iDreamPost

ఫ్యామిలీ సినిమాకు ఇంత భారీ బడ్జెటా?

ఫ్యామిలీ సినిమాకు ఇంత భారీ బడ్జెటా?

ఇండస్ట్రీ ముఖ్యంగా మన దక్షిణాదిలో హీరోల మీదే బిజినెస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అందుకే స్టార్లు ఎంత డిమాండ్ చేసినా నిర్మాతలు ఇచ్చేందుకు రెడీ అవుతారు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో నిర్మాత దిల్ రాజు అలా తీసుకోవడం తప్పేమీ కాదన్న రీతిలో మార్కెట్ డిమాండ్ సప్లై సూత్రాన్ని వివరించారు. ఆయన అలా ఎందుకు అన్నారో ఇప్పుడు క్లారిటీ వచ్చింది. హీరో విజయ్ కు ఈ సినిమాకు గాను అక్షరాలా 105 కోట్ల పారితోషికం ముట్టిందట. 19 కోట్ల జిఎస్టి దీనికి అదనం. అంటే ఒక్క హీరో రెమ్యునరేషనే ఏకంగా ఓ పది మీడియం బడ్జెట్ చిత్రాలతో సమానమన్న మాట. ఈ లెక్కన అతని క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ఈజీగా అర్థం చేసుకోవచ్చు.

దర్శకుడు వంశీ పైడిపల్లికి పదిహేను కోట్లు ముట్టిందని టాక్. రష్మిక ఇతర భారీ తారాగణం మొత్తం కలిపి కేవలం క్యాస్టింగ్ అండ్ టీమ్ కోసమే నూటా యాభై కోట్లకు దాకా లెక్క తేలుతుంది. ఇక నిర్మాణ వ్యయం ఓ వంద కోట్ల దాకా వేసుకోవచ్చు. ఇంత ఖర్చు పెట్టినా మొత్తం థియేటర్ డీల్స్ కు ముందే వచ్చేసిందంటే అనూహ్యమే. వారసుడు గ్రాఫిక్స్ ఉన్న మూవీ కాదు. రెగ్యులర్ కమర్షియల్ డ్రామా. దూరంగా వెళ్ళిపోయిన కొడుకు, కుటుంబ కలహాలు, విలన్ల రాజకీయాలు, ఓ అమ్మాయితో ప్రేమాయణం ఇలా ఫక్తు ఫార్ములా స్టైల్ లో సాగుతుంది. అయినా కూడా విజయ్ పేరు మీద ఈ స్థాయిలో అమ్ముడుపోవడమంటే మాటలు కాదు. అందరికీ జరిగేది కాదు.

ఇంత ఖర్చు పెట్టినా విజయ్ కున్న అతి పెద్ద ప్లస్ పాయింట్ మాస్ ఫాలోయింగ్. పోలీసోడు, అదిరింది, విజిల్, బీస్ట్ లలో ఎన్నడూ చూడని కథలు గట్రా ఉండవు. ఆల్రెడీ ట్రై చేసిన ఫార్ములాలోనే సాగుతాయి. కానీ విజయ్ వల్లే అవి అంతకంతా పెట్టుబడులతో పాటు భారీ లాభాలు ఇచ్చాయి. ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కి రెండు వందల కోట్లు ఖర్చు పెట్టించి రాబట్టే రేంజని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మురిసిపోతున్నారు. తెలుగులో గొప్పగా ఆడినా ఆడకపోయినా వారసుడు తమిళం నుంచే ఈజీగ్గా వర్కౌట్ అయిపోతుంది. అందుకే దిల్ రాజు అంత కాన్ఫిడెంట్ గా దీని మీద ఇంత పెట్టుబడి పెట్టారు. జనవరి 12 విడుదల కాబోతున్న ఈ సినిమాకు తునివు గట్టి పోటీ ఇస్తోంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి