iDreamPost
android-app
ios-app

9 నెలలైనా వీడని మిస్టరీ.. మిస్ అయ్యింది ఓ రాష్ట్రంలో.. బాడీ దొరికిందీ మరో రాష్ట్రంలో

డబ్బులు వసూలు చేసుకొని వస్తానని ఇంట్లో నుండి బయలు దేరింది బీజెపీ నాయకురాలు.. చివరి సారిగా తమ్ముడితో మాట్లాడింది. ఆ తర్వాత ఆమె జాడ కానరాలేదు. కానీ అనూహ్యంగా మరో రాష్ట్రంలో..

డబ్బులు వసూలు చేసుకొని వస్తానని ఇంట్లో నుండి బయలు దేరింది బీజెపీ నాయకురాలు.. చివరి సారిగా తమ్ముడితో మాట్లాడింది. ఆ తర్వాత ఆమె జాడ కానరాలేదు. కానీ అనూహ్యంగా మరో రాష్ట్రంలో..

9 నెలలైనా వీడని మిస్టరీ..  మిస్ అయ్యింది ఓ రాష్ట్రంలో.. బాడీ దొరికిందీ మరో రాష్ట్రంలో

బీజెపీ నాయకురాలు అనుమానాస్పద రీతిలో మరణించి తొమ్మిది నెలలైనా ఆమె ఎలా చనిపోయిందో ఇప్పటి వరకు తెలియలేదు. పోలీసులకు ఈ కేసు అంతుపట్టడం లేదు. దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఇంకా ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించలేదు. ఆ హత్య ఓ మిస్టరీగానే మారిపోయింది. టాటూ ఆధారంగా ఆమెను గుర్తించగా.. పోలీసుల విచారణ చేపట్టగా..పురోగతి లేదు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ పోలీసులకు కొరకరాని కొయ్యగా మారింది ఈ కేసు. అసలు ఆమె ఎలా అదృశ్యమైంది.. ఎక్కడ చనిపోయింది.. అసలు ఏం జరిగిందో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. అసలు ఈ కేసు గురించి తెలియాలంటే.. గతంలోకి వెళ్లాల్సిందే.

మధ్యప్రదేశ్ బీజెపీ నాయకురాలు మమతా యాదవ్.. గత ఏడాది సెప్టెంబర్‌లో తనకు తెలిసిన వ్యక్తి నుండి రూ. 7 లక్షలు రికవరీ చేసుకోవడానికి, ప్రయాగ్ రాజ్ వెళుతున్నానని ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పి బయలు దేరింది. సెప్టెంబర్ 11న బయలు దేరిన ఆమె.. చివరి సారిగా అదే నెల 21న తన సోదరుడితో మాట్లాడింది. ఆ తర్వాత ఆమె కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పెద్దగా పట్టించుకోలేదు. దర్యాప్తును కూడా లైట్ తీసుకున్నారు.  సెప్టెంబర్ 26న పోలీసులు యుపీలో ఓ మృతదేహాన్ని గుర్తించి.. కుటుంబ సభ్యులను పిలువగా.. టాటూ ఆధారంగా ఆమెను గుర్తించారు. అనంతరం ప్రయాగ్ రాజ్‌లో పాతిపెట్టారు. ఫిబ్రవరిలో క్లెయిమ్ చేయని మృతదేహాల ఫోటోలున్నాయిని, అందులో మీ సోదరి ఉందేమోనని, ఓ సారి ప్రయాగ్ రాజ్‌కు రావాలంటూ పోలీసులు మమత సోదరుడు రాజ్ భాన్‌ను పిలిచారు.

కాగా, మమతకు హిందూ సంప్రదాయాల ప్రకారం దహనం చేస్తామని పోలీసులు తెలిపినా అందుకు కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ఆమె అంత్యక్రియలు గౌరవప్రదంగా నిర్వహించాలనుకుంటున్నామని ఆమె తల్లి రైనా బాయి తెలిపింది. కాగా, తమ్ముడు రాజ్ భాన్ మాట్లాడుతూ.. తన ప్రాణాలకు ముప్పు ఉందని ఫోనులో మమత తెలిపిందని, ఈ విషయంపై పోలీసులకు పలుమార్లు చెప్పినప్పటికీ సరిగ్గా పట్టించుకోలేదని చెబుతున్నాడు. తన సోదరి వద్ద కొన్ని పెన్ డ్రైవ్స్ ఉన్నాయని, అందులో రాజకీయ నేతలకు సంబంధించిన సున్నితమైన సమాచారం ఉందని, ఈ కారణంగానే ఆమె హత్య జరిగి ఉంటుందన్న అనుమానం వ్యక్తం చేశాడు. రాజకీయ కారణాలతోనే మమతను చంపేసి ఉంటారని భావిస్తున్నాడు. అలాగే ఈ కేసుపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. కానీ ఈ కేసు ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు.