iDreamPost

Kalki 2898AD: ఆ ప్రాంతంలోని ఐమాక్స్ లో కల్కి షోలు రద్దు.. ఎందుకంటే?

  • Published Jun 26, 2024 | 2:34 PMUpdated Jun 26, 2024 | 3:11 PM

డార్లింగ్ ప్రభాస్, నాగ్ ఆశ్విన్ కాంబినేషన్ లో రూపొందించిన సైన్స్ ఫిక్షన్ డ్రామా కల్కి 2898 AD మరి కొన్ని గంటల్లో వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి టికెట్స్ భారీగా అమ్ముడుకుపోయి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో అక్కడ ఐమాక్స్ లోని కల్కి షోలు రద్దు చేశారు. ఎందుకంటే..

డార్లింగ్ ప్రభాస్, నాగ్ ఆశ్విన్ కాంబినేషన్ లో రూపొందించిన సైన్స్ ఫిక్షన్ డ్రామా కల్కి 2898 AD మరి కొన్ని గంటల్లో వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి టికెట్స్ భారీగా అమ్ముడుకుపోయి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో అక్కడ ఐమాక్స్ లోని కల్కి షోలు రద్దు చేశారు. ఎందుకంటే..

  • Published Jun 26, 2024 | 2:34 PMUpdated Jun 26, 2024 | 3:11 PM
Kalki 2898AD: ఆ ప్రాంతంలోని ఐమాక్స్ లో కల్కి షోలు రద్దు.. ఎందుకంటే?

ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా అందరికీ ప్రభాస్ కల్కి ఫీవర్ పట్టుకుంది. ఈ క్రమంలోనే ఎక్కడ చూసినా కల్కి సినిమా టికెట్ల కోసం సినీ ప్రియులు, ఫ్యాన్స్ తెగ ఆరాటపడుతున్నారు. ఇప్పటికే దేశంలో కల్కి సినిమా టికెట్స్ హాట్ కేక్స్ లా అమ్ముడుకుపోయాయి. మరోవైపు ప్రభాస్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ డే షో చూడాలనే ఆరాటంతో కొంతమంది సోషల్ మీడియాలో బ్లాక్ టికెట్స్ రూపంలో కూడా కొనుగోలు చేస్తున్నారు. అసలే ప్రభాస్, నాగ్ ఆశ్విన్ కాంబినేషనల్ వస్తున్న భారీ బడ్జెట్ సినిమా కావడంతో.. అందరూ కళ్లు ఈ సినిమా మీదనే ఉన్నాయి. పైగా ఈ సినిమాలో అమితాబచ్చన్, దీపికా పదుకొనే, కమలహాసన్, దిశా పటానీ, సస్వత ఛటర్జీ, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మనందం, అన్నాబెన్, శోభన వంటి స్టార్లు నటిస్తుండటంతో.. ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలు నెలకొనున్నాయి. ఎందుకంటే.. అందరూ స్టార్స్ ఒక స్క్రీన్ పై అలరించనున్నారు. అలాగే ఏ పాత్రలో కనిపిస్తారా అనే ఆతృత కూడా చాలామందికి ఉంది. ఇదిలా ఉంటే.. మరి కొన్ని గంటల్లో ఈ సినిమా థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇలాంటి సమయంలో ఆ ప్రాంతంలో ఐమాక్స్ లోని కల్కి షోలు రద్దు చేశారు. కారణమేమిటంటే..

డార్లింగ్ ప్రభాస్, నాగ్ ఆశ్విన్ కాంబినేషన్ లో రూపొందించిన సైన్స్ ఫిక్షన్ డ్రామా ‘కల్కి 2898 AD’ మరి కొన్ని గంటల్లో వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి టికెట్స్ భారీగా అమ్ముడుకుపోయి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇకపోతే సినిమా కూడా విడుదలై భారీ కలెక్షన్స్ తో రికార్డు సృష్టించడానికి రెడీ అయిపోయిది. అయితే మరోపక్క కల్కి సినిమా పై ఇటు సినీ ప్రేక్షకులతో పాటు, డార్లింగ్ ఫ్యాన్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. నార్త్ అమెరికాలో కూడా కల్కి సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఏకంగా లక్ష టికెట్లు అమ్ముడుపోయాయి. అంటే పరిస్థితి ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇలాంటి సమయంలో తాజాగా కెనడాలోని ఐమాక్స్ లో కల్కి సినిమా షోలు రద్దు చేశారు.

అయితే ఐమాక్స్ స్క్రీనింగ్ లతో సమస్యలు వచ్చిన కారణంగా.. నిలిపివేశారని తెలుస్తోంది. పైగా కల్కి హిందీ వర్షన్ కోసం 15 కంటే ఎక్కువ ఐమాక్స్ షోలు ఊహించిన విధంగా రద్దు అయ్యాయి. అంతేకాకుండా.. ఇందుకు సంబంధించి టికెట్స్ బుక్ చేసుకున్న వారికి మెసేజ్ల రూపంలో సమాచారాన్ని అందజేశారు. దీంతో కల్కి సినిమా చూడలనుకునే అభిమానులకు నిరాశ మిగిలడంతో ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి పంచుకున్నారు.ప్రస్తుతం ఈ వార్త స ోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే కల్కి సినిమా రేపు అనగా జూన్ 28వ తేదీన గురువారం వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదల కానుంది. పైగా ఈ సినిమాలో పశుపతి, మృణాల్ ఠాకూర్ కీలక పాత్రల్లో నటించనున్నారు. అలాగే ఈ సినిమా బహుభాషా చిత్రం 3D, 4DX సహా బహుళ ఫార్మాట్లలో విడుదల చేయబడుతుంది.ఇక దీనికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. మరి కెనడాలోని 15 కంటే ఎక్కువ ఐమాక్స్ లోని కల్కి సినిమా నిలిపివేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి