నికల కోసం కట్టుకున్న భార్యను కాదకునుకున్నారు. ఎన్నికల అఫిడవిట్‌లో ఆమె వివరాలు వెల్లడించలేదు.

  • Published Apr 27, 2024 | 11:00 AMUpdated Apr 27, 2024 | 11:00 AM
కట్ట​కున్న భార్యను కాదనుకున్న నారాయణ.. అఫిడవిట్‌లో అన్ని మోసాలంటూ సాక్షి కథనం

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో ముఖ్యమైన నామినేషన్ల దాఖలు, పరిశీలన శుక్రవారం నాడు పూర్తయ్యింది. ఈ క్రమంలో నారాణయ విద్యా సంస్థల అధినేత, టీడీపీ మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఎన్నికల అఫిడవిట్‌ తప్పుల తడకగా ఉందని.. దానిలో ఆయన కట్టుకున్న భార్య వివరాలు పొందు పర్చలేదని.. రాజకీయ పదవి కోసం తాళి కట్టిన భార్యనే కాదనుకున్నాడంటూ సాక్షి కథంన ప్రచురించింది. నారాయణ చర్యలతో ఇన్నాళ్లు అతడి జీవిత భాగస్వామిగా ఉన్న ఆమె.. ఇప్పుడు ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది అని చెప్పుకొచ్చింది

ఎన్నికల్లో భాగంగా నారాయణ సమర్పించిన అఫిడవిట్‌లో తనకు ఒక భార్య, కుమార్తె మాత్రమే ఉన్నట్లు వెల్లడించారు. రెండో భార్య, ఆమె కుమార్తెను చూపించకపోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం ఒక భార్య ఉన్న వారే రాజ్యాంగబద్ధ పదవులకు అర్హులు. ఇంకో భార్య ఉన్నప్పటికీ.. ఆమెకి విడాకులు అయినా ఇచ్చి ఉండాలి. కానీ నారాయణకు ఇద్దరు భార్యలు ఉన్నారు. ఇది అందరికి తెలిసిన సత్యం అంటూ సాక్షిలో ఓ కథనం వచ్చింది.

ఈ మేరకు గతంలో 2014లో ఎమ్మెల్సీ నామినేషన్‌ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో తన భార్య పి. రమాదేవిగా, శారిణి (రెండో భార్య ఇందిర కుమార్తె), కుమారుడు నిషింత్‌ను డిపెండెంట్‌లుగా చూపించారు. వీరు కొడుకు, కూతురు అయినప్పటికి మిగతా ఐఐఐలో వారు తన సంతానంగా స్పష్టంగా పేర్కొనలేదని సాక్షిలో వెల్లడించారు.

2019 ఎన్నికల్లో ఇలా..

2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నారాయణ సమర్పించిన అఫిడివిట్‌లో తన భార్యగా రమాదేవిని మాత్రమే చూపించారు. అయితే అంతకు ముందే కుమారుడు నిషాంత్‌ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో.. తన అఫిడవిట్‌లో రెండో భార్య కుమార్తె శారిణిని సంతానంగా, డిపెండెంట్‌లుగా పేర్కొనకపోవడం గమనార్హం.

2024లో ఇలా..

2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నారాయణ సమర్పించిన అఫిడవిట్‌లో తన భార్య రమాదేవిని మాత్రమే చూపించారు. కానీ ఎక్కడా కుమార్తెలు ఉన్నట్లుగా చూపించకపోగా.. శారిణి, సింధూర వద్ద అప్పులు తీసుకున్నట్లు అఫిడవిట్‌లో చూపించడం సంచలనంగా మారింది.

ఇందిర నారాయణ రెండో భార్యే..

పొంగూరు ఇందిర.. నారాయణ రెండో భార్యే అనడానికి అనేక ఆధారాలు ఉన్నాయి. 1996లో ఏర్పాటు చేసిన నారాయణ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ సంస్థలో ఇందిర భర్త పొంగూరు నారాయణగా ఆమె చైర్మన్‌ హోదాతో ఉన్నట్లు ట్రస్ట్‌ బోర్డులో రిజి్రస్టేషన్‌ డాక్యుమెంట్లు నిర్థారణ చేస్తున్నాయి. అయితే 2014లో మాత్రం ఎన్నికల కోసం ఆమెతో రాజీనామా చేయించారు. అలానే 2011-2020 వరకు నారాయణ ఎడ్యుకేషన్‌ సోసైటికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్‌ అకౌంట్‌లో లావాదేవీల విషయంలో కూడా ఇందిర సంతకం ఉంది.

ఇకపోతే నారాయణ.. తన రెండో భార్య ఇందిరకు కోర్టు ద్వారా విడాకులు ఇచ్చినట్లు.. ఎక్కడా ఎలాంటి ఆధారాల్లేవని సాక్షి కథనంలో పేర్కొన్నారు. పైగా ఆమె పాస్‌పోర్టు పరిశీలిస్తే.. ఇందిర నారాయణ భార్య అని స్పష్టం అవుతుంది అంటున్నారు. అంతేకాక ఇందిర కుమార్తె శారిణి పాస్‌పోర్ట్‌లో తన తండ్రి నారాయణగా ఉన్నట్లు సమాచారం. అయితే నారాయణ మంత్రి అయ్యాక వీకీపీడియాలో మాత్రం భార్య రమాదేవి, కుమార్తెలు సింధూర, శారిణి, కుమారుడు నిషాంత్‌ (లేట్‌) అనే విషయాలు రికార్డు చేసి ఉండడం విశేషం.

శారిణికి కన్యాదానం చేసిన నారాయణ..

నారాయణ గతంలో మంత్రి పదవి చేపట్టిన తర్వాత కొంత కాలానికి కుమారుడు హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు తన రెండో భార్య ఇందిర కుమార్తె శారిణికి టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజతో వివాహం జరిగింది. ఆ వివాహ సందర్భంలో నారాయణ, ఇందిర దంపతులుగా వ్యవహరించి కన్యాదానం చేశారని సాక్షి కథనంలో వెల్లడించారు. అలాగే నారాయణ ఎడ్యుకేషనల్‌ సోసైటీ మేనేజ్‌మెంట్‌ కమిటీ మెంబర్‌గా శారిణి, రవితేజగా వ్యవహరిస్తున్నారు. అన్ని సందర్భాల్లో ఇందిరను భార్యగా చూపిస్తున్న నారాయణ ఎన్నికల అఫిడవిట్‌లో మాత్రం చూపించకపోవడం విశేషం.

నారాయణ అక్రమాలపై వైసీపీ దృష్టి..

నారాయణ ఎన్నికల అక్రమాలపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. గతంలో 2014. 2019 ఎన్నికల వేళ నారాయణ అఫిడవిట్‌ వివరాలను వైసీపీ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈసారి దీనిపై దృష్టి సారించింది. అంతేకాక గత ఎన్నికల వేళ, ఇప్పుడు నారాయణ సమర్పించిన అఫిడవిట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. వీటిల్లో ఎక్కడా కూడా నారాయణ తనకు ఇద్దరు భార్యలు, ముగ్గురు సంతానం ఉన్నట్లు చూపించకపోవడంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది.

ప్రధానంగా నారాయణ భార్యగా రికార్డుల్లో ఉన్న ఇందిరతో విడాకులు తీసుకున్నట్లు ఎక్కడా ఆధారాలు లేవు. అలానే ఆయనకు ముగ్గురు సంతానం అనేదానికి సైతం ఆధారాలు సేకరించారు. ప్రస్తుతం కుమారుడు చనిపోయినప్పటికీ ముగ్గురు సంతానం అనే నిబంధన నారాయణకు వర్తిస్తుందని ఎన్నికల కమిషన్‌ నియమావళి చెబుతోంది. వీటిపై దృష్టిసారించిన వైఎస్సార్‌సీపీ నారాయణ అఫిడవిట్‌పై పోరాటం చేయడానికి సిద్ధమైంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి