iDreamPost

Exit poll: ఎగ్జిట్ పోల్స్ అంటే ఏమిటి? అవి ఎలా ఇస్తారో తెలుసా?

దేశంలో ఎన్నికలు ఎక్కడ జరిగిన వినిపించే పేరు ఎగ్జిట్ పోల్స్. తాజాగా గురువారం తెలంగాణ ఎన్నికల ముగిసిన తరువాత ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలపై ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అంటే ఏమిటి? అవి ఎలా నిర్వహిస్తారు.. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

దేశంలో ఎన్నికలు ఎక్కడ జరిగిన వినిపించే పేరు ఎగ్జిట్ పోల్స్. తాజాగా గురువారం తెలంగాణ ఎన్నికల ముగిసిన తరువాత ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలపై ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అంటే ఏమిటి? అవి ఎలా నిర్వహిస్తారు.. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

Exit poll: ఎగ్జిట్ పోల్స్ అంటే ఏమిటి? అవి ఎలా ఇస్తారో తెలుసా?

వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గా తెలంగాణతో ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే.. ఇక్కడ బీఆర్ఎస్,కాంగ్రెస్ మధ్య హోరాహోరి పోటి సాగింది. హ్యాట్రిక్ కొట్టాలని అధికార బీఆర్ఎస్ భావిస్తుండగా, ఎలాగైనా ఈ సారి గెలిచి తీరాలి కాంగ్రెస్  భావిస్తోంది. నేటితో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. ఈ నేపథ్యంలోనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల ప్రకారం చూస్తే.. తెలంగాణలో హంగ్ వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. కాసేపటి క్రితమే వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. అయితే వివిధ సంస్థలు వివిధ రకాలుగా ఫలితాలను విడుదల చేశాయి. ఓవరాల్ గా చూస్తే.. తెలంగాణలో హంగ్ వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అలానే మిగిలిన నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ వచ్చాయి. అక్కడ కూడ కాంగ్రెస్, బీజేపీ మధ్య టఫ్ వార్ కనిపిస్తోంది. అయితే ఎగ్జిట్ పోల్స్  విషయం గురించి అందరిలో పలు సందేహాలు ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంటే ఏమిటి? అవి ఎలా నిర్వహిస్తారు? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ఎగ్జిట్ పోల్స్ అంటే  ఏమిటి?

ఎలక్షన్స్ లో భాగంగా కొన్ని మీడియా సంస్థలతో పాటు మరికొన్ని ప్రత్యేక సంస్థలు ప్రి పోల్స్, ఎగ్జిట్ పోల్స్ అనే రెండు రకాల సర్వేలు నిర్వహిస్తుంటాయి. పోలింగ్ జరగటాని కంటే ముందు నిర్వహించే సర్వేలను ప్రీపోల్స్ అంటారు. అంటే ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందు, పొత్తుల అంశం తేలక ముందు, సీట్ల సర్దుబాటుపై స్పష్టత రాకముందు, పార్టీలు అభ్యర్థులను ప్రకటించక ముందు, పోలింగ్ తేదీకి చాలా రోజుల ముందు, లేదా పోలింగ్ తేదీ సమీపించినప్పుడు అసెంబ్లీల వారీగా ఈ ప్రీ పోల్ సర్వే నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా కొంతమంది ఓటర్లను ర్యాండమ్‌గా ఎంపిక చేసుకుని సర్వే నిర్వహిస్తారు. అలా ఓటర్లతో మాట్లాడి.. ఏ పార్టీకి  విజయావకాశలు ఎక్కువ ఉందనే విషయాన్ని సేకరించి పోల్ ఫలితాలు వెల్లడిస్తారు. ఎగ్జీట్ పోల్ సర్వే.. అనేది ప్రి పోల్స్ సర్వేకు తేడా ఉంది. పోలింగ్ జరిగిన రోజే ఓటరు మనోగతం తెలుసుకుంటూ సర్వే నిర్వహించడమే ప్రి పోల్స్.

ఎగ్జిట్ పోల్స్ జరిగే తీరు:

పోలింగ్ జరిగే సమయంలోఈ ఎగ్జిట్ పోల్ నిర్వహిస్తారు. ఎంపిక చేసిన పోలింగ్ కేంద్రాలకు ఆయా సంస్థల ప్రతినిధులు వెళ్తారు. వారు అక్కడ ఉన్న ఓటర్లు ఎక్కువమంది ఏ పార్టీకి ఓటు వేస్తారో ఒక అంచనాకు వస్తారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో సేకరించిన సమాచారంతో ఏ నియోజవర్గంలో ఓ పార్టీ విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉందో ఓ నిర్ణయానికి వస్తారు. అలా నియోజవర్గాల వారిగా వచ్చిన సర్వేతో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో ఓ అంచనాకు వస్తారు. ఎగ్జిట్‌పోల్లో పోలింగ్ రోజే.. ఓటింగ్‌లో పాల్గొన్నవారిని ప్రశ్నించి సమాచారం సేకరిస్తారు.

ఎగ్జిట్‌ పోల్స్‌ నిజమెంతా?

ప్రి పోల్ సర్వేలతో పోలిస్తే ఎగ్జిట్ పోల్స్‌లో కచ్చితత్వానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎగ్జిట్ పోల్ అంచనాలు అసలు ఫలితాలకు దాదాపు దగ్గరగా ఉంటాయి. అలాంటి ఘటనలు అనేకం జరిగాయి. పోలింగ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతుంది. సర్వే నిర్వాహకులు దాదాపు అన్ని వర్గాల ఓటర్లు వేర్వేరు సమయాల్లో కలిసి వారి స్పందనను తెలుసుకుంటారు. కానీ ఈ ప్రక్రియను ఎంత ఎక్కువ మంది పకడ్బందీగా, విస్తృతంగా నిర్వహిస్తేనే కచ్చితమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కానీ నామాత్రంగా చేస్తే.. ఫలితాలు పూర్తి భిన్నంగా వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకే కొన్ని సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ పూర్తి రివర్స్ గా ఉంటాయి. మరికొన్ని నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ కు ఫలితాలు దగ్గరా ఉంటాయి. అంటే ఈ ప్రక్రియను ఎంత ఎక్కువ మంది పకడ్బందీగా, విస్తృతంగా నిర్వహిస్తేనే అంత ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి