iDreamPost

సామాన్యులు కొనేలా చిట్టి ఎలక్ట్రిక్ బైక్! రూ.3 ఖర్చుతో 60 కి.మీ. ప్రయాణం..

Budget Electric Bike: ప్రస్తుతం ఎలక్ట్రిక్ బైకులు కూడా ధరలు మండిపోతున్నాయి. లక్ష లేనిదే బండి కొనే పరిస్థితి లేదు. అందుకో చాలామంది విద్యుత్ వాహనాల వైపు చూడటం లేదు. అలాంటి వారికి ఈ చిట్టి బైక్ గొప్ప వరం అనే చెప్పాలి.

Budget Electric Bike: ప్రస్తుతం ఎలక్ట్రిక్ బైకులు కూడా ధరలు మండిపోతున్నాయి. లక్ష లేనిదే బండి కొనే పరిస్థితి లేదు. అందుకో చాలామంది విద్యుత్ వాహనాల వైపు చూడటం లేదు. అలాంటి వారికి ఈ చిట్టి బైక్ గొప్ప వరం అనే చెప్పాలి.

సామాన్యులు కొనేలా చిట్టి ఎలక్ట్రిక్ బైక్! రూ.3 ఖర్చుతో 60 కి.మీ. ప్రయాణం..

దేశవ్యాప్తంగా పెట్రోల్- డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇటీవల కేంద్రం నిర్ణయంతో పెట్రోలు, డీజిల్ పై లీటరుకు 2 రూపాయల ధర తగ్గింది. కానీ, అది తాత్కాలిక ఊరట మాత్రమే అవుతుంది. మళ్లీ కొన్నిరోజుల్లో ఆ ధర పెరిగకుండా ఉండదు. అందుకే చాలామంది ఈ పెట్రోల్ బాదుడు తట్టుకోలేక ఎలక్ట్రిక్ బైకులు కొంటున్నారు. కానీ, దానివల్ల కూడా బాదుడు తప్పడం లేదు. కేంద్రం ఇచ్చే సబ్సిడి తీసేసిన తర్వాత కూడా ఈవీ బైక్స్ ధరలు లక్ష రూపాయల పైనే ఉంటోంది. చాలామంది ఈ ధరలు తట్టుకోలేక ఈవీ బైక్ కొనాలి అంటే హడలెత్తిపోతున్నారు. అలాంటి వారికోసం ఇప్పుడు విజయవాడ కుర్రాళ్లు ఒక అద్భుతమైన చిట్టి ఈవీని తీసుకొచ్చారు.

పెరుగుతున్న పెట్రోల్ ధరలు, మండిపోతున్న ఈవీ బైకుల రేట్ల నుంచి తప్పించుకునేందుకు విజయవాడ కుర్రాళ్లు ఒక అద్భుతమైన విద్యుత్ వాహనాన్ని ఆవిష్కరించారు. దానికి చిట్టి ఎలక్ట్రిక్ అని పేరు పెట్టారు. అది చూడటానికి ధనుష్ రఘువరన్ బీటెక్ అనే సినిమాలో వాడే చిన్న లూనా తరహాలా ఉంటుంది. దీనిని విజయవాడ వీఆర్ సిద్ధార్ధ ఇంజినీరింగ్ విద్యార్థులు అవినాష్, మురళీకృష్ణారెడ్డి సంయుక్తంగా తయారు చేశారు. ఈ చిట్టి ఎలక్ట్రిక్ బైక్ తయారు చేయడానికి 2 నెలల సమయం పట్టిందన్నారు. దీని ధర రూ.35 వేలు ఉంటుందన్నారు. చూడటానికి చిన్నగానే ఉన్నా ఇందులో చాలానే అద్భుతాలు ఉన్నాయి.

chitti

ఫీచర్స్ ఇవే:

ఈ చిట్టి ఎలక్ట్రిక్ బైక్ ని కేవలం 2 గంటల్లో ఛార్జింగ్ చేయచ్చు. ఒకసారి ఛార్జ్ చేసిన తర్వాత ఈ బైక్ మీకు 60 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. గంటకు 25 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించగలదు. మీరు దగ్గర దూరాలకు, ఆఫీస్ కు వెళ్లేందుకు ఈ బైక్ బాగుంటుంది. ఇది ఫుల్ ఛార్జ్ కావడానిక కేవలం అర యూనిట ధర మాత్రమే ఖర్చవుతుంది. అంటే గరిష్టంగా 3 రూపాయలు ఖర్చు. అంటే మీరు 3 రూపాయల ఖర్చుతో 60 కిలోమీటర్లు ప్రయాణం చేయచ్చు. దీని మీద చిన్నపాటి లగేజ్ ని కూడా పెట్టుకోవచ్చు. దీనికి జీపీఎస్ సిస్టమ్ కూడా ఉంది. మీ బైక్ ఎటు వెళ్తుందో.. ఏ రూట్ లో ట్రావెల్ చేస్తోందో తెలుసుకోవచ్చు. అలాగే మీరు ఒకసారి ఈ చిట్టి ఈవీని లాక్ చేస్తే ఎవరూ దానిని కదిలించలేరు. అలా కదిలించాలని చూస్తే సౌండ్ చేస్తుంది. ఈ బైక్ నడిపేందుకు లైసెన్స్, రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు.

అలాగే ఈ బైక్ ని ఎవరన్నా దొంగిలిస్తే దానిని తిరిగి కనుక్కోవడం కూడా చాలా ఈజీ. ప్రస్తుతం వీళ్లు ఈ బైక్ ని అప్ గ్రేడ్ చేసే పనిలో ఉన్నారు. దానికి పెడల్ సిస్టమ్ అమర్చే దిశగా అడుగులు వేస్తున్నారు. అలా పెడల్స్ పెడితే ఈ బైక్ రేంజ్ 60 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్లకు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే వెనకాల డిటాచ్ చేసుకునేలా క్యారియర్ ని కూడా ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. అది ఉంటే రైతులు, డెలివరీ బాయ్స్ కి సౌకర్యంగా ఉంటుందని చెప్తున్నారు. మరో 4 నెలల్లో ఈ అప్ గ్రేడెట్ వర్షన్ ని తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామని చెప్పారు. మరి.. ఈ చిట్టి ఎలక్ట్రిక్ బైక్ ఫీచర్స్, ధరపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి