iDreamPost

మహిళలకు శుభవార్త.. ఖాతాల్లోకి రూ.51 వేలు.. వీరే అర్హులు

  • Published Jun 17, 2024 | 2:35 PMUpdated Jun 17, 2024 | 2:35 PM

సమాజంలోని బడుగు, బలహీన వర్గాల వారిని ఆదుకోవడం కోసం ప్రభుత్వాలు అనేక పథకాలు తీసుకువస్తున్నాయి. ఈ క్రమంలో మహిళలకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం. వారి ఖాతాలో 51 వేల రూపాయలు జమ చేయనుంది. ఆ వివరాలు..

సమాజంలోని బడుగు, బలహీన వర్గాల వారిని ఆదుకోవడం కోసం ప్రభుత్వాలు అనేక పథకాలు తీసుకువస్తున్నాయి. ఈ క్రమంలో మహిళలకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం. వారి ఖాతాలో 51 వేల రూపాయలు జమ చేయనుంది. ఆ వివరాలు..

  • Published Jun 17, 2024 | 2:35 PMUpdated Jun 17, 2024 | 2:35 PM
మహిళలకు శుభవార్త.. ఖాతాల్లోకి రూ.51 వేలు.. వీరే అర్హులు

సమాజంలోని అన్ని వర్గాలు వారు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రారంభిస్తున్నాయి. మరీ ముఖ్యంగా పేదలు, మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించడం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. అయితే వీటిల్లో చాలా స్కీమ్‌ల గురించి జనాలకు పెద్దగా తెలియదు. ఇక గత కొంత కాలం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. వీటి ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేస్తూ.. వారు ఆర్థికంగా వృద్ధిలోకి వచ్చేందుకు తోడ్పాటు అందిస్తున్నాయి. అలాంటి ఓ పథకం గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఈ స్కీమ్‌ కింద మహిళల ఖాతాలో 51 వేల రూపాయలు జమ చేస్తారు. ఇంతకు ఈ పథకం పేరు ఏంటి.. ఎక్కడ అమలవుతుంది.. అర్హులు ఎవరు వంటి పూర్తి వివరాలు మీ కోసం..

పేదింటి ఆడపడుచులను ఆదుకోవడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా పేదింటి ఆడబిడ్డ వివాహాం కోసం ఎంతో కొంత సాయం చేస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో పేద యువతి వివాహం వేళ లక్ష రూపాయలకు పైగా నగదు సాయం చేస్తోన్న సంగతి తెలిసిందే. అలానే ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కూడా పేదింటి యువతుల వివాహానికి ఆర్థిక సహాయం అందిస్తుంది. ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం కింద నిరుపేద యువతి పెళ్లి కోసం ప్రభుత్వం రూ.51 వేలు అందజేస్తుంది. ఈ మొత్తం ఒకేసారి పూర్తిగా ఇవ్వరు. విడతల వారీగా వధువు ఖాతాలో జమ చేస్తారు.

ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం కింద వివాహానంతరం పథకానికి అర్హులైన పేద వధువుల ఖాతాల్లో ప్రభుత్వం రూ.31 వేలు జమ చేస్తుంది. మిగిలిన 20 వేల రూపాయల్లో రెండొంతుల భాగాన్ని అనగా సుమారు 14 వేల రూపాయల వరకు కొత్త దంపతులు నూతన సామాగ్రి కొనుగోలు చేయడం కోసం మంజూరు చేస్తుండగా.. మిగిలిన మొత్తాన్ని పెళ్లి వేడుకలో అలంకరణలకు అయ్యే ఖర్చు కోసం మంజూరు చేస్తారు. ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి సామూహిక వివాహం పథకం కేవలం బీపీఎల్‌ కుటుంబాలకు మాత్రమే వర్తిస్తుంది. వీరికే రూ.51 వేలు ఇస్తారు.

ఇక ఈ పథకానికి అర్హులు కావాలంటే.. వధువు తల్లిదండ్రులు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు అయి ఉండాలి. దీనితో పాటు ఈ పథకం ప్రయోజనాన్ని పొందేందుకు అర్హులైన కుటుంబం వార్షిక ఆదాయం రూ. 2 లక్షలకు మించకూడదు. ఎవరైనా షెడ్యూల్డ్ కులం లేదా ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన వారు ఈ పథకానికి అర్హులు కావాలంటే.. కుల ధృవీకరణ పత్రాన్ని కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం కింద వధువు కనీస వయస్సు 18 సంవత్సరాలు, వరుడి కనీస వయస్సు 21 సంవత్సరాలు ఉండాలని నిర్ణయించారు. దీని వల్ల బాల్య వివాహాలను కూడా నియంత్రివచ్చు అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నియమాలను పెట్టింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి