iDreamPost
android-app
ios-app

మతిపోగొడుతున్న TATA కొత్త EV ఫీచర్స్.. సెగ్మెంట్ లోనే తొలిసారి!

Rumored And Leaked Price And Specifications Of TATA Curvv EV: టాటా కంపెనీ నుంచి ఏ కొత్త కారు వచ్చినా దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఏర్పడుతుంది. ఇప్పుడు టాటా కంపెనీ తమ ఈవీ సెగ్మెంట్ నుంచి ఒక సరికొత్త కారును తీసుకొస్తోంది. అది కూడా అదిరిపోయే సేఫ్టీ ఫీచర్స్ ఉండటం విశేషం.

Rumored And Leaked Price And Specifications Of TATA Curvv EV: టాటా కంపెనీ నుంచి ఏ కొత్త కారు వచ్చినా దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఏర్పడుతుంది. ఇప్పుడు టాటా కంపెనీ తమ ఈవీ సెగ్మెంట్ నుంచి ఒక సరికొత్త కారును తీసుకొస్తోంది. అది కూడా అదిరిపోయే సేఫ్టీ ఫీచర్స్ ఉండటం విశేషం.

మతిపోగొడుతున్న TATA కొత్త EV ఫీచర్స్.. సెగ్మెంట్ లోనే తొలిసారి!

కార్స్ లో టాటా కంపెనీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అలాగే సేఫ్టీ పరంగా కూడా టాటా కార్లు ఒక అడుగు ముందే ఉంటాయి. ఇప్పటికే ఆ విషయం చాలా సందర్భాల్లో రుజువైంది కూడా. ఇప్పుడు అదే నమ్మకాన్ని ఎలక్ట్రిక్ కార్లలోకి కూడా తీసుకొస్తున్నారు. తాజాగా టాటా కంపెనీ నుంచి ఒక కొత్త ఈవీ మార్కెట్ లోకి రాబోతోంది. దాని అధికారిక లాంఛ్ ని ఆగస్టు 7వ తారీఖున ప్లాన్ చేశారు. అయితే అంతకంటే ముందే ఆ కారుకు సంబంధించిన కొన్ని ఫీచర్స్ అయితే నెట్టింట వైరల్ అవుతున్నాయి. అలాగే ఈ సరికొత్త ఈవీ రోడ్లపై కూడా దర్శనమించ్చింది. లాంఛ్ నేపథ్యంలో ఆ పిక్స్ ఇంకా వైరల్ అవుతున్నాయి.

ఇప్పుడు టాటా ఈవీ మరేదో కాదు.. కర్వ్. అవును ఈ కర్వ్ ఈవీని టాటా మోటార్స్ ఆగస్టు 7న లాంఛ్ చేయబోతోంది. ఇప్పటి వరకు ఈ కారుకు సంబంధించి కాన్సెప్ట్ వీడియోనే తెలుసు. తాజాగా కొన్ని అధికారిక పిక్స్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ లుక్స్ చూసిన తర్వాత ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కూప్ మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. లుక్స్ చూస్తే ఎంతో ప్రీమియంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ కర్వ్ డిజైన్ కు వినియోగదారులు ఫిదా అయిపోతున్నారు. ఇంక ఫీచర్స్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే. ఎందుకంటే ఇప్పటివరకు రూమర్డ్ ఫీచర్స్ గురించే తెలుస్తున్నా కూడా వాటికి మించే సర్ ప్రైజులు ఉండే ఛాన్స్ ఉంది.

ముఖ్యంగా ఈ కర్వ్ లుక్స్ గురించి మాట్లాడుకోవాలి. దీని లుక్స్ బ్యాక్ సైడ్ నుంచి చూడటానికి లాంబొర్గినీ ఉరుస్ నుంచి ఇన్ స్పైర్ అయినట్లు దాని లుక్స్ కనిపిస్తున్నాయి. ఇంక ఫ్రంట్ ఎండ్ చూస్తుంటే మీకు హారియర్ గుర్తొస్తుంది. ఈ ఎస్యూవీ కూప్ మొదటి రివీల్ లోనే అందరి మనసులు దోచేసింది. డిజైన్ లో బ్యాక్ సైడ్ కనెక్టెడ్ ఎల్ఈడీ బార్ ఉంది. అలాగే దానిని కెనెక్ట్ చేస్తూ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. కింద మీకు మళ్లీ అదనంగా రిఫ్లెక్టర్స్ ఉన్నాయి. అలాగే బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో బ్యాక్ సైడ్ బంపర్ ని అయితే డిజైన్ చేశారు. షార్క్ ఫిన్ ఆంటీనా కూడా ఉంది.

లోగో కింద మీకు రివర్స్ పార్కింగ్ కోసం కెమెరా కూడా ఉంది. ఫ్లష్ ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. గ్లాస్ బ్లాక్ షేడ్ వీల్ ఆర్క్ క్లాడింగ్ ఉంది. ఎయిరో ఇన్ సెర్ట్స్ తో ఆల్ న్యూ అలోయ్ వీల్స్ ఉన్నాయి. రోడ్డు మీద కనిపించిన మోడల్ కి అయితే బ్లాక్డ్ అవుట్ రూఫ్ కూడా ఉంది. ఇది మిడ్ రేంజ్ ఎస్యూవీగా చెప్తున్నారు. ఇది టాటా నెక్సన్ కంటే ఎక్కువగా.. టాటా హ్యారియర్ కంటే తక్కువ రేంజ్ లో ఉంటుంది అనేది టాక్. దాన్ని బట్టి చూస్తే ఈ కర్వ్ ఈవీ ధర రూ.20 లక్షల నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది అంటున్నారు.

ఫీచర్స్- స్పెసిఫికేషన్స్:

ఈ కర్వ్ ఈవీ బ్యాటరీ గురించి మాట్లాడుకోవాలి. మిడ్ రేంజ్ మోడల్ లో 40.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ కెపాసిటీతో ఉండచ్చు. అంటే అచ్చం నెక్సన్ ఈవీ తరహాలోనే. ఇది 450 నుంచి 500 కిలో మీటర్ల రేంజ్ ని ఇస్తుంది అంటున్నారు. ఇంక 55 కెడబ్ల్యూహెచ్ బ్యాటరీ కెపాసిటీతో కూడా ఇందులో ఒక వేరియంట్ ఉండచ్చు అంటున్నారు. దాని రేంజ్ దాదాపుగా ఫుల్ ఛార్జ్ చేస్తే 600 కిలోమీటర్ల వరకు ఉండచ్చు అనేది టాక్. టాటా కంపెనీ ఈవీ సెగ్మెంట్లోనే ఇది బిగ్గెస్ట్ బ్యాటరీ అవుతుంది. ఈ కర్వ్ ఈవీలో సేఫ్టీ పరంగా కూడా చాలానే ఫీచర్స్ ఉన్నాయి. లెవల్ 2 ADAS ఫీచర్స్ ఇందులో ఉంటాయని చెబుతున్నారు.

360 డిగ్రీ కెమెరా, ఎమర్జెన్సీ బ్రేకింగ్, కొలైషన్ అలర్ట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, రేర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, డోర్ ఓపెన్ అలర్ట్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, హై భీమ్ అసిస్టెన్స్, ఆవ్ వీల్ డిస్క్ బ్రేక్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఫుల్లీ డిజిటల్ ఇన్ స్ట్రుమెంటల్ క్లస్టర్, ఫ్లోటింగ్ టైప్ టచ్ స్క్రీన్ ఇన్పోటన్మెంట్ టచ్ స్క్రీన్, లెథ్రెట్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, పానరోమిక్ సన్ రూఫ్, ఆటోమేటిక్ వెదర్ కంట్రోల్ వంటి ఫీచర్స్ ఉండే అవకాశం ఉంది. ఈ టాటా కర్వ్ ఈవీ మార్కెట్ లో ఉన్న మహీంద్రా ఎక్స్యూవీ 400 ఈవీ, బీవైడీ అట్టో 3, ఎంజీ జడ్ఎస్ ఈవీలకు గట్టి పోటీ ఇస్తుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి